Featuredస్టేట్ న్యూస్

మావోయిస్టులు లేరు..

  • సీపీ అంజనీకుమార్‌ మాటలు బాధాకరం
  • 12వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష
  • నేతల ఇళ్ల ముట్టడికి పిలుపు
  • కేసీఆర్‌పై ఆర్టీసీ జేఏసీ మరో అస్త్రం

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ..అఖిలపక్ష నేతల సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేసారు. ఆదివారం రాజకీయ పార్టీలతో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. సోమవారం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.అలాగే 13,14 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఛలో ట్యాంక్‌బండ్‌ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ దమనకాండను మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అవసరమైతే జేఏసీ నేతలతో ఢిల్లీలో ఒక్కరోజు దీక్ష నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. అలాగే ఈ నెల 18న సడక్‌ బంద్‌ చేపట్టాలని నిర్ణయించారు. కాగా, శాంతియుతంగా నిరసనకు బయలుదేరిన కార్మికులపై పోలీసులు జులుం ప్రదర్శించారని సమావేశంలో అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఛలో ట్యాంక్‌బండ్‌ సందర్భంగా మావోయిస్టులు కూడా అందులో భాగమయ్యారని హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కార్మికులు, రాజకీయ పార్టీల కార్యకర్తలే నిరసనలో పాల్గొన్నారని చెప్పారు. పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించడం వల్లే చాలామంది గాయాలపాలయ్యారని ఆరోపించారు. ఏదేమైనా ప్రభుత్వంపై చేస్తున్న ఈ పోరాటం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని సమావేశంలో నిర్ణయించారు. మొత్తం మీద ఛలో ట్యాంక్‌బండ్‌ విజయవంతం ద్వారా ప్రభుత్వానికి తామేంటో నిరూపించామని ఆర్టీసీ జేఏసీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఇలాగే ఒత్తిడి పెంచగలిగితే సీఎం దిగిరావడం ఖాయమని భావిస్తున్నారు.

38వ రోజుకు చేరిన సమ్మె..

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 38వ రోజుకు చేరింది. శనివారం ట్యాంక్‌ బండ్‌ వద్ద మిలియమ్‌ మార్చి నిర్వహించిన కార్మికులు అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపనున్నారు. ఛలో ట్యాంక్‌ బండ్‌ నిర్వహణలో భాగంగా.. పోలీసులను గాయపరిచారనే అభియోగంతో నాలుగు కేసులు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో పోలీసుల లాఠీ చార్జ్‌లో పలువురు కార్మికులు గాయపడ్డారు. తన నిరసన కార్యక్రమాల్లో న్యూ డెమోక్రసీ సభ్యులు ప్రవేశించారంటూ పోలీసు అధికారులు చేసిన వ్యాఖ్యలను ఆర్టీసీ జేఏసీ నేతలు ఖండించారు. ఇదే సమయంలో సోమవారం కోర్టులో జరిగే వాదనలు..నిర్ణయాలకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణ పైన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close