Featuredస్టేట్ న్యూస్

నవయుగంలో నయా నలుపుడు

? పెట్టుబడి 55 కోట్లు – 1935కోట్ల రుణం

? ఎన్‌ఓసీలు లేకుండానే ఎత్తేశారు

? కంపెనీ ఒకరిది తాకట్టు మరొకరిది

? ఆడిట్‌ లో అడ్డంగా బుక్‌

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

కలికాలంలో నవయుగం. కొత్త యుగానికి మరో పేరు. అలాగే కొత్త ఆలోచనలకు, సరికొత్త వ్యూహాలకు వారధి. రూ.55 కోట్ల ఒక కంపెనీ పేరుతో పెట్టబడి పెట్టి ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన భూములను.. ఎలాంటి ఎన్‌ఓసీలు లేకుండా… వేరే కంపెనీలు తనఖా పెట్టుకొని రూ. 1,935 కోట్లు రుణం తీసుకోగలవా? ఇది అక్షరాల సాధ్యమేనని నవయుగ గ్రూపు వయ్యారాలు ఒలకబోస్తూ..తుళ్ళుతూ..తూగుతూ.. నవ్వుతూ నిరూపించింది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న పరిశోధన కథనం.

ఎకరం కేవలం లక్షా పదిహేను వేలకే..:

భారీ సెజ్ను ఏర్పాటు చేయడానికి నవయుగ గ్రూపు కృష్ణపట్నంన్ఫ్ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట 2009, 2010లో రెండు విడతలుగా మొత్తం 4,731.5 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భూమిని ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేఐపీఎల్కు ఏపీఐఐసీ విక్రయించింది. ఈ భూములను సెజ్‌ అభివృద్ధి కోసం వినియోగించకుండా నవయుగ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుంది. నవయుగ గ్రూపునకు చెందిన మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, నవయుగ ఇంజనీరింగ్‌, కాటలిస్ట్‌ ట్రస్టీషిప్‌ ఇలా అనేక అనుబంధ కంపెనీల పేరిట ఏకంగా అక్షరాలా రూ.1,935 కోట్ల రుణాలు తీసుకుంది. వేరే కంపెనీ పేరిట ఉన్న భూములను తనఖా పెట్టుకొని బ్యాంకులు ఇందులో బ్యాంక్‌ అధికారుల చేతివాటం కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్‌ఓసీలు లేకుండా..:

భూములను తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే ఏపీఐఐసీ నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎన్‌ఓసీ లేకుండానే పలు బ్యాంకులు నవయుగ సంస్థకు ఆనందంగా రుణాలు ఉదారంగా ఇచ్చేశాయి. ఒక్క ఐ.ఎఫ్‌.సీ.ఐ మాత్రమే ఎన్‌ఓసీ కావాలని పట్టుపట్టడం, ఏపీఐఐసీ ఎన్‌ఓసీ ఇవ్వకపోవడంతో రూ.250 కోట్ల రుణం ఆగిపోయింది.

మా ఇష్టం.. విూం ఇంతే..:

ఏపీఐఐసీతో కుదిరిన ఒప్పందం ప్రకారం భూములు ఇచ్చిన రెండేళ్లలోగా ‘సెజ్‌’ను అందుబాటులోకి తీసుకురావాలి. నాలుగేళ్ల తర్వాత పనులను పరిశీలిస్తే కేవలం 4?5 ఎకరాల పరిధిలో కేవలం మూడు అంతస్తుల అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌, ఒక పాఠశాల, తాత్కాలిక క్యాంటీన్‌ (వారు వచ్చినప్పుడు ఏదైనా తినడానికి ఉండాలిగా మరి)ను మాత్రమే నిర్మించారు. అంటే తీసుకున్న 4,731.15 ఎకరాల్లో ఒక శాతం భూమిని కూడా వినియోగించుకోలేదు. ఒప్పందం కుదుర్చుకున్న 2008 ఆగస్టు 1న ఉన్న కేపీఐఎల్‌ వాటాదారులు 2013 సెప్టెంబర్‌ 16 మారిపోయారు. నవయుగ గ్రూపే కేఐపీఎల్‌ ను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న విషయం ఫర్పార్మెన్స్‌ ఆడిటింగ్లో బయటపడింది.

మరో 6,200 ఎకరాలు ఇవ్వరూ..ప్లీజ్‌:

అంతేకాదు కేఐపీఎల్‌ పేరిట తీసుకున్న రుణాలను నవయుగ సొంత అవసరాలకు వాడుకున్న విషయం బహిర్గతమైంది. సెజ్‌ పనులు మొదలు పెట్టకుండానే మరో 6,200 ఎకరాలు కావాలంటూ నవయుగ సంస్థ దరఖాస్తు చేసుకుంది. అంటే ఎంత వీలైతే.. అంత కుమ్మేయడమే లక్ష్యంగా నవయుగ ముందుకు దూకింది.

ఊహల్లో ఉపాధి..:

కృష్ణపట్నం పోర్టుకు 100 కిలోవిూటర్లు, చెన్నై పోర్టుకు 70 కిలోవిూటర్ల దూరంలో ఉన్న శ్రీసిటీ సెజ్‌ 180కి పైగా దేశ, విదేశీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 36,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు 75 కిలోవిూటర్లు, చెన్నైకి 100 కిలోవిూటర్ల దూరంలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నాయుడుపేట సెజ్‌ 60కి పైగా భారీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 6,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. మరి ఇదే సమయంలో కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోవిూటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నంన్ఫ్ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేపీఐఎల్‌) ప్రతిపాదించిన ‘మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌’ ఎన్ని పెట్టుబడులను ఆకర్షించింది, ఎంతమందికి ఉపాధి కల్పించిందో ఊహించగలరా? ప్రభుత్వం నుంచి 4,731.5 ఎకరాల భూమిని తీసుకొని పదేళ్లు దాటింది. అయినా ఈ సెజ్లో ఇప్పటిదాకా పనులే ప్రారంభం కాలేదంటే నమ్మగలరా?

నవయుగను నలుపుడే నలుపుడు:

కృష్ణపట్నం పోర్టు గొడవల్లో పీకల్దాకా చిక్కుల్లో ఉన్న కంపెనీపై మొదటి దెబ్బ పోలవరం డ్యాం రూపంలో పడింది. తర్వాత హైడల్‌ ప్రాజెక్టు నిర్మాణ కంట్రాక్టునూ రద్దు చేసిపారేసింది జగన్‌ ప్రభుత్వం. ఆ రెండు దెబ్బలు కాచుకుంటూ కోర్టుకు వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేస్తుండగానే మరో దెబ్బ బందరు పోర్టు రూపంలో పడింది. రద్దుల జాబితాలో దాన్ని కూడా చేర్చేసి, భూమి వాపస్‌ అని ఆర్డరేసింది జగన్‌ సర్కార్‌. అప్పట్లో ఒకేసారి రద్దు చేసేసిన 19 వేల కోట్ల పనుల్లో నవయుగ కంపెనీ పనులు ఎన్ని ఉన్నాయనే క్లారిటీ లేదు. నవయుగకు కేటాయించిన భూములు ముత్తుకూరు పంచాయతీ కిందకు వస్తాయి. ఇలా గత పదకొండేళ్ల కాలానికి గాను 400 కోట్లకుపైగా నవయుగ బాకీపడింది.

యదార్థమే…:

మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ పేరిట నవయుగ గ్రూప్‌ సాగించిన విషయాలపై ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) అధికారులను వివరణ కోరగా…అంతా యదార్థమేనని, విచారణ పూర్తి అయిందని చెప్పారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close