Featuredస్టేట్ న్యూస్

కోళ్లపారంలో కొత్తదందా…

  • నకిలీ బంగారం, ఆయుధాల సరఫరా..
  • ఆకస్మిక సమాచారంతో పోలీసుల తనిఖీ..
  • పోలీసుల విచారణలో నిందితులు…
  • ఎవ్వరిని వదిలేది లేదంటున్న పోలీసులు..

కోళ్లఫారం అంటే ఏం చేస్తారు.. చిన్న చిన్న కోడిపిల్లలను తీసుకొచ్చి వాటికి ఏలాంటి ఇబ్బందులు రాకుండా, అంటువ్యాధులు అంటకుండా పెంచి పెద్ద చేస్తారు.. వాటి బరువు అనుకున్నంత వచ్చాక, వ్యాపారి నమ్మకం కుదిరాక కోళ్లను విక్రయించి లాభాలను తీసుకుంటారు ఇదీ ప్రతి కోళ్లఫారం యజమాని చేసే వ్యాపారం. కాని ఇక్కడ కోళ్లపారం పేరిట ఎవరికి అనుమానం రాకుండా, ఎవరి కంట కనబడకుండా చీకటి దందా కొనసాగిస్తున్నారు.. నకిలీ వ్యాపారాన్ని యధేచ్చగా కొనసాగిస్తూ ఎంతోమందిని మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. నకిలి బంగారు, అక్రమ గంజాయి దందాతో పాటు ఇతరుల రాష్ట్రాల నుంచి ఆయుధాల సరఫరా కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. పోలీసులకు తెలిసినా సమాచారం ప్రకారం మండల కేంద్రంలో ఉన్న కోళ్లఫారంను ఆకస్మిక తనిఖీ చేసి నిందుతులతో పాటు నకిలి బంగారు, ఒక ఆయుధంతో పాటు నిందుతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.. వీరి అక్రమ దందా ఎక్కడెక్కడ సాగుతోంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి, ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు, దీని వెనుకాల ఎవరెన్నారనే విషయాలపై పోలీసులు నిందితుల నుంచి కూపీలాగే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం..

వరంగల్‌ బ్యూరో ఆదాబ్‌ హైదరాబాద్‌…

జిల్లాలోని ప్రశాంతంగా ఉన్న మండలం అది.. ఏ అధికారైనా అక్కడ పనిచేయాలంటే మక్కువ చూపుతారు. అలాంటి ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో గత కొన్ని రోజుల నుంచి అక్రమ వ్యాపారాలు యధేచ్చగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మండంలోని లక్ష్మిదేవిపేట గ్రామంలో గంజాయి రవాణాకు ప్రధాన కేంద్రమని తెలుస్తోంది. గతంలో మండలంలోని ఒక యువకుడు గంజాయికి అలవాటు పడి చనిపోయినట్లు ప్రచారం ఊపుదుకొంది. కాని ఆ విషయం బయటికి రానివ్వకుండా ఆదిలోనే అడ్డుకున్నారని చెపుతున్నారు. ఇప్పటికి అదే గ్రామంలో గంజాయి వ్యాపారంతో పాటు, దొంగనోట్ల చెలామణి కూడా మూడు పువ్వులు, ఆరుకాయలుగా కొనసాగుతుందని అక్కడి గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నట్లు సమాచారం. దానికి తోడు ఇప్పుడు వెంకటాపూర్‌ మండల కేంద్రంలోనే అక్రమ నకిలీ వ్యాపారం యధేచ్చగా సాగుతోంది. వెంకటాపూర్‌ మండల కేంద్రంలోని వెంకటాపూర్‌, పాలంపేట రహదారిపై ఉన్న ఒక కోళ్లఫారం గత పది, పదిహేను సంవత్సరాల నుంచి కోళ్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇటీవల దాని యజమాని మరికొంతమందికి భాగస్వామ్యంతో దానిని నడిపిస్తున్నాడు. కాకపోతే వారి భాగస్వామ్యంతో నడుస్తోంది మాత్రం కోళ్ల వ్యాపారం కాదు, కోళ్ల వ్యాపారం మాటున అక్రమ నకిలీ దందా వ్యాపారం సాగుతోంది.

సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు..

మండల కేంద్రంలో నడుస్తున్న అక్రమ దందాపై ములుగు జిల్లా పోలీసులు వెంకటాపూర్‌ పోలీసులు సహకారంతో గత మూడు రోజుల క్రితం ఆ కోళ్ల ఫారమును ఆకస్మిక తనిఖీ చేసి పలు విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. నకిలీ బంగారంతో పాటు గంజాయి, తుపాకీ కూడా దొరికినట్లు మండల కేంద్రంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి, ఖమ్మం జిల్లాకు చెందిన మరో ఇద్దరితో కలిసి వెంకటాపూర్‌ మండల కేంద్రంలోని కోళ్లఫారం గత మూడు, నాలుగు నెలల క్రితం రెండు లక్షలకు అద్దెకు తీసుకున్నారు. కోళ్ల వ్యాపారం ముసుగులో నకిలీ బంగారం అమ్మకాలు కొనసాగించడమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయుధాలను తీసుకొచ్చి రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నర్సంపేటలో పట్టుబడిన నకిలీ బంగారం కేసులో ఇద్దరిని నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వెంకటాపూరంలో రవాణా చేసే ముఠా సభ్యుల వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గత గురువారం ములుగు, వెంకటాపూర్‌ పోలీసులు మండల కేంద్రంలోని కోళ్లఫారంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి సోదాలు చేయగా అరకిలో నకిలీ బంగారంతో పాటు పిస్తోలు లభ్యమైనట్లు తెలుస్తోంది. దీనితో కోళ్లఫారంను అద్దెకు తీసుకొని వ్యాపారం కొనసాగిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ములుగు పోలీస్‌స్టేషన్‌లో గత రెండు రోజుల నుంచి విచారిస్తున్నట్లు సమాచారం. వీరు నిర్వహిస్తున్న అక్రమదందాలో ఎవరెవరున్నారు, కోళ్లఫారం యజమానికి ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మండల కేంద్రంలో పట్టుబడిన నిందితులపై ఇప్పటికే నర్సంపేట, గూడూరు, ఖమ్మం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

అక్రమ దందాపై కఠినచర్యలు తీసుకోవాలి..

మండలంలోనే కాదు జిల్లాలో ఎక్కడ అక్రమ దందా, నకిలీ వ్యాపారం చేస్తున్న వారిపై, వారికి సహకారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకొని అలాంటి సంఘటనలు, వ్యాపారం మళ్లీ జరుగకుండా నిత్యం తనిఖీలు చేపట్టాలని వెంకటాపూర్‌ మండల ప్రజలు కోరుతున్నారు.. చీకటి దందాలను, చీకటి బాగోతాలను నడిపే వ్యక్తులను వదిలిపెట్టకుండా అందుకు సహకరిస్తున్న వారందరిపై కేసులు నమోదు చేయాలంటున్నారు. వెంకటాపూర్‌ మండల కేంద్రంలో జరుగుతున్న అక్రమ వ్యాపారంపై నిందితులపై త్వరలోనే కేసులు నమోదు చేస్తామని, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెపుతున్నట్లు సమాచారం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close