నయా ట్రెండ్‌..నయా గ్యాంగ్‌

0

  • రూటు మార్చిన స్నాచర్లు…
  • నిజామాబాద్‌లో కొత్తరకం స్నాచింగ్‌ లు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నిన్నటి వరకు మహిళల మెడలోని బంగారు ఆభరణాలు టార్గెట్‌ చేసిన స్నాచర్స్‌ ఇప్పుడు చేతిలో కనిపించే ఖరీదైన మొబైల్స్‌ పై గురిపెట్టారు రూటు మార్చిన పల్సర్‌ గ్యాంగ్‌ సినీఫక్కీలో సెల్‌ ఫోన్ల చోరీకి పాల్పడుతోంది. కేటుగాళ్ల హల్‌ చల్‌ తో నిజామాబాద్‌ వాసులు హడలెత్తిపోతున్నారు. నయాగ్యాంగ్‌ పోలీసులకు సవాల్‌గా మారింది. నిన్నటి వరకు చోరీ చేయడంలో కొత్త ఎత్తులతో రోడ్లపైకి వచ్చారు. అడ్రస్‌ కావాలంటూ బిల్డప్‌ ఇస్తూ.. మహిళల్ని బురిడీ కొట్టిస్తూ.. మాటల్లో పెట్టి.. ఒక్కసారిగా మెడల్లో బంగారాన్ని లాక్కెళుతున్నారు. తాజాగా ‘తెంపుడు’గాళ్లు కొత్త దారిని కనుకొన్నారు. చైన్‌ స్నాచింగ్‌లు చేయడమే కాకుండా మొబైల్స్‌ను స్నాచింగ్‌ చేయడం ప్రారంభించారు. నిజామాబాద్‌ నగరంలో కొత్తరకం స్నాచింగ్‌ ల పరంపరం కొనసాగుతోంది. ఖరీదైన మొబైల్స్‌ చేతిలో కనిపిస్తేచాలు సినీ ఫక్కీలో ఎగెరేసుకుపోతుంది పల్సర్‌ ముఠా గతంలో మహిళల మంగళ సూత్రాలను టార్గెట్‌ చేసిన స్నాచింగ్‌ ముఠా ఇప్పుడు మోబైల్‌ ఫోన్లను టార్గెట్‌ చేశారు. ఒకటి కాదు రెండు కాదు నెల రోజుల వ్యవధిలో 50కి పైగా ఖరీదైన మొబైల్స్‌ అపహరించుకుపోయారు. రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న వారితో పాటు ఫోన్లో మైమరచి మాట్లాడుతున్న వాళ్లను టార్గెట్‌ చేస్తూ సెల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లిపోతున్నారు పల్సర్‌ గ్యాంగ్‌. చైన్‌ స్నాచర్లు రూటు మార్చారు కేటుగాళ్లు టూ వీలర్‌ పై వచ్చి ఒంటరిగా ఫోన్‌ మాట్లాడుతున్న వారిని ఫాలో అవుతున్నారు ఎవరూ లేనిది చూసి వారి చేతుల్లోనుంచి ఫోన్లు గుంజుకెళ్తున్నారు. పట్టుకునేందుకు యత్నించే లోగా కనిపించకుండా పరారవుతున్నారు. పల్సర్‌ గ్యాంగ్‌ ఆగడాలతో నగరవాసులు ఒంటరిగా బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చాలా మంది ఖరీదైన స్మార్ట్‌ ఫోన్లు వాడుతుండటంతో స్నాచర్లు తమ రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు పల్సర్‌ బైక్‌ పై తిరుగుతూ ఒంటరిగా ఫోన్‌ మాట్లాడుకుంటూ వెళ్తున్న వ్యక్తుల చేతిలోంచి ఫోన్లు ఎత్తుకుని పరారవుతున్నారు. కొంతకాలంగా వరుసగా మోబైల్‌ ఫోన్లు చోరీ కొనసాగుతుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మోబైల్స్‌ పోగొట్టుకున్న బాదితులు కొందరు పోలీసుల గడప తొక్కితే మరికొందరు మిన్నకుండిపోతున్నారు. చోరి చేసిన సెల్‌ ఫోన్లు మొబైల్‌ షాపుల్లో మార్పిడి చేసేందుకు కొందరు వస్తున్నారని అనుమానంతో వాటిని తీసుకోవడం లేదని షాపు యజమానులు చెబుతున్నారు. చైన్‌ స్నా చింగ్‌ ముఠాలకు చెక్‌ పెట్టిన పోలీసులకు వరుస మొబైల్‌ చోరీలు సవాల్‌ గా మారాయి. సెల్‌ ఫోన్‌ దొంగతనాలపై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాన కూడలుల్లోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా మొబైల్‌ చోరీకిపాల్పడుతున్న పల్సర్‌ గ్యాంగ్‌ అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వరుస చైన్‌ స్నాచింగ్‌ లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. గొలుసు దొంగతనాలకు బ్రేక్‌ పడినప్పటికీ వరుస మొబైల్‌ చోరీలు సవాల్‌ గా మారింది. నెంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌ లపై వచ్చి దొంగలు తమపని కానిస్తున్నారు. పూసలగల్లిలో మొబైల్‌ చోరీ చేస్తూ పల్సర్‌ ముఠా సీసీ కెమెరాకు చిక్కింది. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చైన్‌ స్నాచింగ్‌ ల వ్యవహరించిన తరహాలోనే మొబైల్‌ స్నాచర్లను ఉక్కుపాదంతో అణచివేయాలని నగరవాసులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here