కొత్త సంవత్సరం రాక అంత ఈజీ కాదు..

0

నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగే కొత్త సంవత్సర వేడుకలను వీక్షించేందుకు ప్రపంచం నలు మూలల నుంచి పర్యాటకులు ఆక్లాండ్‌కి తరలివచ్చారు. ఆనందోత్సాహాలతో వెలిగించిన బాణాసంచా కాంతులు మిరుమిట్లు గొల్పాయి. రంగు రంగుల కాంతులను వెదజల్లుతూ బాణాసంచా కాల్పులు పర్యాటకులకు కనువిందు చేశాయి. సంగీత హోరు, ఆనందోత్సాహాల నడుమ 2019 సంవత్సరానికి స్వాగతం పలికారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని ఆనందించారు. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో రెస్టారెంట్‌లు, పబ్‌లు, బార్‌లు సందడి గా మారాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో టూరిస్టులు రెట్టించిన ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త సంవత్సరాల వేడుకలకు న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఎప్పటిలానే భారీ ఏర్పాట్లు చేసింది. అత్యవసర సర్వీసులను, సహాయ సిబ్బందిని అందుబాటులో ఉంచింది.

రాక పూర్తికావాలంటే అది 39సార్లు, 39చోట్ల భూమిని తాకాలి. ఈ అంతర్జాతీయ లెక్కల ప్రకారం క్రిస్మస్‌ ఐల్యాండ్‌లోని కిరిబటిలో 2019 కొత్త సంవత్సరం మొదటగా మొదలవుతుంది. హైదరాబాద్‌ కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలయ్యేటప్పటికే అక్కడ కొత్త సంవత్సరం సంతోషాల తలుపులు తడుతుంది. చివరాఖరుగా హౌల్యాండ్‌ ఐల్యాండ్‌ లోని బేకర్‌ ఐల్యాండ్‌లో కొత్తసంవత్సరం తలుపులు తడుతుంది. ఇక్కడ కొత్తసంవత్సరం వచ్చే సరికి అంటే 31వ తేదీ అర్థరాత్రి వచ్చేసరికి మన హైదరాబాద్‌లో జనవరి 1వ తేదీ సాయంత్రం 5.30 గంటల వుతుంది. 39 దేశాలలో కొత్తసంవత్సరం పొద్దుపొడవడానికి 26గంటల సమయం పడుతుంది. మన పక్కనే ఉన్నా పాకిస్థాన్‌లో కొత్తసంవత్సరం మనకన్నా అరగంట ఆలస్యంగా అంటే 12.30కు వస్తుంటే ఆఫ్ఘనిస్థాన్‌లో 1గంటకు, బంగ్లాదేశ్‌లో 11.30కే వస్తుంది. నేపాల్‌లో ఒక పావుగంట ముందు అంటే 11.45కే కొత్తసంవత్సరం అడుగుపెడుతుంది. చైనాలో కొత్త సంవత్సరం మనకన్నా రెండున్నర గంటల ముందు అంటే రాత్రి 9.30కే వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here