ఒడిశా సిఎం అభ్యర్థి నిరంజన్ పట్నాయక్

0

★ ప్రకటించిన కాంగ్రెస్

(ఒడిశా, ఆదాబ్ హైదరాబాద్):రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రి పదవి చేపడతారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు చిరంజీవి బిశ్వాల్‌ తెలిపారు. నిరంజన్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ రాష్ట్రవ్యాప్త జనజాగరణ యాత్ర చేపట్టిన సంగతి విదితమే. బాలేశ్వర్‌ జిల్లాలోని అన్ని సమితుల్లో ఇందుకోసం ఏర్పాటు చేసిన బస్సు తిరుగుతున్న సంగతి గమనార్హం. ఈ నేపథ్యంలో బాలేశ్వర్‌లో చిరంజీవి విలేకర్లతో మాట్లాడుతూ నిరంజన్‌ నాయకత్వంలో పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటుందని, పార్టీ పూర్తి విజయం సాధిస్తుందన్న విశ్వాసంతో ఉన్నామని వివరించారు. రాష్ట్రంలో బిజద, కేంద్రంలో ఎన్డీయే పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మళ్లీ కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టాలన్న లక్ష్యంతో ఉన్నారని చెప్పారు. నిరంజన్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ఒక శక్తిగా ఆవిర్భవించిందని, ఇది బిజద, భాజపాను ఓడిస్తుందని తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ సభాపక్షం(సీఎల్పీ) నిరంజన్‌కు నాయకునిగా(సీఎం) ఎన్నుకుంటుందని, దీనిపై అందరిలో ఏకాభిప్రాయం ఉందని చిరంజీవి చెప్పారు. బస్సు యాత్రగా రాష్ట్రంలోని 314 సమితుల్లో జనజాగరణ యాత్ర చేపట్టిన పీసీసీ నేతలు శనివారం బాలేశ్వలో ప్రజల్ని కలిశారు. ఖొగ్రాయి, జలేశ్వర్‌, చాందిపూర్‌ ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరించారు. ఈసారి కాంగ్రెస్‌ను గెలిపించాలని నేతలు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here