Featured

దేశంలో కొత్త రాజకీయ ఛానళ్ళు

  • హరీష్‌ చేతికి రాజ్‌ న్యూస్‌..?
  • తమిళంలో పన్నీర్‌, కమల్‌
  • బలం కోసం భాజపా
  • తెలుగులో తొలి పరిశోధన ఛానల్‌

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

జర్నలిస్టులకు చేతి నిండా పని. రాజకీయ నేతలు కొత్త కుంపట్ల కోసం స్వంత ఛానళ్ళ బాట పడుతున్నారు. దక్షిణాదిన ‘పాగా’ వేయడానికి భాజపా తమ భావజాలం ఉన్న జర్నలిస్టుల వేటలో పడింది. ‘రాజ్‌ న్యూస్‌’ హరీష్‌ రావు చేతికి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. తెలుగు జర్నలిజంలో దమ్మున్న ఓ పరిశోధన ఛానల్‌ కోసం ఓ ‘అజ్ఞాతవాసి’ అంతర్గతంగా ప్రయత్నాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వేసవిలోగా దేశవ్యాప్తంగా సుమారు 27 ఛానళ్ళు పురుడు పోసుకునున్నాయి. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

మీడియాపై ఎందుకంత ప్రేమ.?:

రాజకీయులు రాజకీయాలు మాత్రమే చేస్తారు. అలాంటి వారికి మీడియాపై ఎక్కడ లేని ‘ప్రేమ’ ఎందుకు.? ”అధికారం చేజిక్కించు కోవాలంటే ఓ ప్రసార సాధనం వెంట ఉండాలి. లేని గొప్పలను చెప్పించుకుంటూ… రాతలతో.. చూపులతో ఊదరగొట్టాలి. అందులోనూ పక్కాగా ప్రజల మనస్సులు కొల్లగొట్టే రాతగాళ్ళు, చూపగాళ్ళు ఎంతమంది ఉన్నారు.?” అంటూ భాజపా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

రాజకీయ ‘చుట్ట’ ఛానళ్ళు:

తెలుగు రాష్ట్రాల్లో మీడియా ఎవరి చేతుల్లో ఉంది..? బహిరంగ రహస్యం. అధికారం మాటున రాజకీయ జేబులో ‘పెన్ను’లా మారింది. ‘పెన్ను గన్ను’లా పేల్చే ధైర్యం ఉన్న జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు. లాలూచీ బతుకీడ్చే వాళ్ళు ఎంత మంది. తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోయో వాళ్ళు ఎంత మంది.? పాత్రికేయులు ప్రసేన్‌ బెల్లంకొండ సందర్భంలో.. ప్రసేన్‌ బెల్లంకొండ మాటల్లో… ”పాత్రికేయులు చాలా బలవంతులలా కనపడతారంతే. వాళ్ళ బలంలో యాజమాన్యం ఎంత బలప్రదర్శనకు అనుమతిస్తుందో అంతే బలవంతులు…”. ఇది చాలా గంభీర సమస్య. ‘కవర్‌’ఏజ్‌ జర్నలిజం పెరిగిన ఈ రోజుల్లో నిజాలను నిబ్బరంగా చెప్పే ఛానల్‌ రావడం తప్పనిసరి. ఈమధ్య ద్వితీయ శ్రేణి నాయకులు ఛానళ్ళ వైపు దృష్టి సారించారు. సారిస్తున్నారు. అవేవీ ప్రొఫెషనలిజంతో నడవక పోవడంతో ‘వైట్‌ ఎలిఫెంట్‌’లా మారాయి. కొన్ని ఛానళ్ళు అయితే ఇక నుంచి రెండేళ్ల దాకా ‘బరువు’ మోయండి. ఆ తర్వాత మీ ఇష్టం. అంటూ కొన్ని యాజమాన్యాలు పరువు కోసం పాకులాడుతున్నాయి.

హరీష్‌ రావు చేతికి ‘రాజ్‌ న్యూస్‌’..?:

ఒకప్పుడు తెలంగాణ న్యూస్‌ తో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ‘రాజ్‌ న్యూస్‌’ ఇప్పుడు మంత్రి హరీష్‌ రావు చేతుల్లోకి వెళ్లిపోయిందా?? తనకంటూ ప్రత్యేకంగా మీడియా ఉండాలన్న ఆలోచనలో హరీష్‌ ఉన్నారా?? హరీష్‌ కు తెలంగాణలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ట్రబుల్‌ షూటర్‌ గా హరీష్‌ రావు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ తో విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఓవైపు సీఎంగా కేటీఆర్‌ రాబోతున్నారన్న ప్రచారం జోరుగా ఉంది.

‘బినామీ’తో ముందుకు..?:

సమయంలో? సిద్ధిపేటకు చెందిన ప్రముఖ కేబుల్‌ ఆపరేటర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ ‘రాజ్‌ న్యూస్‌’ను తీసుకున్నారన్న వార్త మీడియా వర్గాలలో జోరందుకుంది. దీంతో ‘ఆయన వెనకున్నది మంత్రి హరీష్‌’ అని ప్రచారం సాగుతోంది. కేటీఆర్‌ కు సీఎం పదవి ఇస్తే? ఇప్పుడున్న మీడియాలో తనకు అండగా ఉండేందుకు ఎవరూ ముందుకు రారని, ప్రధాన మీడియా అంతా సీఎం కేసీఆర్‌ కనుసన్నల్లోనే నడుస్తున్న తరుణంలో తనకంటూ ప్రత్యేకంగా మీడియా గొంతు అవసరం పడుతుందని ఊహించి?చడీచప్పుడు కాకుండా ‘రాజ్‌ న్యూస్‌’లోకి వచ్చారనే చర్చ బలంగా వినిపిస్తోంది.

‘రాజ్‌’ ప్లేస్‌ లో మరొక పేరుతో..’

ప్రస్తుతం రాజ్‌ న్యూస్‌ ఉన్న చోటు నుండే మరో ఛానల్‌ ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ విషయాలన్నీ అధికారికంగా హరీశ్‌ రావు ఖండిస్తారు. అది సహజం కూడా.

రవిప్రకాష్‌ ది 36 కాదు:

తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియా ‘ఐకాన్‌’ టివి9 మాజీ సిఇఓ రవిప్రకాష్‌ గురించి ఓ జాతీయ పార్టీ బలంగా ఆలోచిస్తుంది. అయితే ఛానల్‌ 36 అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. ఆయన తన బాణీలో తాను ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

జర్నలిజంలో దమ్ముందా..?:

”జర్నలిజంలో దమ్ముందా..? దమ్ములో జర్నలిజం ఉందా..?” అంటూ గత కొద్ది సంవత్సరాలుగా నిర్మొహమాటంగా, నిజాయితీగా వార్తలు అందించే ఓ పరిశోధన పాత్రికేయుడు ‘అవినీతి చాప కింద సముద్రం’లా ‘నీడ’లా వెంటాడే ఓ ఛానల్‌ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిసింది. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా కాని కాకుండా ‘న్యుట్రల్‌’ రీతిలో వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకు ముందే ఓ రేడియోను విన్నూత్న తరహాలో ముందుకు తేనున్నట్లు తెలుస్తోంది.

పాత వాసనలకు దూరంగా..:

దేశంలో సుమారు వంద ఛానళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్‌, తమిళం, కన్నడం, తెలుగు ప్రాంతాల్లో ఛానళ్ళు మొదలెట్టే సీనియర్‌ పాత్రికేయులు ఇప్పటికే అమ్మకాలకు ఉన్న ఈ ఛానళ్ళ వైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. వీరు సరికొత్త బ్రాండ్‌ తో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. జర్నలిస్టులకు జీతాలు చెల్లించి… మంచి కథనాలను పిండుకునే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఃూచీ:

తమిళంలో… హవా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం కుమారుడు, తేని ఎంపీ రవీంద్రనాథ్‌ కుమార్‌ సొంత టీవీ ఛానల్‌ ప్రారంభించే పనుల్లో ఉన్నారు. సన్‌ టీవీ డీఎంకే అధికార ఛానల్‌ తరహాలో పని చేస్తున్న సమయంలో అన్నాడీఎంకే జయా టీవీ ప్రారంభించింది. అనంతరం కలైంజ్ఞర్‌ టీవీ, డీఎండీకేకు కెప్టెన్‌ టీవీ, పీఎంకేకు మక్కల్‌ టీవీ తదితర ఛానెళ్లు పుట్టుకొచ్చాయి. ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థల అధినేత పారివేందరన్‌ ‘పుదియ తలమురై’ అనే ఛానల్‌ తీసుకొచ్చారు. భాజపాకు మద్దతుగా తారమై టీవీ, సీమాన్‌ కు తమిళన్‌ టీవీ ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే అధికార ఛానల్‌ జయా టీవీ టీటీవీ దినకరన్‌ చేతల్లోకి వెళ్లింది. దీంతో ఆ పార్టీ ‘న్యూస్‌ జే’ అనే ఛానల్‌ మొదలెట్టింది. పేరుకు అన్నాడీఎంకే ఛానల్‌ అయినా ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ఛానెల్‌ నడుస్తున్నట్లు తెలిసింది. ‘న్యూస్‌ జే’లో ఎక్కువ శాతం ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్దుతుగానే కార్యక్రమాలు ఉంటున్నాయని, ఉప ముఖ్యమంత్రి పనీర్‌ సెల్వంకు అంతగా ప్రాధాన్యం కల్పించటం లేదని సమాచారం. దీంతో ప్రత్యేక ఛానల్‌ ప్రారంభించే యోచనలో రవీంద్రనాథ్‌ కుమార్‌ ఉన్నట్లు తెలిసింది. నెల రోజులుగా రవీంద్రనాథ్కుమార్‌ దిల్లీలో మకాం వేసినట్లు తెలిసింది. అలాగే చెన్నైలోని మీడియా ప్రముఖులు, తన సహాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పన్నీర్‌ సెల్వం తరఫున టీవీ ఛానల్‌ ప్రారంభమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close