రాఫేల్‌ నుంచి మోడీని ఎవ్వరూ కాపాడలేరు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాఫేల్‌ స్కాం నుంచి ప్రధాని నరేంద్ర మోడీని ఎవరూ కాపాడలేరని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్లమెంట్‌ ఆవరణంలో విలేకరులతో మాట్లాడారు.. రాఫెల్‌ స్కాంలో ఆధారాలన్ని బహిరంగ రహస్యమే అన్నారు. సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ కేసులో సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చిందని రాహల్‌ గర్తు చేశారు. అలోక్‌ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్రం ఆయనకు అధికారాలు లేకుండా చేసి రాత్రికిరాత్రే సెలవుపై పంపడాన్ని న్యాయస్థానం తప్పు పట్టిందని తెలిపారు. ఇది మోడీ ప్రభుత్వానికి సిగ్గుచేటని రాహల్‌ విమర్శించారు. రాఫేల్‌ స్కాంపై విచారణ చేపట్టనున్నారని తెలిసి ప్రధాని ఆయన్ను రాత్రి 1గంటకు పదవినుంచి తొలగించారని తెలిపారు. అలోక్‌ వర్మకు తిరిగి పదవి ఇవ్వటంతో న్యాయం జరిగిందని తెలిపారు. రాఫేల్‌ విషయంలో అనిల్‌ అంబానికి రూ.30,000 కోట్లు సహాయం చేశారని ఇందులో ఎలాంటి సందేహం లేదని రాహుల్‌ వెల్లడించారు. పబ్లిక్‌రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను గాలికి వదిలేశారని రాహుల్‌ దుయ్యబట్టారు. ఓవైపు అధికధరకు రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనడమే కాకుండా రాఫెల్‌ ఒప్పందంలో ఇండియా పార్టనర్‌గా హెచ్‌ఏఎల్‌ను తొలగించి అనుభవం లేని అనిల్‌ అంబానీ స్థాపించిన రిలయన్స్‌ డిఫెన్స్‌ కంపెనీకి చోటు కల్పించారని అన్నారు. మరోవైపు… కేంద్రం ఏ సీబీఐ అధికారికి వ్యతిరేకం కాదని ఇద్దరు ఉన్నతాధికారులు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. ప్రతిపక్షాలు పచ్చి అబద్దాలు చెబుతున్నాయని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here