మరో 24 గంటల పాటు వర్షాలు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మహారాష్ట్రలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌

వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 విూటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తెలంగాణ విూదుగా కర్ణాటక వరకూ మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణ సహా, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. సోమవారం కూడా దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులుగా మారాయి. దీంతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ అధికారులను ఆదివారం ఆదేశించారు. జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి రోడ్ల మరమ్మతులు, పునరుద్దరణ పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వడగండ్ల వర్షంతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here