Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలువిద్యస్టేట్ న్యూస్

కొత్త జరిమానాలు అమలు చేయ్యలేం!

కొత్తచట్టంపై చేతులెత్తేస్తోన్న రాష్ట్రాలు

  • ముందు వరుసలో బీజేపీ పాలిత ప్రాంతాలు
  • తలలు పట్టుకుంటోన్న కేంద్రం..!

న్యూఢిల్లీ

నూతన జరిమానాలు మేం అమలు చెయ్యలేం.. మా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. అంటూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న కొత్త ట్రాఫిక్‌ జరిమానాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ముందు వరుసలో బీజేపీ పాలిత రాష్టాల్రే ఉండటంతో కేంద్ర ప్రభుత్వం తలలు పట్టుకుంది. నిజానికి మోటార్‌ వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చేముందే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రమాదాలు తగ్గించడానికంటూ ట్రాఫిక్‌ నిబంధనల అతిక్రమణపై భారీ జరిమానాలు విధించాలన్న కేంద్రం అనాలోచిత చర్యపై దేశపౌరులు భగ్గుమన్నారు. సోషల్‌ విూడియాలో కొత్త జరిమానాలకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించారు. ముందు గుంతలు లేని రోడ్లు, మెరుగైన సౌకర్యాలు కల్పించి అప్పుడు జరిమానాలు విధించమని ట్రోల్‌ చేశారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త చట్టం అమలు ప్రారంభించింది. ఓవర్‌ లోడ్‌, అతివేగం, హెల్మెట్‌ లేకపోవడం వంటి తప్పులకు వేలు, లక్షల్లో వేసిన జరిమానాలు చేసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. భారీ జరిమానాలు కట్టలేక వాహనదారులు పోలీసులకు వెహికల్స్‌ అప్పజెప్పి వెళ్లిపోయిన సంఘటనలూ జరిగాయి. ప్రయాణమంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కల్సించింది కొత్త చట్టం. విమర్శలను లెక్కచేయకుండా కేంద్రం కొత్త జరిమానాలు అమలుచేస్తున్నప్పటికీ, ప్రజాగ్రహం గమనించిన రాష్టాల్రు ఆ బాటలో నడవడానికి సందేహించాయి. అందరికన్నా ముందుగా గుజరాత్‌ మేల్కొంది. జరిమానాలను తొంభై శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆగ్రహం, గుజరాత్‌ నిర్ణయం తర్వాత కూడా కేంద్రం తప్పుతెలుసుకోలేదు. కేంద్ర రవాణాశాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ కొత్త చట్టాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చట్టం లేకపోతే భయం ఎలా వస్తుందని, భారీగా జరిమానాలు పడుతుందన్న భయంతో ప్రజలు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తారని గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాష్టాల్రకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. బీజేపీపై ఎప్పుడూ ఒంటికాలుతో లేచే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తమ రాష్ట్రంలో మోటార్‌ వెహికల్‌ సవరణ చట్టం అమలుచేయబోమని తేల్చిచెప్పేశారు. బీజేపీయేతర రాష్టాల్రే కాకుండా, బీజేపీ పాలిత రాష్టాల్రు కూడా కొత్తచట్టంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న విషయం గమనించిన కేంద్రం ఎట్టకేలకు కాస్త వెనక్కి తగ్గింది. రవాణా కేంద్ర, రాష్టాల్ర ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాబట్టి చట్టాన్ని యథాతథంగా అనుసరించాలా లేదా అన్నది రాష్టాల్ర ఇష్టమని, కేంద్రం నిర్ణయాన్ని బలవంతంగా రుద్దబోమని నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలతో ఊపిరి పీల్చుకున్న రాష్టాల్రు జరిమానాలను భారీగా తగ్గించేందుకు సిద్దమయ్యాయి. మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌తో పాటు పలు బీజేపీ రాష్టాల్రు జరిమానాల తగ్గింపు దిశగా చర్యలు చేపట్టాయి. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే ఈ కొత్త చట్టంపై కేంద్రం కూడా వెనక్కితగ్గి జరిమానాలను భారీగా తగ్గిస్తూ మళ్లీ సవరణలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close