Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

ప్యాకేజీ వద్దు.. ¬దా ముద్దు

  • కుల, మత వివక్షత లేకుండా ఉద్యోగాలు
  • 25 లక్షల మందికి ఇళ్ళపట్టాలు
  • 108 సేవలు, 650 కొత్త అంబులెన్సులు
  • అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్‌

అమరావతి (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక ¬దా అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది. స్పెషల్‌ స్టేటస్‌ పై వాడీవేడిగా చర్చ నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ వేడెక్కింది. సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. స్పెషల్‌ స్టేటస్‌ రాకపోవడానికి చంద్రబాబే కారణం అని సీఎం జగన్‌ ఆరోపించారు. ప్రత్యేక ¬దా సాధనలో చంద్రబాబు ఘోరంగా విఫలం అయ్యారని అన్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని సీఎం జగన్‌ సెటైర్‌ వేశారు. తెలంగాణ నుంచి ఏడు మండలాలు కష్టపడి సాధించాము అని చంద్రబాబు అంటున్నారని.. మరి వచ్చిన ప్రత్యేక ¬దాని అమలు చేయాలని ఎందుకు అడగలేకపోయారని జగన్‌ ప్రశ్నించారు. ప్రత్యేక ¬దా ఏం పాపం చేసిందో చెపాలన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా వస్తే ఐటీ, జీఎస్టీ మినహాయింపులు లభిస్తాయన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అప్పటి ప్రభుత్వం సరిదిద్దక పోగా .. ఆ అన్యాయాలు మరింతగా పెరగటానికి కారణమైంది. అందుకే ఈరోజు మనమంతా పోరాటం చేయాల్సి వస్తోంది. విభజన ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 59 శాతం జనాభాను, 47శాతం అప్పులను వారసత్వంగా పొందాం. ఆదాయాన్ని, ఉద్యోగాలను ఇచ్చే రాజధాని నగరం లేకుండా అతి తక్కువ మౌలిక సదుపాయాలతో మానవ అభివృద్ధి సూచికల్లో వెనుకబడి వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోయాం.

2015 నుంచి 2020 సంవ్సతరాల మధ్యలో కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను పరిగణనలోకి తీసుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెవెన్యూ లోటు రూ.22,113 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. వాస్తంగా గత ఐదేళ్లలో మన రెవెన్యూలోటు రూ.66,362 కోట్లకు పెరిగిపోయింది. ఇది 14వ ఆర్థికసంఘం అంచనా వేసిన దానికంటే మూడు రెట్లు అధికంగా ఉంది.  హైదరాబాద్‌ అనేక దశాబ్దాల్లో దేశంలోని ఇతర రాజధాని నగరాల మాదిరిగానే అత్యుత్తమ ఆర్థిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఉదాహరణకు 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 57వేల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు ఉండగా.. ఇందులో హైదరాబాద్‌ నగరమే రూ. 56,500 కోట్ల ఎగుమతులను అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ తలసరి ఆదాయం 14,411గా ఉండగా, ఏపీ తలసరి ఆదాయం 8,398గా మాత్రమే ఉంది. కొత్త రాష్ట్రానికి ఉన్న సవాళ్లు, ఆర్థిక దుస్థితి దృష్టిలో ఉంచుకుని.. ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇస్తామని సక్షాత్తూ పార్లమెంట్‌లోనే ప్రకటన చేశారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని  నేరుగా ఆర్థిక సాయం చేయడం ద్వారా, అభివృద్ధికరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తామని ఆనాడు పార్లమెంట్‌లో చెప్పారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఇది ఆర్థిక, సామాజిక దుస్థితికి దారితీసింది. విభజన సమయంలో రూ.97వేల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పు..2018-19 నాటికి రూ.2,58,928 కోట్లకు చేరింది. రుణంపై వడ్డీ ఏడాదికి  రూ.20వేల కోట్లు పైగా ఉంటే..దీనికి అదనంగా అసలు రూపంలో మనం చెల్లించాల్సి మొత్తం మరో రూ.20వేల కోట్లు ఉంటుంది.

జాప్యం లేకుండా ¬దా ఇవ్వాలి

గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదు. నీతిఆయోగ్‌లో ప్రధాని, కేంద్రమంత్రిమండలి సమక్షంలో ఇదే కాపీ చదివినిపించా. విభజనతో రాష్ట్రం అన్నిరంగాల్లో నష్టపోయింది. విభజన నష్టాలను ప్రత్యేక ¬దా ద్వారానే పూడ్చుకోవచ్చు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రత్యేక ¬దా తప్పనిసరి. ¬దా వస్తేనే రాయితీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా జీవనాడి అయినందున జాప్యంలేకుండా వెంటనే ఇవ్వాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున ¬దా కావాలని తీర్మానం ప్రవేశపెడుతున్నా” అని జగన్‌ తెలిపారు.

25 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు పంపిణీ

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా వచ్చే సంవత్సరం ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది ఇల్లులేని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు.. అందుకు అవసరమైన నిధుల కేటాయింపుకోసం కసరత్తు ప్రారంభమయ్యిందని మంగళవారం ఆయన అసెంబ్లీలో చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ఇల్లు లేని నిరుపేదలందరిని గుర్తించి ఇంటిపట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని ఆయన చెప్పారు. ఈరిజిష్ట్రేషన్‌ ఇంటిలోని మహిళల పేరున ఇస్తామని, దేశంలోని ఏరాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి పధకం చేపట్టలేదని ఆయన తెలిపారు.

కులం, మతం, పార్టీ వివక్ష లేకుండా ఉద్యోగాలు

వ్యవస్థలో ప్రక్షాళన, మార్పు తీసుకొచ్చేదిశగా అడుగులు వేస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి మేలు జరగాలన్నారు. లంచాలు తీసుకొనే పరిస్థితి రాకూడదని చెప్పారు. కులమతాలకతీతంగా పాలన అందిస్తామన్నారు. ఈమేరకు సీఎం జగన్‌ ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు. అక్టోబర్‌ 2 వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ 2 వ తేదీ ప్రతి గ్రామంలో పది మందికి ఉద్యోగాలిస్తూ గ్రామ సెక్రటేరియట్‌ ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 వ తేదీ నుంచి గ్రామ వాలంటీర్లుగా ప్రతి 50 కుటుంబాలకు ఒకరి చొప్పున 4 లక్షల మందిని నియమిస్తున్నట్లు తెలిపారు. వారందరికీ రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చి వారందరినీ గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. పక్షపాతం, అవినీతికి తావులేకుండా ప్రతి పథకాన్ని డోర్‌ డెలివరీ చేయబోతున్నట్లు ప్రకటించారు. గ్రామ వాలంటీర్లు అవినీతి పరులు కాకుండా ఉండేందుకు వారికి రూ.5 వేలు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని గ్రామ వాలంటీర్లు డోర్‌ డెలివరీ చేయాలన్నారు. రేషన్‌ బియ్యాన్ని నాణ్యతను మార్చుతున్నామని చెప్పారు. సెప్టెంబర్‌ 1 వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యాన్ని ప్యాక్‌ చేసి డోర్‌ డెలివరీ చేయబోతున్నట్లు తెలిపారు. బియ్యాన్ని స్రీ్కన్‌, ఫిల్టర్‌ చేసి 5 కేజీల ప్యాకెట్‌, 10 కేజీల ప్యాకెట్‌, 15 కేజీల ప్యాకెట్‌ గా చేసి డోర్‌ డెలివరీ చేయబోతున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల వేలి ముద్రలు పడకపోతే వీడియోస్‌ స్క్రీనింగ్‌ తీసుకోమని చెప్పినట్లు తెలిపారు. లబ్ధిదారునికి మంచి జరగాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. రేషన్‌ బియ్యం మొదలుకొని పించన్లు, రాబోయే అమ్మఒడి, రైతు భరోసా వంటి ప్రతి ప్రభుత్వ పథకాన్ని డోర్‌ డెలివరీ చేసే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు. డోర్‌ డెలివరీ చేసేటప్పుడు ఎక్కడా కూడా అవినీతి, అన్యాయం జరుగకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు.

సీఎం ఆఫీసులో కాల్‌ సెంటర్‌

అర్హత ఉండి ప్రభుత్వ పథకం రాకపోతే లేదా గ్రామ వాలంటీరు అవినీతి చేశాడనిపిస్తే నేరుగా సీఎం ఆఫీస్‌ కు ఫోన్‌ చేసే సౌలభ్యం కల్పించామని అందుకు సంబంధించి సీఎం ఆఫీస్‌ లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎక్కడైనా గ్రామ వాలంటీరు అవినీతికి పాల్పడినట్లు, లబ్ధిదారులకు అన్యాయం జరిగినట్లు తెలిస్తే వెంటనే అతన్ని తొలగిస్తామని చెప్పారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాలు అమలులో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు కూడా చూడకూడదని చెప్పారు. ఎన్నికలు అయ్యేదాకనే మన పార్టీ, వేరే పార్టీ, ఎన్నికలు అయిపోయాయి.. ఇక అందరూ మనవారే అనుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం చూడబోమని.. రాజకీయాలకతీతంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులకు ఐఆర్‌ ను 27 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జూలై 1, 2019 నుంచి అమలు అవుతుందన్నారు. సీపీఎస్‌ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నవరత్నాల అమలు తమ ప్రభుత్వ అజెండా అని అన్నారు. నవరత్నాల అమలుతో ప్రతి పేదవాడి సంకెళ్లు తెంచుతామని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా కృషి చేస్తామని చెప్పారు. అక్టోబర్‌ 15 నుంచి రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. ప్రతి రైతులకు ఏడాదికి రూ.12 వేల 500 ఇస్తామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close