నిజామాబాద్‌ సీటుపై..

0

పోటీ ఇచ్చేది ఎవరు..?

ఆ పార్లమెంట్‌ సీటులో బలమైన నాయకురాలు సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు. ఆమెను గత ఎన్నికల్లో ఢీ కొట్టిన అభ్యర్థి పోటీకి వెనుకంజ వేస్తున్నారు. మరి, అతని స్థానంలో ఎవర్ని నిలబెట్టాలి, నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్‌ జిల్లాలో ఐదు, జగిత్యాల జిల్లాలో రెండు సెగ్మెంట్లు ఉన్నాయి. బలమైన అభ్యర్థి ఎవరు అనే పనిలో ఆ పార్టీ పడింది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్‌ పార్లమెంట్‌ సీటుపై ప్రత్యేక కథనం..

నిజామాబాద్‌ పార్లమెంట్‌ సీటుపై కాంగ్రెస్‌ గురిపెట్టింది. ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ స్థానంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బలమైన అభ్యర్థి అయిన కవితకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడి కోసం కాంగ్రెస్‌ అన్వేషిస్తోంది. నిజామాబాద్‌ ఎంపీ సీటుకు కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి తిరిగి పోటీ చేస్తారని అందరూ భావించగా ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. మధుయాష్కి నియోజకవర్గం మారుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో కవితను ఎదుర్కొనే అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ నాయకులు కసరత్తులు చేస్తున్నారు. నిజామాబాద్‌ నుంచి పోటీకి మధుయాష్కి దూరంగా ఉండడంతో మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి పేరును కాంగ్రెస్‌ నాయకులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ సుదర్శన్‌ రెడ్డి పోటీకి ఒప్పుకోకపోతే బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ కు గాలం వేయాలని యోచిస్తున్నారు. మాజీ ఎంపీ కేశ్‌ పల్లి గంగారెడ్డి మనువరాలు కావ్వారెడ్డి పేరును కొందరు ప్రతిపాదిస్తున్నారు.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్‌ జిల్లాలో ఐదు, జగిత్యాల జిల్లాలో రెండు సెగ్మెంట్లు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అయితే, టీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ ల మధ్య ఓట్ల వ్యత్యాసం 2 లక్షల వరకు ఉంది. బలమైన నేత బరిలోకి దిగితే కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్‌ లోక్‌ సభ అభ్యర్ధుల జాబితా సిద్ధం చేస్తామని టీపీసీసీ ప్రకటించింది. నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్ధిగా ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేది ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here