Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువిద్యస్టేట్ న్యూస్

ఆర్థిక మాంద్యం ఉన్న ఏ పథకం కూడా ఆగలేదు:మంత్రి వేముల

వేల్పూర్, భీమ్గల్: (ఆదాబ్ హైదరాబాద్):ఆర్థిక మాంద్యంతో డబ్బులకు ఇబ్బందిగా ఉన్నా కూడా పేదలు, రైతులను ఆదుకునే ఏ పథకాలు కూడా ఆపబోమని రాష్ట్ర ఆర్ అండ్ బి, శాసనసభ వ్యవహారాల శాఖా మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం నాడు ఆయన వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో గొర్రెలను, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు,  అదేవిధంగా  బీమ్ గల్ మున్సిపాలిటీ పరిధిలో  మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలుగా కడుపు కట్టుకొని పనిచేస్తున్నారని  రెండు వందల కిలోమీటర్లు దూరం నుండి కాలేశ్వరం నీటిని ఉల్టా తీసుకువచ్చామని ఇప్పుడు నీటి సమస్య లేదన్నారు. పొలాల్లోకి నీళ్లు రావాలని తపన నెరవేరిందన్నారు. మాపై,  ముఖ్యమంత్రి గారి పై, ప్రభుత్వం పై ఎటువంటి ఆరోపణలు లేవు అన్నారు.22వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని కరెంటు ని బాగా చేసుకున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఇతర పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి పెన్షన్లు 2 వేల రూపాయలు లు ఇస్తున్నామని 57 ఏళ్ల వయసు వారికి కూడా పెన్షన్లు ఇవ్వడానికి వివరాలు సిద్ధం చేశామన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా పండుగ రోజున పాత చీర కట్టుకోకుండా ఒక అన్నగా, ఒక మేనమామ గా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త చీరలు అందిస్తున్నారని, పండుగనాడు పేద మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేశ్వరం పనులు ఆపకూడదనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు.భీమ్గల్ లో మాట్లాడుతూ, నియోజకవర్గంలో సుమారు లక్షమంది అక్కాచెల్లెళ్లకు చీరల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మంచి నాణ్యతతో చీరలను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 12 వేల మంది చేనేత కార్మికులకు మిషన్ మగ్గాలను ముఖ్యమంత్రి గారు అందించారన్నారు. వాటితో వారు సంవత్సరమంతా ఈ చీరలు తయారు చేయడం ద్వారా వారికి ఉపాధి తో పాటు మంచి చీరలను అందిస్తున్నారన్నారు .
చెక్ డ్యాముల ద్వారా అన్ని గ్రామాలకు నీరు అందడం లేదని మండలంలోని అన్ని గ్రామాలకు కాలేశ్వరం నీరు వచ్చిన నాడు తనకు సంతృప్తి అని ఆ రోజు రావాలని కోరుకుంటున్నారని ఇందుకోసం తను ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. 70 కిలోమీటర్ల దూరంలోని ఎస్సారెస్పీ నుండి నీటిని ఫిల్టర్ చేసి భీమ్గల్ కు త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. భీమ్గల్ పట్టణంలో రోడ్లను బాగుచేయడానికి 25 కోట్లు మంజూరు చేయించుకుని దీనిలో 15 కోట్లు విడుదల చేయించుకొని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నామని తెలిపారు. కోటి రూపాయలతో కళ్యాణ మండపం తో పాటు  కూరగాయలు, మాంసం కొరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు మాట్లాడుతూ అంకాపూర్ తోపాటు  అంక్సాపూర్ గ్రామం పేరు కూడా అభివృద్ధిలో ముందుండేలా రైతులు కృషి చేస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి  దార్శనికత తో, కృషి పట్టుదలతో ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళుతున్నారు. రైతులు అలాగే మిగతా వృత్తుల వారు కూడా దేశానికి వెన్నెముకగా నిలవాలని అందులో భాగమే గొర్రెల పంపిణీ కూడా అన్నారు. బతుకమ్మ పండుగ అంటే పూలు, ప్రకృతి తో కూడుకున్న ప్రకృతి ఆరాధన అని ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారని, ఒక పెద్దన్నగా మేనమామ గా ముఖ్యమంత్రి 100 రకాల చీరలను నాణ్యతతో ఎక్కువ రంగులతో తయారుచేయించి ఆడపిల్లలకు పంపిణీ చేయిస్తున్నారన్నారు. జిల్లాకు 4.8 3 లక్షల బతుకమ్మ చీరలు పలు డిజైన్లలో వచ్చాయన్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. దసరాను పచ్చదనం, పరిశుభ్ర  వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి – సంక్షేమం అనే రెండు చక్రాల పై ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నా‌రన్నారు.30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో పరిశుభ్రత, పచ్చదనం వెల్లివిరియాలని గ్రామాల్లో శిధిలాలు తొలగించడం, విద్యుత్ తీగలు స్తంభాలు సరిచేసుకోవడం ఎక్కడ కూడా చెత్త లేకుండా చూసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు భాగస్వాములై నిర్వహించాలని ఆయన కోరారు. ఇప్పటివరకు 15 టన్నుల వాడిన ప్లాస్టిక్ను సేకరించామని దానిని రీసైక్లింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.అంతకుముందు అంక్సాపూర్ లోనూ,  భీంగల్ లోను మొక్కలు నాటి  నీరు పోశారు.ఈ కార్యక్రమాలలో  శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బాలిక్ అహ్మద్, ఆర్మూర్ ఆర్డిఓ శ్రీనివాస్, మెప్మా పిడి రాములు, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్, జెడ్ పి టి సి లు.భారతి,  రవి, ఎంపీపీలు జమున, మహేష్, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.2 Attachments

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close