చెక్‌పవర్‌తో ఇక ఉపసర్పంచ్‌ కీలకం

0

కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొ దటిసారిగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్‌ పదవి కీలకం కానున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం స్థానంలో తెలంగాణ రాష్ట్ర అవసరాలు, గ్రామాల అభివద్ధికి పంచాయతీల్లో సర్పంచి, ఇతర ప్రజాప్రతినిధుల పాత్రను కీలకం చేస్తూ తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ నూతన చట్టం ప్రకారం గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు, ఇతర ఆదాయమార్గాల ద్వారా సమకూరిన నిధులను గ్రామాల అభివద్ధికి కేటాయింపులు, ఖర్చు చేసే విధానాలు, నిర్ణయాలపై తప్పనిసరిగా సర్పంచు తో పాటు ఉపసర్పంచ్‌ జాయింట్‌ చెక్‌పవర్‌ వినియోగించాల్సి ఉంటుంది. దీంతో గ్రామాల్లో ఉపసర్పంచి పదవిని దక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ దష్టి సారించనున్నాయి. మల్హర్‌ మండలంలో మొత్తం15 పంచాయతీలు 128 వార్డులు, కాటారం మండలంలో మొత్తం 24 పంచాయతీలు 210 వార్డులు, మహదేవ్‌పూర్‌ మండలంలో మొత్తం18 పంచాయతీలు 162 వార్డులు, పలిమెల మండలంలో మొత్తం 8 పంచాయతీలు 62 వార్డులు, మహాముత్తారం మండలంలో మొత్తం 24 పంచాయతీలు 196 వార్డులు ఉన్నాయి. ఈ నెల 25 వ తేదిన పంచాయతీ ఎన్నికలు నిర్వహంచనున్నారు. గ్రామాల్లో ఎన్నికల ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. గ్రామ సర్పంచి ఎన్నిలకు నేరుగా ఎన్నికలు జరగనున్నాయి. కానీ గ్రామ పాలనా పరమైన నిర్ణయాలు ఇక

నుండి సర్పంచుతో పాటు ఉపసర్పంచులకు కూడా కీలక బాధ్యతలు ఉండనున్నాయి. దీంతో పరోక్ష పద్ధతిలో ఎన్నిక కానున్న ఉపసర్పంచ్‌ పదవి కోసం ఆయా వార్డుల అభ్యర్థులు ఆరాటపడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు వార్డుల సభ్యుల ఎన్నికలు కీలకం కానున్నాయి. గతంలో సర్పంచ్‌ గెలిస్తే వార్డు సభ్యుల బాధ్యతలు నామమాత్రంగా ఉండేవి. వీరి ద్వారా ఎన్నికైన ఉపసర్పంచి పదవి, బాధ్య తలు కూడా నామమాత్రంగానే ఉండేవి. కానీ తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఈ ఎన్నికల్లో ఎక్కువ వార్డులు గెలిచిన పార్టీ లేదా,ఒక వర్గం వారే ఉపసర్పంచ్‌ పదవి చేపట్టగలుగుతారు. ఎన్నికల్లో సర్పంచ్‌ పదవి గెలిచి నంత మాత్రాన ఉపసర్పంచ్‌ పదవి దక్కించుకునేంత వార్డుసభ్యులను గెలిపిం చుకోకపోతే గ్రామంలో నిధుల ఖర్చు విషయంలో అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. దీంతో గ్రామాల్లో వార్డు మెంబర్ల గెలుపు కోసం సర్పంచ్‌ అభ్యర్థులు కషి చేస్తున్నారు. రిజర్వేషన్‌ స్థానాల్లో పోటాపోటీ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ పదవులు రెండు ఒకే పార్టీ గెలుచుకోవడం వల్ల రాను న్న రోజుల్లో గ్రామాభివద్ధికి క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్ప డుతుందని ఇప్పటికే ఆశావహులు ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో ఉపసర్పంచ్‌ పదవి ఆశించే అభ్యర్థులు సర్పంచిగా పోటీ చేసే అభ్యర్థితో సహా తనకు అనుకూ లంగా వుండే వార్డ్‌ సభ్యులను గెలిపించుకోవడానికి భారీగా ఖర్చు చేయడానికి సైతం వెనుకాడడంలేదు. ఉప సర్పంచిగా ఎన్నికైన పిదప గ్రామంలో పూర్తి పెత్తనం తన చేతిలోనే ఉండేట్లు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఉప సర్పం చి పదవి గతంలో ఏమాత్రం ప్రాముఖ్యత లేనిదిగా ఉండగా నూతన పంచా యతీ చట్టం ప్రకారం కీలకం కావడంతో రిజర్వేషన్ల వల్ల సర్పంచ్‌ గా పోటీ చేసే అవకాశం చేజారిపోయిన నాయకులు ఉప సర్పంచ్‌ పదవి పొంది అధి కారం అంతా తన చేతుల్లోకి తీసుకొని గ్రామాన్ని ఎలుకుందామనే ఆలో చనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందు కొరకు ఇప్పటినుండే మిగతా వార్డుల్లో పోటీ చేసే సభ్యుల్లో తనకు అనుకూ లంగా ఉండే వారిని ఎంపిక చేసుకొని లేదా తన వర్గానికి చెందిన వారిని బరిలోకి దించి వారి ప్రచారం ఖర్చులు సైతం వారే పెట్టి గెలిపించుకునే పనిలో పడ్డారు అనేకమంది ఆశావాదులు. ఏది ఏమైనా ఈ నెల 25వ తేదీ సాయంత్రం బయటపడే ఫలితాలు ఎవరు సర్పంచిగా ఎవరు ఉప సర్పంచ్‌గా నిలబడతారోనని గ్రామాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here