నియోజకవర్గ స్వరాజ్యమే ఆశయంగా – న్యూఇండియా పార్టీ

0

”నియోజకవర్గ స్వరాజ్యమే లక్ష్యంగా న్యూఇండియా పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్‌ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. నియోజకవర్గ స్థాయి సమస్యలు, ప్రజల అవసరాలు తెలిసినవాడిగా సగటుమానవుని కోసం ఎవ్వరూ తయారుచేయడానికి ఏ పొలిటికల్‌ పార్టీ / నాయకుడు / ఎమ్‌ ఎల్‌ ఏ / అభ్యర్థి సాహసించని విధంగా విలక్షణ మ్యానిఫెస్టోను తయారు చేసారు. అందరూ మానిఫెస్టోను ఒక పుస్తకంగా విడుదలచేస్తే జయప్రకాశ్‌ వంద రూపాయల ”బాండ్‌ పేపర్‌ మీద” హామీపూర్వకంగా రాశారు. మానిఫెస్టోలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చక పోయిన వెంటనే రాజీనామా చేస్తానని, నియోజకవర్గ ప్రజలు ఎమ్‌ ఎల్‌ ఏ పై క్రిమినల్‌ కేసు పెట్టుకోవచ్చునని నియోజక వర్గ ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పితే మరోసారి దేశంలో ఏ నియోజక వర్గం నుంచీ పోటీ చేయనని వ్రాతపూర్వకంగా వాగ్దానం చేశారు. తన మానిఫెస్టోకు ”నియోజకవర్గపు మానిఫెస్టో” అని పేరు పెట్టారు. ఆయన ఇచ్చిన హామీలు ఇలా ఉన్నాయి.

నియోజకవర్గ మానిఫెస్టో వివరాలు : గెలిచిన అసెంబ్లీ స్థానంలో అద్దె ప్రాతిపదికన మొదటి వారంలోనే ”నియో జకవర్గపు అభివద్ధి భవనాన్ని” ఏర్పాటు చేస్తామన్నారు. రాష్త్ర ప్రభుత్వం నుండి నాకు ప్రతి నెల వచ్చే 2లక్షల జీతాన్ని, కిరాయిమొత్తాన్ని నియోజక వర్గ అభివ ద్ధికే కేటాయి స్తామన్నారు. రెండవ వారం లోపే నియోజకవర్గపు అభివ ద్ధి భవనంలో 20 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మూడవ వారం పూర్తి అయ్యే లోపు ప్రజల కనీస అవసరాలు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రక్షణ, మంచినీటి, శిశుసంక్షేమానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. ప్రతి నిత్యం, అందుబాటులో ఉండేవిధంగా ఆయా శాఖల ఉద్యోగులను నియోజకవర్గ భవనంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 6 గంటలవరకు ఉద్యోగులను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇస్తే 24 పని గంటలలో పరిష్కారిస్తాం, నియోజకవర్గ అభివద్ధి నిర్ణయాలలో స్థానికులను, వివిధ సంఘాలను, స్వచ్చంద సంస్థలను భాగస్వామ్యం చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి సెంటరును ఏర్పాటు చేసి, అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో వ్యాపార అవకాశాల, అభివ ద్ధి సెంటర్‌ ను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో అభివ ద్ధి పనుల ప్రాసెస్‌ ను ఎవరైనా క్షణాల్లో తెలుసుకోవచ్చుననీ, నియోజక వర్గ అభివద్ధి నిధుల వినియోగ వివరాలు ప్రతి రోజు నియోజవర్గ అభివద్ధి భవనంలో చూసుకోవచ్చుననీ అన్నారు.

అభివద్ధి నిధులలో ఒక్క రూపాయీ కూడా అవినీతి జరగదనీ, ఆర్ధిక భద్రతా చట్టం కోసం ప్రజలను చైతన్యవంతులను చేస్తాననీ చెప్పారు. నియోజవర్గ అభివ ద్ధిఫలాలను ప్రతి ఇంటికి చేరుస్తాను. బలహీనులు, పేదలకు, సామాన్యులకు, అణగారిన, అణగదొక్కబడిన ప్రజలందరికి నిరంతరం అండగా ఉంటాను అని హామీఇచ్చారు. విద్య వైద్యం న్యాయం, కనీస అవసరాలు, మౌలిక వసతులు అందరికీ అందేటట్లు చేస్తానన్నారు.యువ శక్తి నిర్వీర్యం కాకుండా జాతీయ సమైక్యత, సామజిక అభివద్ధి కార్యక్రమాలలో అందరిని భాగస్వామ్యం చేసేందుకు క షి చేస్తానన్నారు. కుల, మత, ప్రాంత తేడా లేకుండా సమ పరిపాలన సమ న్యాయం నిరంతం అందేవిధంగా చేస్తానన్నారు. నియోజక వర్గంలో ప్రతి ఓటర్‌ పాత్ర, బాధ్యత,హక్కులు ఏమిటని అందరికి తెలిసేవిధంగా అవగాహనా కల్పించి, జాతీయ సమగ్రతను, సామజిక అభివ ద్ధిని పెంపొందించేలా నియోజకవర్గ, రాష్ట్ర, దేశాభివ ద్ధి కోసం ప్రజలను భాగస్వామ్య అయ్యేవిధంగా చేస్తాను అని చెప్పారు. తమ న్యూ ఇండియా పార్టీ కి ఓటు వేసి గెలిపించి నవ యువ భారతానికి నాంది పలకాలని జయప్రకాష్‌ విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here