రాజకీయ వార్తలు

ఈ ఏడాది తెలంగాణలో… ఎన్నికలు ఉండవు..!

– వెంటాడుతున్న వాస్తు దోషాలు

– కోర్టు తీర్పులు సైతం..

– కేసీఆర్‌ జాతకంలో విచిత్ర, విపత్కర విషయాలు

– ప్రముఖ నాడీ జోతిష్య పరిశోధకులు రాఘవేంద్ర సిద్దాంతి జోస్యం

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎట్టి పరిస్థితులలోను 2018లో ముందస్తు ఎన్నికలు రావని, అసలు అటువంటి పరిస్థితే ఏర్పడదని, దానికి తగ్గట్టుగానే రాబోయే రోజులలో కోర్టు తీర్పులు కూడా ఉండే అవకాశం ఉందని రాఘవేంద్ర సిద్దాంతి చెప్పారు. గతంలో ఈ సిద్దాంతి 2014లో సీమాంద్రలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికల అంశంలోనే కాకుండా హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, నంద్యాల ఉపఎన్నికలు, కర్ణాటక ఎన్నికల గురించి చెప్పిన నాడీ జోస్యాలు నిజమయ్యాయి.

ప్రస్తుతం తెలంగాణాలో అపద్దర్మ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల వ్యూహంతో తమ పార్టీ అసెంబ్లీ సభ్యులందరి చేత రాజీనామా చేయించడం ద్వారా ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించారు. తెలంగాణ ప్రజలందరినే కాకుండా రాజకీయ ఉద్దందులను సైతం విస్మయానికి గురి చేసింది.

ఈ సంఘటనతో తెలంగాణాలో పూర్తి రాజకీయ ముఖ చిత్రం అత్యంత వేడి గా మారిపోయింది. రోజు రోజుకు అత్యంత ఉత్కంఠ భరితమైన సంఘటనకు దారితీస్తూ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న క్రమంలో ఈ అంశానికి సంబంధించిన వాజ్యం కోర్టుకి చేరింది. ‘ఏ రోజు ఎటువంటి తీర్పు వస్తుందా’ అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకి చెందిన ప్రముఖ నాడీ జోతిష్య సిద్దాంతి రాఘవేంద్ర చెప్పిన జోస్యం

ఆసక్తిని రేపుతుంది.

ఇలా.. చూసి..:

కనీనికా నాడీ జోతిష్యశాస్త్ర రీత్యా చూసినట్లైయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహాల గోచార స్థితిగతుల రీత్యా తెలంగాణలో ఎట్టి పరిస్థితులలోను 2018లో ముందస్తు ఎన్నికలు రావని ఆయన చెపుతున్నారు. అసలు అటువంటి పరిస్థితే ఏర్పడదని, దానికి తగ్గట్టుగానే రాబోయే రోజులలో కోర్టు తీర్పులు కూడా ఉండే అవకాశం ఉందని రాఘవేంద్ర సిద్దాంతి చెప్పారు.

గులాబీ నేత జాతకం: కెసిఆర్‌ జాతక రీత్యా చూసినట్లైతే ముందస్తు ఎన్నికలను ఆశిస్తూ అసెంబ్లీని రద్దుచేసిన సమయంలో వారికి ఉన్నంత అనుకూల పరిస్థితులు రోజులు గడిచే కొద్ది సన్నగిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అంశం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేయడమే కాకుండా అది వారి చర్యలలో చాలా స్పష్టంగా రాబోవు రోజులలో కనపడుతుంది. అక్టోబర్‌ 11 నుండి 2019 మార్చి 24 లోపల ఉన్న గ్రహాల స్థితి గతులు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా గోచార గురువు వృశ్చికరాశి ప్రవేశ ప్రభావం వలన కెసిఆర్‌ దేనికి ఆనందించాలో, దేనికి భాదపడాలో అర్ధం కాని విచిత్ర, విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఎంతో కాలంగా వారి అడుగులకు మడుగులు వత్తుతూ అనుకులూరుగా ఉన్న కొందరు నాయకులు వారితో విభేదిస్తూ… బహిర్గత పర్చే కొన్ని అంశాల ద్వారా టిఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న అసంతృప్తి బయట సమాజానికి తెలిసి యావత్‌ ప్రజానీకాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఈ సందర్భంగా సిద్దాంతి రాఘవేంద్ర చెప్పారు.

వాస్తు దోషాలు ఇవే..:దీనంతటికి వారి జాతక ప్రభావ రీత్యా వారు తీసుకున్న నిర్ణయాలే కాకుండా, టిఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు, ప్రగతి భవన్‌, ఫామ్‌ హౌస్‌ లలో… వాయువ్యం దిక్కున అనగా మరీ ముఖ్యంగా 304 డిగ్రీల నుండి 326 డిగ్రీల లోపల, ఉత్తరం దిక్కున అందునా 349 డిగ్రీల నుండి 11 డిగ్రీల వరకు, పడమర దిక్కున అందునా 259 డిగ్రీల నుండి 293 డిగ్రీల లోపు తీవ్ర మైన వాస్తు దోషాలు ఉన్నాయి.

సరి చేసుకోవాలి..:ఆయా దోషాలను 2019 మార్చి చివరలోపు నిపుణులైన వాస్తు పండితులచే సరిచేసుకుంటే ప్రతిపక్షాలు ఎన్ని కూటములుగా ఏర్పడినా టిఆర్‌ఎస్‌ నే అఖండ మెజారిటీతో గెలుపును సాధించడం జరుగుతుంది. దీంతో ప్రతిపక్షాలకు తన సత్తాను మరోసారి చాటే అవకాశం ఉంది.

ఆలస్యం అయితే చిత్తగించవలెను..:ఈ వాస్తు దోషాలను సరిచేసుకోవడంలో ఎంత ఆలస్యం అవుతుందో అంతగా మెజారిటీ శాతం టిఆర్‌ఎస్‌ కి తగ్గిపోతుంది. ఒకవేళ 2019, మార్చి లోపు వాస్తు మార్పుల అంశాన్ని పరిగణనలోకి తీసుకోనట్లైయితేమార్చి తర్వాత వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ పార్టీ బొక్క బోర్లా పడి అపజయాన్ని చవి చూడక తప్పదని రాఘవేంద్ర సిద్దాంతి చెపుతున్నారు. అంతే కాకుండా టిఆర్‌ఎస్‌ అధినేతలు తమ సేవలను ఆశించినట్లైతే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన సేవలను ఉచితంగా అందించడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఇదే నా సవాల్‌..:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గృహం లేదా ఆఫీస్‌ నందు ఏ దిక్కులో… ఏ దోషం ఉందో… తెలియాలంటే ఆయా ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం లేదని, తాను ఎంతో కాలంగా పరిశోదిస్తున్న కనీనిక, కశేరుకా నాడీ సిద్దాంతాలను అనుసరించి వాటిని చాలా స్పష్టంగా డిగ్రీలతో సహ చెప్పడమే కాకుండా వచ్చి చూయించి నిరూపించగలనని సవాలు విసిరారు.

Raghavendra(Ongole) Email id: [email protected]

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close