నిర్మలా సీతారామన్‌ మోదీ ప్రతినిధిగా మారారు

0
  • రాఫెల్‌పై మరోసారి అబద్దాలు చెప్పారు
  • రాఫెల్‌పై విచారణకు మోదీ భయపడుతున్నారు
  • అందుకే ఆయన లోక్‌సభకు రావడం లేదు
  • మోదీతో రాఫేల్‌పై చర్చకు కేవలం 15 నిమిషాలు ఇవ్వండి
  • దేశమంతా నిజనిజాలు ఏమిటో తెలుసుకుంటుంది
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రధాని మోదీ ప్రతినిధిగా మారారని, మరోసారి పార్లమెంట్‌లో రాఫెల్‌పై అబద్దాలు చెప్పారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. సోమవారం లోక్‌సభ ప్రారంభమైన అనంతరం రాఫేల్‌ ఒప్పందంపై వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌కు సంబంధించిన కాంట్రాక్టులపై అనుమానాలు రేకెత్తేలా చేసి పార్లమెంటును తప్పుదోవ పట్టించేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని రక్షణశాఖ మంత్రి ఆరోపించారు. దీనిపై రాహుల్‌ పార్లమెంటు బయట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మలా సీతారామన్‌ ప్రధాని మోదీ ప్రతినిధిగా మారారంటూ మండిపడ్డారు. ‘హెచ్‌ఏఎల్‌ను బలహీనపరిచి అనిల్‌ అంబానీకి మేలు చేయాలని భాజపా ప్రయత్నిస్తోందన్నారు. దానికి రావాల్సిన కాంట్రాక్టులను ప్రధాని మోదీ తన స్నేహితుడైన అనిల్‌ అంబానీకి ఇస్తున్నారన్నారు. హెచ్‌ఏఎల్‌కు లక్షల రూపాయల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామని రక్షణశాఖ మంత్రి చెబుతున్నారని, కానీ ఈ రోజు అసెంబ్లీలో మాత్రం హెచ్‌ఏఎల్‌కు రూ.26,570.80కోట్లు ఇచ్చామని నిర్మలా సీతారామన్‌ చెప్పారని అన్నారు. విూరుచేసిన రాఫేల్‌ ఒప్పందంపై వైమానిక దళం లేదా రక్షణశాఖ సీనియర్‌ అధికారులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదా? అని ప్రశ్నించాను. దీనికి ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి సమాధానం ఇవ్వాలని అడిగాను. ఈ విషయంలో దయచేసి అవునా? కాదా? అనే సమాధానం ఇవ్వండని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క హెలికాప్టర్‌ను కూడా డసో భారత్‌కు డెలివరీ చేయలేదని, కానీ ఆ కంపెనీకి భారీ మొత్తంలో చెల్లించారని రాహుల్‌ మండిపడ్డారు. రాఫేల్‌పై విచారణకు మోదీ భయపడుతున్నారు. అందుకే ఆయన లోక్‌సభకు రావడం లేదన్నారు. మోదీతో రాఫేల్‌పై చర్చకు కేవలం 15నిమిషాలు ఇవ్వండి చాలని రాహుల్‌ కోరారు. దేశమంతా నిజనిజాలు ఏమిటో తెలుసుకుంటుందన్నారు. మరోవైపు అంతకముందు హెచ్‌ఏఎల్‌ కంపెనీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోవడంతో రూ.1000 కోట్ల రుణాలు తీసుకోవడంపైనా రాహుల్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘వేతనాలు చెల్లించేందుకు హెచ్‌ఏఎల్‌ దగ్గర సరిపడా నగదు లేకపోవడంలో ఆశ్చర్యమేవిూ లేదని, అనిల్‌ అంబానీకి రఫేల్‌ డీల్‌ ఇచ్చారని, ప్రస్తుతం ఆయనకు హెచ్‌ఏఎల్‌కు చెందిన అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు కావాలని, వేతనాలు ఇవ్వలేకపోతే హెచ్‌ఏఎల్‌లో పని చేస్తున్న బెస్ట్‌ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు బలవంతంగా అయినా అనిల్‌ అంబానీ వద్దకు వెళతారంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here