Featuredస్టేట్ న్యూస్

నో కాంప్రమైస్‌

  • సమ్మె కాదు ఆర్టీసీనే ముగుస్తుంది
  • రూ. 5వేల కోట్ల అప్పులు
  • ఆర్టీసీపై వారంలో కీలక నిర్ణయం
  • ప్రజలు తెలివిగా ఓట్లేశారు
  • ఇప్పటికైనా ప్రతిపక్షాలు మారాలి
  • సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్‌ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర రాజకీయ యూనియన్ల సమ్మె అన్నారు. యూనియన్‌ ఎన్నికల కోసమే పనికిమాలిన సమ్మెలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ అసంబద్ధమైందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అసాధ్యం అని మరోసారి తేల్చి చెప్పారు. 44శాతం జీతాలు పెంచి బాగా పని చేయమని చెప్పానన్నారు. నాలుగేళ్ల కాలంలో 67శాతం కార్మికుల జీతాలు పెంచినా గొంతెమ్మ కోర్కెలు కోరడం దారుణం అన్నారు. ఆర్టీసీ యూనియన్లపై సీఎం ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు. యూనియన్లవి చిల్లర రాజకీయాలు అని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా అన్నారు. సమ్మె నిర్ణయం కరెక్ట్‌ కాదన్నారు. యూనియన్ల పేరుతో ఆర్టీసీకి ఉరి బిగిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మెకి ఆర్టీసీ ముగింపే సమాధానం అన్నారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపిన సీఎం కేసీఆర్‌.. ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ పూర్తిగా మునిగిపోయిందన్న కేసీఆర్‌.. ఒడ్డున పడాలంటే చాలా కష్టపడాలన్నారు. అదే సమయంలో కార్మికులు తిరిగి విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. కార్మికులు తెలివైనోళ్లు అయితే దరఖాస్తులు పెట్టుకుని తిరిగి డ్యూటీలో చేరాలన్నారు. దరఖాస్తు తీసుకుని డ్యూటీకి వెళ్తే ఎవరూ వెళ్లగొట్టరని చెప్పారు. స్వచ్చందంగా వెళ్లిపోయారు కనుక.. వాళ్లే స్వచ్చందంగా వచ్చి విధుల్లో చేరాలన్నారు. యూనియన్లు లేకుండా కార్మికులు పని చేసి ఉంటే ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి ఉండేదని.. రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ తీసుకునే పరిస్థితి వచ్చేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు, అధికారులు మంచోళ్లు అని చెప్పిన సీఎం.. యూనియన్‌ నాయకులే వారిని చెడగొట్టారని ఆరోపించారు. యూనియన్‌ నేతల ఉచ్చు నుంచి బయటపడితేనే కార్మికులు బాగుపడతారని హితవు పలికారు. ఆర్టీసీ యూనియన్లపై సీఎం ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు. యూనియన్లవి చిల్లర రాజకీయాలు అని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా అన్నారు. సమ్మె నిర్ణయం కరెక్ట్‌ కాదన్నారు. ఆదాయం వచ్చే సమయంలో సమ్మె చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ సమ్మె చేయడు అన్నారు. కనీసం జ్ఞానం ఉన్న వాడు ఎవడూ ఇలాంటి పని చెయ్యడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో సమ్మె చేస్తారా అని నిలదీశారు. ఆర్టీసీ మునగక తప్పదని, ఎవరూ కాపాడలేరని సీఎం తేల్చి చెప్పారు. ఇక ముగిసేది సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది అని సీఎం సంచలన కామెంట్స్‌ చేశారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ లాభంలో ఉంటే.. ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆర్టీసీలో అద్దె బస్సులే లాభాల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సమ్మె చేస్తే ఎలా అని యూనియన్‌ నేతలను కేసీఆర్‌ నిలదీశారు.

విలీనం అసంబద్ధమైన నినాదం

”ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు కోరితే కలుపుతారా? ఎవర్ని మోసం చేయాలని? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు కూడా విలీనం చేయాలని కోరితే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఓ పద్ధతి, విధానం ఉంటుంది. ఆర్టీసీని విలీనం చేశారు.. వీరిని ఎందుకు చేయరని ఇవే కోర్టులు మళ్లీ ఆదేశాలు జారీ చేస్తాయి. అప్పుడేం సమాధానం చెప్పాలి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది. ఆర్టీసీ ముగిసిపోయింది.. ఇట్స్‌ గాన్‌ కేస్‌. సమ్మెతో వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండే అవకాశం లేదు” అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవరూ కాపాడలేరు

”ఆర్టీసీలో లాభాలు తెస్తున్న అద్దె బస్సులు వద్దని డిమాండ్‌ చేస్తారా? మనం స్వీకరించే వృత్తి ఏంటి? మన బాధ్యత ఏంటి? అనేది తెలుసుకోవాలి. ఆర్టీసీ కార్మికులకు సగటున రూ.50వేల జీతం వస్తోంది. సంస్థ మీది.. కాపాడుకోవాలనే బాధ్యత మీకు లేదా? సందర్భానుసారం పనిచేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవరూ కాపాడలేరు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్టీసీకి ఇచ్చిన నిధులు రూ.712కోట్లు. తెరాస అధికారంలోకి వచ్చాక రూ.4,250 కోట్లు విడుదల చేశాం. ఆర్టీసీకి ఈ సంవత్సరం బడ్జెట్లో రూ.550కోట్లు కేటాయించాం. ఇప్పటికే రూ.425 కోట్లు విడుదల చేశాం. అదనపు ఆదాయం వచ్చే సమయంలో సమ్మెకు వెళ్లారు. సమ్మెపై మొదట స్పందించాం.. కమిటీ వేశాం. నోటీసు ఇవ్వగానే సముదాయించే ప్రయత్నం చేశాం. సమ్మెకు వెళ్తామనగానే కమిటీ వేసి చర్చలు జరిపాం” అని కేసీఆర్‌ వివరించారు.

యూనియన్లే కార్మికుల గొంతు కోస్తున్నాయ్‌!

”ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలకు ముందు జరిగే హడావుడే ఈ సమ్మెకు ప్రధాన కారణం. సమ్మె ముసుగులో యూనియన్లే అమాయక కార్మికుల గొంతు కోస్తున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లతో నాకు పంచాయితీ లేదు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ తీసుకుంటారు. తెలంగాణ కోసం ఆర్టీసీ వాళ్లే కాదు.. అందరూ పనిచేశారు. నా ఇంట్లో ఉన్నవాళ్లు దొంగతనం చేస్తే దొంగతనం కాకుండా పోతుందా?. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదు. ఆర్టీసీకి పోటీ ఉండాలని ప్రధాని మోడీయే చట్టాన్ని తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఆరాచక వ్యవస్థను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయమనండి” అని ధ్వజమెత్తారు.

ఏపీలో ఆర్డర్‌ మాత్రమే ఇచ్చారు

”ఏపీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సీఎం జగన్‌ సంగతే చెబుతున్నా. ఏపీలో విలీనంపై ఆర్డర్‌ మాత్రమే ఇచ్చారు.. కమిటీ వేశారు. ఏం జరుగుతుందనేది మూడు నెలలకో.. ఆరునెలలకో తెలుస్తుంది. ఆ కమిటీ ఏం చెబుతుందో ఎవరికీ తెలియదు” అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కథ ముగిసింది..

ఆర్టీసీ అన్నది ఇక గడచిన చరిత్ర అని సెం కెసిఆర్‌ స్పష్టం చేశారు. అది మనుగడలో లేనే లేదన్నారు. ఆర్టీసీని కార్మిక సంఘాలే పాతరేసుకున్నాయని అన్నారు. తెలంగాణ భవన్ల్‌ఓ కెఇసార్‌ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సంగాల తీరును, అందుకు వత్తాసు పలుకతున్న వపిక్షాల తీరును ఘాటుగా దుయ్యబట్టారు. పనికిమాలిన సమ్మె అంటూ ఎద్దేవా చేశారు. సంస్థను చేజేతులా చంపుకున్న దానికి బాధ్యులు కార్మిక సంఘాలేనని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ వాళ్లకు బుద్ధి, జ్ఞానం ఉందా అని కేసీఆర్‌ తిట్టిపోశారు. తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇదని కేసీఆర్‌ మండిపడ్డారు. యూనియన్‌ ఎన్నికల ముందు చేస్తున్న పనికిమాలిన సమ్మె ఇదని ఆయన చెప్పారు. మూడునాలుగేళ్లకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గొంతెమ్మ కోరికలు కోరే చిల్లరమల్లర రాజకీయాలు ఇవని కేసీఆర్‌ ఆగ్రహించారు. ఆర్టీసీ సమ్మె ముగియడం కాదని, ఇక ఆర్టీసీనే ముగుస్తుందని కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, అయిపోయిందని.. ఆర్టీసీ దివాళా తీసిందని సీఎం వ్యాఖ్యానించారు. నెలకు ఆర్టీసీకి 100 కోట్లకు పైగా నష్టం వస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులకు రోజుకు రూ.3 కోట్లు నష్టం వస్తోందని, ప్రైవేట్‌ బస్సులకు మాత్రం రూ.4 లక్షల లాభం వస్తోందని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అద్దె బస్సులు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. దిక్కుమాలిన నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీని ముంచుతామని, నువ్వు కాపాడుకో అన్నట్లుగా కార్మికుల ధోరణి ఉందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సుమారు రూ.50 వేల జీతం వస్తుందని, అవసరం అయినప్పుడు ఒక గంట ఎక్కువ పనిచేయలేరా అని నిలదీశారు. ‘మా కాళ్లు మేమే నరుక్కుంటాం’ అన్నట్లు వ్యవహరించవద్దని ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ హితవు పలికారు. ఇకపోతే తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఓ ఆఫర్‌ ఇచ్చారు. యూనియన్లు పక్కనపెట్టి ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ తీసుకునే పరిస్థితి ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అక్రమమని, ఎస్మా ఉండగా సమ్మెకు పోవడం కరెక్ట్‌ కాదని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణలో 2600 బస్సులు రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన అవసరం ఉందని, వాటికి రూ. వెయ్యి కోట్లు అవసరమని కేసీఆర్‌ తెలిపారు. పాత ఆర్టీసీ బతికిబట్టగట్టే పరిస్థితి లేకుండా యూనియన్లు చేశాయని, యూనియన్ల చిల్లరరాజకీయాలతో ఆర్టీసీకి భవిష్యత్‌ ఉండదని సీఎం వివరించారు. ‘ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు అర్థంపర్ధంలేని డిమాండ్లు చేస్తున్నారని పిచ్చి పంథాను ఎంచుకున్నారని తెలిపారు. ఆర్టీసీని సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో బ్జడెట్‌లో కేటాయింపులు చేస్తే కార్మికులు మాత్రం పిచ్చిగా వ్యవహారిస్తున్నారన్నారు. ఆర్థిక మాంద్యం కొన్ని రంగాలు కుప్ప కూలాయని ఆ పరిస్థితి మన ఆర్టీసీకి రావద్దన్నారు. ఆర్టీసీ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు. తాను గతంలో రవాణాశాఖమంత్రిగా పనిచేశానని..అందుకే దేశంలోనే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీతాలు ఎక్కువగా పెంచామన్నారు. ఎవరుపడితే వారువచ్చి ప్రభుత్వంలో కలపాలంటే ఏంటి పరిస్థితి..మిగతా 57 కార్పొరేషన్లు అడిగితే ఎంటి పరిస్థితి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది అర్ధంపర్ధంలేని డిమాండ్‌ అన్నారు. ఎక్కడేం పనిలేక జెండాపట్టుకుని మాట్లాడుతున్నారని.. సీఎం అయ్యాక నాలుగేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 67శాతం పెంచానని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓ పద్దతి బాధ్యత ఉందన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగాలేక ఉంటే..గొంతెమ్మ కోర్కెలా అన్నారు. కొన్ని రాష్టాల్లో ఆర్టీసీని ఎత్తేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తరపున కమిటీ వేసింది తానేనని, చర్చలకు పిలవలేదన్న వెధవ ఎవరని కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ పోరాటంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటే మాత్రం ఏమిటని, ఆర్టీసీ కార్మికులు ఒక్కరే పాల్గొన్నారా అని సీఎం ప్రశ్నించారు. ‘నా ఇంట్లో మనిషి దొంగతనం చేస్తే.. దొంగతనం కాకుండాపోతుందా?’ అని కేసీఆర్‌ నిలదీశారు. పాత ఆర్టీసీని బతికి బట్టకట్టకుండా యూనియన్లే చేశాయని కేసీఆర్‌ మండిపడ్డారు. యూనియన్ల లీడర్లు అద్దె బస్సులను తొలగించాలని అంటున్నారని దాని అర్థం ఆర్టీసీని నిండా ముంచాలనా అని ప్రశ్నించారు. ఆర్టీసీ దగ్గర రూపాయిలేని పరిస్థితి ఉందన్న కేసీఆర్‌.. యూనియన్లు చేస్తున్న పని మహా నేరమన్నారు. సమ్మె చట్టవ్యతిరేకమని..ఆల్రెడీ ఎస్మా ఉందన్నారు. గొంతెమ్మ కోరికలతో, ఆర్టీసీని ఆగం చేసింది యూనియన్లేనని తేల్చి చెప్పారు. యూనియన్లు లేకుంటే ఆర్టీసీలోనూ భవిష్యత్తులో రూ.2లక్షల బోనస్‌ తీసుకునేవారన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇక వెయ్యిశాతం పాత ఆర్టీసీ ఉండదని, ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే జవాబు అన్నారు. డబ్బులు లేవంటే హైకోర్టు కొడుతుందా..ఆస్తులుంటే అమ్మి కట్టాలని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అధికారం లోకి వచ్చాక ఆర్టీసీకి ఇప్పటికే రూ. 4,250 కోట్లు ఇచ్చామని తెలిపారు. బ్జడెట్‌ లోనూ ఎక్కువ రూపాయలు

కేటాయిస్తున్నాం.. అయినా ఆర్టీసీ బస్సులతో రోజూ రూ.3కోట్ల నష్టం వస్తుందన్నారు. డ్యూటీ సమయంలో ట్రాఫిక్‌, ప్రయాణికులు ఎక్కేదగ్గర..దిగే దగ్గర కాస్త లేటే అవుతుందని.. దానికి ఎక్కువ సమయం శ్రమిస్తున్నామంటే ఎలా అన్నారు. ఓ గంట ఎక్కువ పని చేస్తే పోయిందేమిలేదన్నారు. అలా అనుకుంటే రైతు వ్యవసాయం చేయగలడా అని ఆర్టీసీ కార్మికులనుద్దేశించి కేసీఆర్‌ ప్రశ్నించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close