Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

కొత్త ప్రధానిపై కోటి ఆశలు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

అవకాశం వస్తుందనుకున్నవారు, అందలాన్ని ఎక్కాలనుకున్న వారందరూ కనుమరగయ్యారు. ప్రజలిచ్చిన తీర్పుతో తెలంగాణ రాష్ట్రరాజకీయాల రూపురేఖలే మారిపోయా యి. డిల్లీ నుంచి వచ్చిన జాతీయ నాయకులు తెలం గాణలో వారం పదిరోజులు తిష్టవేసినా కనీస ఫలితాలు సాధించలేదు. ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు పలు కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాహుల్‌గాంధీతో పాటు, సోనియా గాంధీ, పలువురు సినీతారులు తెలంగాణ ఆసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని ఉర్రూతలూగించారు. కాంగ్రెస్‌కు తోడుగా చంద్రబాబునాయుడు కూడా తెలంగాణలో తిష్టవేసి ప్రచారం కొనసాగించారు. అంచనాలకు మించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు కూడా ఒక్కోరోజు పది, పదిహేను బహిరంగసభల్లో పాలుకొని తెలంగాణ నినాదాన్ని ప్రతి నియోజకవర్గంలో చాటాడు. కాని ఎవ్వరి ఊహగానాలకు మించకుండా తెలంగాణలో విజయబావుటా

ఎగరేసిన కెసిఆర్‌ మళ్లీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2018 సంవత్సరం కెసిఆర్‌కు ఒక మరిచిపోలేని విజయాన్ని జ్ఞాపకంగా ఇచ్చింది. 2019లో కేంద్రం ఎన్నికల్లో కీలక నేతగా మారిపోవాలని ఆ దిశగా పావులు దుపుతున్నారు కెసిఆర్‌. రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాల్లోనూ ఎన్నో అనుకొని పరిణామాలకు మూలంగా మారిపోయింది. కొత్త సంవత్సరంలో కేంద్రానితో పాటు పలు రాష్ట్రాలలో జరుగనున్న ఎన్నికల్లో ఎవరికి అపజయాన్ని, విజయాన్ని చేకూరుస్తయో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు, తమిళనాడు రాజకీయాలు కూడా చాలా రసవత్తరంగా మారనున్నాయి. అక్కడ ప్రతిపక్షం బలంగా లేకున్నా తమిళ కథానాయకుల ఆరంగేట్రంతో అక్కడ రాజకీయాలు మారిపోనున్నాయి. ఎవరిదే అధికారపక్షమో, మరెవరిదీ ప్రతిపక్షమో కొత్త సంవత్సరంలోని కొన్ని నెలల్లోనే తెలిపోనుంది…

కేంద్రంలో జెండా పాతదెవరు… కొత్త సంవత్సరంలో పార్లమెంట్‌ ఎన్నికలను రంగం సిద్దమవుతోంది. ఇప్పటికి అధికారంలో ఉన్న బిజెపి పార్టీ రానున్న ఎన్నికల్లో మళ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోనుందా అంటే ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌లో జరిగిన పలు అవినీతి కుంభకోణాలతో పాటు ప్రజలు కూడా మార్పువైపు మొగ్గు చూపారు. కాని అధికారంలో ఉన్న బిజెపి సామాన్యుల కంటే సంపన్నులకే వైపే ఎక్కువ మొగ్గుచూపారని తెలుస్తోంది. బిజెపి పరిపాలనలో మోదీల కుంభకోణాలకు తోడు, సామాన్య జనాలు వాడే వంట గ్యాస్‌, పెట్రోల్‌పై ధరలు రోజురోజుకు చుక్కలను తాకడం కూడా కారణంగా చెప్పవచ్చు. ప్రతి వస్తువుపై జిఎస్టీ, ప్రతి ఆకౌంట్‌లో లక్షాయాభైవేల వంటి పలు వాగ్దానాలను బిజెపి ప్రభుత్వం అమలు చేయడంలో వెనుకంజలోనే ఉంది. దానికి తోడు దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధాని చేయని పర్యటనలు నరేంద్రమోడీ చేయడం, వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై కూడా పలు వ్యతిరేకత ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించింది. అందుకే 2019లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి గెలుపు మాత్రం నల్లేరుపై నడకలానే ఉంది. కాంగ్రెస్‌లో మంచి జాతీయ యువనాయకుడిగా పేరుగాంచిన రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌లో ఆయన మాట తీరు, ప్రజల సమస్యలపై ఆయన స్పందిస్తున్న వైనం, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని చెప్పవచ్చు. బిజెపిలో సీనియర్‌ నాయకులందరిని పక్కనపెట్టి అమిత్‌షా, మోడీ కలయిక, వీరు తీసుకున్న ఏకచత్రాధిపత్య నిర్ణయాల వల్లనే బిజెపి ఓటమి చెందవచ్చని చెప్పవచ్చు. బిజెపిపై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌ పార్టీ సరియైన దిశగా వాడుకుంటే దేశాన్ని పాలించే భావిభారత ప్రధాని కాంగ్రెస్‌ నుంచే రావచ్చనే అభిప్రాయం ఉంది. కాగా సర్వేలు మాత్రం మోదీకే మరోసారి అవకాశం దక్కుతుందని చెబుతున్నాయి.

ఆంధ్రాలో ఎవరిదీ గెలుపు… ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ నుంచి ప్రచారం చేసిన చంద్రబాబుకు తాను కూడా మంచి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని అందుకు తాను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేస్తానని కెసిఆర్‌ అంటున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడుకు అక్కడి ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉంది. కాని జగన్‌ పనితీరు, ఆయన నిర్ణయాలే పార్టీ వైఫల్యాలకు కారణాలుగా చెప్పవచ్చు. కాని వైకాపా అధినేతగా ఉన్న జగన్‌ పలు కార్యక్రమాలతో ప్రజల్లో దూసుకుపోతున్నాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కొద్దిలో చేజార్చుకున్న వైకాపా పార్టీ ఈ సారి మాత్రం ఏలాగైనా అధికారంలో రావాలని పాదయాత్ర సైతం మొదలుపెట్టాడు. జగన్‌ ఎదుర్కోవడంపై చంద్రబాబునాయుడు కసరత్తులు చేస్తుంటే, ఆయనకు తోడుగా ఆంధ్రాలో మరో పార్టీ రాజకీయ ప్రవేశం చేస్తుంది. గత పది సంవత్సరాల నుంచి జనసేన పేరుతో నడుస్తున్న పవన్‌ ఈ సారి ఎన్నికల్లో పోటీకి సైతం సిద్దమయ్యాడు. జనసేన పేరుతో దూసుకుపోతున్న పవన్‌కు సరియైన నాయకత్వం, నాయకుడంటూ లేకపోవడం ఆయన బలహీనతగా మారిపోయింది. పవన్‌ అభిమానులంటూ వేలల్లో, లక్షల్లో ఉన్న యువతలో కనీసం సగం మందికి కూడా ఓటు హక్కు లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్‌. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు గాజు గ్లాసు గుర్తును కూడా కేటాయించింది. ఒక పక్క జగన్‌, మరో పక్క పవన్‌ కళ్యాణ్‌ వీరికి మద్దతుగా కెసిఆర్‌ కూడా ప్రచారానికి వస్తున్నానని చెప్పడంతో అక్కడ ఆంధ్రా రాజకీయాలు దేశ రాజకీయాల కన్నా గరం గరంగా మారిపోతున్నాయి. పిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, మార్చి లేదా ఏప్రిల్‌లో అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ఆంధ్రా రాజకీయాలు ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి. కాని ఆంధ్రప్రదేశ్‌కు సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబేనని ఆయన మళ్లీ వస్తేనే రాష్ట్రంలో ఉన్న కష్టాలపై గట్టెక్కుతుందని చెపుతున్నారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్దిపథంలోకి నడిపించిన చంద్రబాబు మరోమారు అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు మంచిదనే భావనలో ఆంధ్ర ఓటర్లు ఉన్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాలు జగన్‌ విజయావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.

తెలంగాణలో సీనియర్లకు మొండిచెయ్యి.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మొదటి నుంచి కొనసాగిన పలు సీనియర్‌ నేతలకు 2018లో మొండిచెయ్యే మిగిలింది. పోరాట యోధుడుగా పేరుగాంచిన తెరాస సీనియర్‌ నేత తన్నీరు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లకు మొండిచెయ్యి చూపిందని చెప్పవచ్చు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ సీనియర్లను పక్కనబెట్టిందనే ఊహగానాలు వినవస్తున్నాయి. కెసిఆర్‌ తన తనయుడిని సిఎం కుర్చీపై కూర్చోపెట్టాలని పార్టీలో ఉన్న సీనియర్లందరిని పార్లమెంట్‌కు తీసుకుపోవాలనే ఆలోచనలో కెసిఆర్‌ చక్రం తిప్పుతున్నారు. అదే జరిగితే కొత్త తరం నాయకత్వంతో తెలంగాణాలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కే అవకాశం ఉంది. పాత సంవత్సరం సీనియర్లకు చేదుగా మిగిలిన కొత్త సంవత్సరం మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితిలో యువ నాయకులకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

దేశ రాజకీయాలలో మార్పులు.. కొత్త సంవత్సరంలో పలు మార్పులకు నాంది పలుకనుంది. దేశ రాజకీయాలే కాకుండా గ్రామ రాజకీయాలు కూడా ప్రధానం కానున్నాయి. పంచాయితీ ఎన్నికలతో పాటు దేశ ప్రధాని ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ప్రధాన రాజకీయాలన్నీ 2019లో జరుగనుండటంతో ఎవరికి అదృష్టం కలిసోస్తుందో చెప్పలేము. దేశానికి కొత్త ప్రధానితో పాటు, గ్రామాలకు కొత్త సర్పంచ్‌లు రానున్నారు. 2018లో జరిగిన తెలంగాణ ఆసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా రసవత్తరాన్ని సృష్టించినా, 2019 మాత్రం ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరంలో కొత్త నాయకులు ఆరంగేట్రం మొదలుకానుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close