Featuredస్టేట్ న్యూస్

వెనక్కి తగ్గేదిలేదు..

  • 19వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
  • మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు
  • జోగురామన్న కాళ్లపై పడి తమ సమస్యలు తెలిపిన కార్మికులు
  • చర్చల కోసం ప్రభుత్వం నుండి తమకెలాంటి పిలుపు రాలేదు
  • ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్‌

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె బుధవారం 19వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. పలు జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులకు శాంతియుతంగా గులాబీ పువ్వులు ఇచ్చి విధుల్లోకి రావద్దని, అలా వచ్చి తమ పొట్ట కొట్టవద్దంటూ వేడుకున్నారు. పలు ప్రాంతాల్లో డిపోలు, ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అదిలాబాద్‌లో జిల్లాలో తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే జోగురామన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు జోగురామయ్య కాళ్లపైడి వేడుకున్నారు. ఎమ్మెల్యే వారికి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి జరుగుతుందని, మీ డిమాండ్‌లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అదేవిధంగా వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ను కలిసిన ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించేలా చరొవ చూపాలని వినతిపత్రాన్నిఅ ందజేశారు. అదేవిధంగా కరీంనగర్‌ జిల్లాలోని మంత్రి ఈటల రాజేందర్‌ నివాసం వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం ఇంటి గోడకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అతికించారు. కరీంనగర్‌ జిల్లాలోని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ఆమేరకు ప్రభుత్వానికి విన్నవించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా మంత్రి గంగుల కమలాకర్‌ కార్యాలయం ఎదుట ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆందోళనలో పాల్గొని తమ నిరససను తెలిపారు. అనంతరం గంగులకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

ఆర్టీసీ విలీన విషయంలో వెనక్కుతగ్గం- అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్‌పై తామెక్కడా వెనక్కు తగ్గలేదని, ఆ డిమాండ్‌ను విరమించుకుంటున్నట్లు మేం చెప్పలేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టాండ్‌లో నిర్వహించిన ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పినట్టుగా విలీనం విషయంలో వెనక్కి తగ్గామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టులో మేం గానీ, మా తరఫు న్యాయవాదులు గానీ ఆర్టీసీ విలీనం అవసరం లేదని చెప్పినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్ట బద్ధత లేదని, చర్చల కోసం ఇప్పటి వరకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదన్నారు. ఇక ప్రభుత్వ కమిటీ ఎవరితో చర్చిస్తుందో ముందుగా చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా కంటి తుడుపు కమిటీలతో కాలయాపన అవుతుందన్న ఆర్టీసీ జేఏసీ నేత.. వెంటనే సంఘాల నేతలను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఇకపోతే ఆర్టీసీ ట్రేడ్‌ యూనియన్లతో రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా రెండు మూడు రోజుల్లో చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డీఎం..

పని ఒత్తిడి కారణంగా భద్రాచలం ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌ బుధవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను… ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఎంకు డాక్టర్లు ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే విశ్రాంతి లేకపోవడం కారణంగానే ఆయన అలసటకు గురై లోబీపీతో స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా సమ్మెలో ఉండటంతో ఆర్టీసీ బస్‌ స్టేషన్‌, బస్‌ డిపో నిర్వహణ బాధ్యతలు పూర్తిస్థాయిలో డీఎం, డీవీఎంలే చేపట్టారు. దీంతో విశ్రాంతి లేకపోవడంతో డీఎం తీవ్ర అలసటకు గురవడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా డీఎం సృహ కోల్పోయిన విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close