సరికొత్త ధర్మపీఠం

0

చారిత్రక తీర్పులు ఇచ్చిన ఉమ్మడి హైకోర్టు అదృశ్యం అయింది. చారిత్రాత్మకంగా తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరం నుంచి రెండు హైకోర్టులు పనిచేయనున్నాయి.ఎన్నో అత్యున్నత తీర్పులకు నెలవైన తీపిగుర్తులు ఇక నుంచి భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఓ పేజీ. అందులో..సుప్రీంకోర్టు తీర్పులకు ఆదర్శంగా నిలిచిన ఉమ్మడి హైకోర్టు శకం ముగిసింది. బాధాకరంగా ఉన్నా… వందేళ్ళ చరిత్రలో నిజాం తరువాత 63 సంవత్సరాల 9 నెలల 64 రోజుల మహాప్రస్థానం ముగిసింది. భవిష్యత్తు ఆశల పల్లకిలో మరెన్నో తీర్పులు దేశానికి దిక్సూచి ‘లా’ ఉండావని కోరుకుంటూ… ఉమ్మడి హైకోర్టు గురించి కొన్ని విషయాలను స్పృశిస్తూ… ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ బృందం అందిస్తున్న ప్రత్యేక కథనం..

1956 – 2018 దాకా!..: నిజాం హయాం నాటి అద్భుత కట్టడం నాడు ఆరుగురు న్యాయమూర్తులు ఉన్నారు. నేడు 26 మంది జడ్జిలు ఉన్నారు. హైకోర్టు విభజనతో తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఓ కీలక అధ్యాయం ముగిసింది. 64 ఏళ్ళు సాగిన వెలుగునీడల చరిత్ర అది. స్వాత్రంత్య్రానికి పూర్వం నుంచి భాసిల్లిన ఈ అత్యున్నత న్యాయ శిఖరం ఇక తెలగాణకు మకుటాయమానం కానుంది. ఆధునిక చరిత్ర ప్రకారం చూస్తే ఈ ఉమ్మడి హైకోర్టు వయసు 64 ఏళ్లు. రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో హైకోర్టును 1956 నవంబరు 5న ఏర్పాటు చేశారు. కానీ ఈ హైకోర్టు భవనం అంతకు ముందు నుంచే ఉంది. హైదరాబాద్లో నిజాం నవాబు కాలంలో కట్టిన సుందరమైన భవనాల్లో హైకోర్టు కూడా ఒకటి. మూసీనది ఒడ్డున ఎరుపు-తెలుపు రంగు రాళ్లతో ఇండో-ఇస్లామిక్‌ శిల్ప రీతిలో దీనిని నిర్మించారు. దీని రూపకర్త జైపూర్కు చెందిన శంకర్లాల్‌. ఒక ఆకృతినిచ్చే డిజైన్‌ వేసింది స్థానిక ఇంజినీరైన మెహర్‌ అలీ ఫాజిల్‌. ఏడో నిజాం నవాబు మిర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో 1915 ఏప్రిల్‌ 15న దీని నిర్మాణం ఆరంభమై 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్‌ 20న ఉస్మాన్‌ అలీఖాన్‌ దీనిని ప్రారంభించారు. 1919లోనే ప్రధాన భవన నిర్మాణం పూర్తి చేశారు. ఆనాడే ఆరుగురు జడ్జీలను, వారికి ఛాంబర్లను ఏర్పాటు చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పడిన తర్వాత జడ్జీల సంఖ్యను 12 మందికి పెంచారు. తర్వాత 1958-59 ప్రాంతంలో అదనపు భవనాన్ని నిర్మించారు. జడ్జిల సంఖ్య 14కు పెరిగింది. అప్పట్లో హైకోర్టు పరిధిలో 20 వేల కేసులు ఉంటే.. 1970 నాటికి 35 వేలకు చేరింది. దాంతో జడ్జీల సంఖ్యను కూడా 21కి పెంచారు. 1980 నాటికి కేసుల సంఖ్య 55,593కు చేరుకుంది. నాలుగంతస్తులతో మూడో అనుబంధ భవనాన్ని 8 కోర్టు హాళ్లతో ఆ తరువాత నిర్మించారు. కేసుల సంఖ్య లక్ష దాటిపోవడంతో జడ్జిల సంఖ్య కూడా 36కు పెంచాలని కేంద్రం తలపోసింది. కానీ 26 మందితోనే నడిచింది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక చరిత్రాత్మక తీర్పులను హైకోర్టు వెలువరించింది.

అగ్నిప్రమాదం – చెక్కు చెదరని రికార్డులు:

2009 ఆగస్టు 31న హైకోర్టు భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కానీ రికార్డులకు ప్రమాదం జరగలేదు. మొదటి చీఫ్‌ జస్టి?సగా నిజాం కాలంలో నవాబ్‌ ఆలమ్‌ యార్‌ జంగ్‌ బహదూర్‌ కొనసాగారు. ఉమ్మడి హైకోర్టు ఏర్పడ్డాక తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ కోకా సుబ్బారావు 1956 నుంచి 1958దాకా పనిచేశారు. ఆ తరువాత పి చంద్రారెడ్డి, పి సత్యనారాయణ రాజు సీజేలుగా అయ్యారు. జస్టిస్‌ గోపారావు ఎగ్బొటే, జస్టిస్‌ ఎస్‌ ఓబుల్రెడ్డి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, జస్టిస్‌ చల్లా కొండయ్య, జస్టిస్‌ అల్లాడి కుప్పుస్వామి, జస్టిస్‌ కొండా మాధవరెడ్డి, జస్టిస్‌ కోకా రామచంద్రరావు, జస్టిస్‌ ఎస్బీ మజుందార్‌,. జస్టిస్‌ ఏఆర్‌ లక్ష్మణన్‌ మొదలైన అగ్రశ్రేణి న్యాయమూర్తులు సీజేలుగా పనిచేసి వన్నెతెచ్చారు.

ఆయన డిఫరెంట్‌:

జస్టిస్‌ దిలీప్‌ బి.బొసాలే పదోన్నతిపై అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లడంతో ఆ స్థానంలో జస్టిస్‌ రంగనాథన్‌ బాధ్యతలు చేప్పట్టారు. జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌ 1958 జూలై 28న న్యూఢిల్లీలో జన్మించారు. 1977లో గ్రాడ్యుయేషన్‌, 1981లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. చార్టెర్డ్‌ అకౌంటెంట్గా, కంపెనీ సెక్రటరీగా కూడ ఆయన అర్హత సాధించారు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. 1985 నవంబర్లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా నమోదయ్యారు. 1996 నుంచి 2000 వరకు ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూలై నుంచి 2004 మే వరకు అదనపు అడ్వొకేట్‌ జనరల్గా సేవలందించారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం, విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌, సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తదితర ప్రముఖ సంస్థలకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. 2005, మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006 ఫిబ్రవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2015 డిసెంబర్‌ 29 నుంచి ఆంధ్రప్రదేశ్‌ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు.

తండ్రిని న్యాయమూర్తి కాకుండా అడ్డుకున్నా… నేడు కుమారుడు ఏపీ చీఫ్‌ జస్టిస్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి చీఫ్‌ జస్టిస్గా చాగరి ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి నియమితులయ్యారు. 2012 జూన్‌ 29న ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయిన ప్రవీణ్‌ కుమార్‌ 2013 డిసెంబర్‌ 4న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా హైకోర్టును కేంద్రం విభజించడంతో ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్గా చాగరి ప్రవీణ్‌ కుమార్ను నియమించారు. ప్రవీణ్‌ కుమార్‌ ప్రముఖ న్యాయవాది, మానవతావాది సి. పద్మనాభరెడ్డి కుమారుడే. 60 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో పద్మనాభ రెడ్డి చేసిన సేవలను ఇప్పటికీ న్యాయప్రముఖులు పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఫీజులు చెల్లించుకోలేని పేదలకు పద్మనాభరెడ్డి పెద్ద దిక్కుగా ఉండేవారు.ఫీజుతో నిమిత్తం లేకుండా కేసులు వాదించేవారు. ఎవరైనా పేదలు ఫీజు చెల్లించేందుకు అప్పులు చేశారని తెలిస్తే, వారికి తిరిగి డబ్బులు వెనక్కు ఇచ్చేసేవారు. కొందరికి చార్జీలకు డబ్బులు కూడా పద్మనాభరెడ్డి తన సొంత జేబులో నుంచే ఇచ్చేవారు. ఏ కేసు విషయంలోనైనా న్యాయమూర్తులు ఒక నిర్ధారణకు రాలేకపోతే పద్మనాభరెడ్డి సలహాలు తీసుకునే వారు. పోలీసుల ఎన్కౌంటర్లో ఎవరైనా చనిపోతే కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న దానిపై న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి రాలేని సమయంలో కోర్టు సహాయకారిగా పద్మనాభరెడ్డి నియమితులయ్యారు.ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు నిరూపించుకోవాలని, కేసే నమోదు చేయకుండా పోలీసులే అది ఎన్కౌంటర్‌ అని తీర్పులు ఇచ్చుకోవడం సరికాదని పద్మనాభరెడ్డి సూచించారు. దీంతో ఎన్కౌంటర్‌ జరిగితే పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది.వామపక్షవాదిగా, ప్రజా ఉద్యమాలకు పద్మనాభరెడ్డి అండదండలు కూడా అందించారు. అయితే ఇంత ఘనత ఉన్న పద్మనాభరెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా మాత్రం కాలేకపోయారు. పద్మనాభరెడ్డి వామపక్ష భావజాలాన్ని చూపుతూ? ఈయనకు కొన్ని రాజకీయ విశ్వాసాలున్నాయంటూ ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇచ్చింది. దీంతో ఆయన న్యాయమూర్తి కాలేకపోయారు.పద్మనాభరెడ్డి అనంతపురం జిల్లా యాడికి గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పద్మనాభరెడ్డిని న్యాయమూర్తి కాకుండా పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆయన కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌ న్యాయమూర్తి కాగలిగారు. ఇప్పుడు ఏపీ తొలి చీఫ్‌ జస్టిస్గా రాబోతున్నారు.

హైకోర్టు సంచలన తీర్పులు

సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ పెద్దగా ఆసక్తి కలిగించవు. సంచలనాలు అసలే కలగించవు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వారి వృత్తి వ్యాపకాలు ప్రజా జీవితంలో ముడిపడి ఉండవు. జన జీవితంలో ఉండరు. కాని పదునైన తీర్పులు ఇవ్వడం ద్వారా ప్రజల మన్ననలను పొందుతారు. వారి ఆదరాభిమానాలకు పాత్రులు అవుతారు. పౌరహక్కులకు పట్టం కట్టే, ప్రభుత్వ దమననీతిని ఖండించే, అధికార యంత్రాంగం అలక్ష్యం, అవినీతిని శిక్షించే విధంగా తీర్పులివ్వడం ద్వారా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి పోతారు. అటువంటి వారు బహుకొద్ది మంది ఉంటారు. వారిలో ఒకరు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, సుప్రీంకోర్టు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా ఆయన అందరికీ సుపరిచితుడు. న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.

ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి?..: కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద్ద ముత్తేవి గ్రామంలో 1953 జూన్‌ 23న చలమేశ్వర్‌ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మీనారాయణ ప్రముఖ న్యాయవాది. తండ్రి స్ఫూర్తితో న్యాయవిద్యను అభ్యసించారు చలమేశ్వర్‌. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. పలు కీలక కేసులు వాదించారు. 90వ దశకంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. తర్వాత పదోన్నతిపై గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2011 అక్టోబరులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ ఏడాది అక్టోబర్‌ 11న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ చలమేశ్వర్‌ లు ఒకే రోజు ప్రమాణస్వీకారం చేయడం విశేషం.

సంచలన తీర్పులు..: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యారు. పలు కీలక కేసుల్లో ప్రజాప్రయోజనాలకు పట్టం కడుతూ, ప్రభుత్వ అనుచిత వైఖరిని ఎండగడుతూ, అధికారుల అనాలోచిత చర్యలను సూటిగా నిలదీస్తూ తీర్పులను వెలువరించారు. ధర్మాసనంపై కూర్చున్నప్పుడు ఆయన దృష్టి అంతా కక్షిదారుల ప్రయోజనాలు కాపాడటం పైనే ఉండేది. చట్టం,ధర్మం, న్యాయంపైనే మనసు లగ్నం చేసేవారు. చట్టాల ముందు వ్యక్తులు చాలా చిన్నవారని ఆయన భావించేవారు. ఆయన తీర్పులు కూడా ఆ దిశగానే ఉండేవి. న్యాయాన్ని నిక్కచ్చిగా చెప్పడంలో నీళ్లు నమిలేవారు కాదు. సూటిగా, సరళంగా, స్పష్టంగా తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పేవారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కాకుండా వారి జీవిత భాగస్వామ్యులు, వారిపై ఆధారపడిన వారి ఆస్తులు, ఆదాయాల వివరాలను కూడా సమర్పించాలంటూ జస్టిస్‌ చలమేశ్వర్‌ తీర్పివ్వడం విశేషం. ఎవరికైనా చికాకు ఇబ్బంది కలిగించే ఈ మెయిల్‌ సందేశాలు ఇచ్చే వారిని అదుపు చేసేందుకు పోలీసులకు అధికారం ఇచ్చే ఐటీ చట్టంలోని 66 ఎ సెక్షన్‌ చెల్లదంటూ జస్టిస్‌ నారిమన్‌ తో కలసి తీర్పునిచ్చారు. ఆధార్‌ కార్డు లేదనే పేరుతో ఏ పౌరుడికి అయినా మౌలిక సేవలు, ప్రభుత్వ సబ్సిడీలు నిరాకరించరాదంటూ జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ నాగప్పన్‌ లతో కలసి నిక్కచ్చి తీర్పునిచ్చారు. వ్యక్తిగత గోప్యత ప్రాధమిక హక్కంటూ జస్టిస్‌ పుట్టస్వామి కేసులో తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనం కేసులో చలమేశ్వర్‌ కూడా ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలను చేపట్టే సుప్రీంకోర్టు కొలీజియం పనితీరు పారదర్శకంగా లేదని చెప్పడం ద్వారా వ్యవస్థలోని డొల్లతనాన్ని ధైర్యంగా ఎండగట్టారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పరిస్థితులు సవ్యంగా లేవంటూ ఈ ఏడాది జనవరి 12నన సహచర న్యాయమూర్తులు జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎంబీ లోకూర్‌, జస్టిస్‌ జోసెఫ్‌ లతో కలిసి విలేకర్ల సమావేశంలో ప్రకటించడం సాహసోపేతమైన చర్య అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జస్టిస్‌ ఖన్నాతో పోల్చి..: జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రతిభాపాటవాలను పలువురు సీనియర్‌ న్యాయవాదులు ప్రస్తుతించడం విశేషం. 1977లో జనతా ప్రభుత్వ హయాంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన శాంతిభూషణ్‌ జస్టిస్‌ చలమేశ్వర్‌ ను జస్టిస్‌ హెచ్‌.ఆర్‌ ఖన్నా తో పోల్చడం ఆయన గౌరవానికి నిదర్శనం. జస్టిస్‌ ఖన్నా అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ ప్రాధమిక హక్కులకు పట్టం కట్టారు. పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను వాదిస్తూ తరచూ ప్రభుత్వపై ధ్వజం ఎత్తే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తండ్రే శాంతిభూషణ్‌. చలమేశ్వర్‌ వంటి గొప్ప న్యాయమూర్తుల ముందు వాదనలను విన్పించడం బార్‌ సభ్యులకు వరమని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే కొనియాడారు. జూనియర్‌ న్యాయవాదులకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని మరో న్యాయవాది గోపాల్‌ శంకర్‌ నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయమూర్తి పదవీ విరమణ రోజులు ప్రధానన్యాయమూర్తితో కలిసి కేసులు విచారించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ప్రస్తుత ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో విభేదాల నేపథ్యంలో జస్టిస్‌ చలమేశ్వర్‌ ఈ సంప్రదాయాన్ని పాటిస్తారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ వ్యక్తులు కన్నా వ్యవస్థలు, సంప్రదాయాలు మిన్న అని భావించే జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆయన అనుమానాలను పటాపంచలు చేస్తూ చివరి రోజున దీపక్‌ మిశ్రాతో కలసి కేసలు విచారించడం ద్వారా తన నిబద్ధతను చాటుకున్నారు.

సాహాసోపిత నిర్ణయం: 1975 మే 11న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వెకేషన్‌ బెంచ్గా ఉన్న జస్టిస్‌ చిన్నపరెడ్డి, జస్టిస్‌ గంగాధరరావు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినట్టుగా భూమయ్య, కిష్టాగౌడ్కు తెలియజేయలేదనే సాంకేతిక కారణంతో అర్ధరాత్రి ఉరి శిక్షను నిలిపివేస్తూ.. ఉత్తర్వులు పంపారు.

తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత?

తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?

చిలకలూరిపేట బస్సు దహనం కేసు

భూసేకరణ పై హైకోర్టు తీర్పు

ప్రకారమే పరిహారం చెల్లించాలి

తెలుగు రాష్ట్రాల పంచాయతీ ఎన్నికలు

  • హైకోర్టు కీలక తీర్పులు

సెట్టాప్‌ బాక్సుల కేసు

టీడీపీ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు

మాదకద్రవ్యాల కేసు

జంట నగరాల బాంబు పేలుడు కేసులు

అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు కీలక తీర్పు

అయేషా విూరా హత్యకేసులో హైకోర్టు సంచలన తీర్పు.

ఉమ్మడి హైకోర్టు సిబిఐకి అప్పగించిన చివరి కేసు ఇదే కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here