Featuredస్టేట్ న్యూస్

ఆర్టీసీలో కొత్త లొల్లి

  • అవసరం తీరాకా వదిలేస్తారా
  • మాకు న్యాయం చేయండి
  • కేసీఆర్‌పై తాత్కాలిక ఉద్యోగుల ఫైర్‌…

తెలంగాణలో ఆర్టీసీ పంచాయతీ ముగిసిన విషయం తెలిసిందే. కార్మికులతో స్వయంగా చర్చలు జరిపిన సీఎం కేసీఆర్‌.. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఐతే ప్రస్తుతం అంతా సజావుగా సాగుతున్న వేళ ఆర్టీసీలో కొత్త లొల్లి షురూ అయింది. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌ వరాలు జల్లు కురిపించారని.. మరి మా పరిస్థితేంటని తాత్కాలిక ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ శాశ్వత ఉద్యోగులు విధుల్లో చేరడంతో.. తాము రోడ్డున పడ్డామని సమ్మె కాలంలో పనిచేసిన తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు 52 రోజులు పనిచేసి ప్రభుత్వానికి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామని వారు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడం, ప్రభుత్వంతో చర్చలు సఫలీకృతం కావడంతో తమను గాలికి వదిలేశారని వాపోతున్నారు తాత్కాలిక ఉద్యోగులు. తాత్కాలిక ఉద్యోగులు గా పనిచేసిన డ్రైవర్‌, కండక్టర్లను ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులులో భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ దిల్‌ సుఖ్‌ నగర్‌ డిపోలో పనిచేసిన తాత్కాలిక కార్మికులు డిపో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తమను ఇలా వాడుకుని వదిలేయడం భావ్యం కాదంటూ వారు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని అయినప్పటికీ కష్టపడి పనిచేసినట్లు తెలిపారు. ఇకపోతే ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పనిచేశారు. రవాణా విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంలో అహర్నిశలు శ్రమించారు. అంతేకాదు ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ పట్టుదలతో ఉండటానికి కారణం కూడా తాత్కాలిక ఉద్యోగులేనని అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రంలో బంద్‌ ప్రభావం అంతా లేదనిపించేలా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు పనిచేశారు. ఒకవేళ తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు లేకపోతే కేసీఆర్‌ ఎప్పుడో దిగివచ్చేవారని యూనియన్‌ నాయకులు రోపించిన సంగతి తెలిసిందే.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close