Featuredస్టేట్ న్యూస్

తలవంచక తప్పేలా లేదు..

  • ఆగని హైకోర్టు చురకలు..
  • ఏకమవుతున్న ప్రశ్నించే గొంతులు..
  • తూర్పార పడుతున్న ప్రజాసంఘాలు..
  • శాంతియుత చర్చలతోనే పరిష్కారం..

ఆర్టీసీ సమ్మె అనుకొని మొదట పట్టించుకొలేదు.. కార్మికులు ఎంతకు వెనక్కి తగ్గక పోయేసరికి బెదిరించారు. ప్రభుత్వం బెదిరింపులు చూసి కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఐనా ప్రభుత్వం చర్చలకు పిలవాల్సింది పోయి ఉప ఎన్నికల్లో గెలిచిన రోజు మరింతగా ఆర్టీసీ ఉద్యోగులపై విరుచుకుపడింది. ఉద్యోగులు కాదు అస్సలు సంస్థనే తీసివేస్తున్నామనే రీతిలో మాట్లాడింది. ఐనా కార్మికులు వెనక్కి తగ్గనే లేదు. ప్రభుత్వం, కార్మికుల మధ్య ¬రా¬రీగా సాగుతున్న మాటల పోరులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎంటరయ్యింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే సమ్మె ఇన్ని రోజులు కొనసాగుతోందని ఓటేసిన ప్రజలంటే మరీ చులకనగా చూస్తున్నారని దబాయిస్తూ ఉంది. ఆర్టీసీకి ప్రభుత్వం ఉన్న అప్పులు చిట్టా సైతం తెప్పించుకొని మొట్టికాయలు వేస్తోంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి, అటు ఆర్టీసీ ఉద్యోగులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకొవాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన భారీ బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ప్రతిపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ నిరవధిక సమ్మెకు మరింత ఉప్పందిస్తున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రభుత్వంపై ఏకపక్షంగా దాడిచేయడంతో ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గి చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవడం తప్ప మరే మార్గం కనిపించడమే లేదు.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌:

శాంతియుతంగా సాగే ఆర్టీసీ సమ్మెను చర్చలు ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం మాటల తూటాలతో మరింత అజ్యం పోసింది. ఆర్టీసీ డిమాండ్లపై నిపుణుల బృందంతో కమిటి వేసి తమ దారికి తెచ్చుకొవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాని ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఇరవై రోజులు దాటుతున్న ఇప్పటివరకు వారితో శాంతియుతంగా మాట్లాడిందీ లేదు, వారిని చర్చలకు పిలిచిందీ లేదు. ఒకసారి చర్చలకు పిలిచి తూతూ మంత్రంగా ఎవరి దారి వారే చూసుకున్నారు. తెలంగాణలో ఇన్ని రోజుల నుంచి సమ్మె సాగుతూ ప్రయాణీకులు నానా ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వం మాత్రం తమకేమి పట్టింపులేనట్లుగానే వ్యవహరిస్తోంది. ఆర్టీసీ కార్మికులే ప్రభుత్వ మాటలకు, ప్రభుత్వ ప్రవర్తనకు భయంతో ఉద్యోగాల్లో చేరుతారనే ఆలోచనల్లో ఉంది. కాని ప్రభుత్వం అవలంభించిన ప్రతి పని వ్యతిరేకంగా ఉండడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింతగా ఊపందుకుంటుంది. ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు పిలిచి తమ డిమాండ్లను నేరవేరుస్తేనే తాము వెనక్కితగ్గి సమ్మె విరమిస్తామని చెపుతున్నారు. తమ హక్కులు. డిమాండ్లను ఏలా కాపాడుకోవాలో తెలుసంటూ హైకోర్టు మెట్లను ఎక్కారు. ఇప్పుడు సమ్మె గొడవంతా ప్రభుత్వం, హైకోర్టు మధ్య వాదోపవాదాలుగా కొనసాగుతోంది. ప్రభుత్వం కనుక సమ్మె విషయంలో ముందడుగు వేయకుంటే హైకోర్టు పరిధి ఏంటో హైకోర్టుకు తెలసంటూ సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు.

చర్చలు లేదంటే సకల జనుల సమ్మెనే

తెలంగాణ ఆర్టీసీ సమ్మె సకలజనుల సమ్మెగా మారబోతుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే సమ్మె ప్రారంభమై 26 రోజులు దాటిపోతుంది. ప్రజలు ఇబ్బందులు, ప్రయాణీకుల ఇబ్బందులు మాత్రం చెప్పలేకుండా ఉన్నాయి. కానీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరపడానికి కూడా సముఖంగా లేదు. ఆర్టీసీ విషయంలో వెన్కక్కి తగ్గేది లేదని తేల్చిన సీఎం కేసీఆర్‌ కి హైకోర్టు చురకలు మీద చురకలు అంటిస్తుంది. ఆర్టీసీపై ప్రభుత్వం అవలంభించే ద్వంద వైఖరిని హైకోర్ట్‌ కూడా సీరియస్‌ గా తీసుకుంటుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్‌ ని పరిష్కరించకుండా ఆర్టీసీ కథ ముగియబోతుందని చెప్పడం సీఎం కేసీఆర్కి ఇబ్బందులు తెచ్చిపెట్టేలానే కనిపిస్తున్నాయి. ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాం అని అంటే కార్మికులు వెన్కక్కి తగ్గుతారని ప్రభుత్వం అనుకున్నట్లుగానే ఉంది. కానీ ఆర్టీసీ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్స్‌ ని పరిష్కరించేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు. ఆర్టీసీ నిరవధిక సమ్మెపై కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 47 కోట్ల రూపాయలు ఆర్టిసికి తక్షణమే ఇవ్వలేమన్న ప్రభుత్వ వాదనను హైకోర్ట్‌ ప్రస్తావిస్తూ హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో వంద కోట్ల హామీలిచ్చిన ప్రభుత్వం ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి రూ.47కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించింది. ప్రజల ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెపుతున్నారు కాని అలాంటప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. ఇప్పటికీ రాష్ట్రంలో మూడో వంతు బస్సులు నడవడం లేదని, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు చెప్పడంతో ఆత్మ రక్షణలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టీసీ తెలంగాణ జెఎసి సకల జనుల సమరభేరీ సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులని కోరగా సభకి అనుమతి ఇవ్వలేదు. దీనితో హైకోర్టుకి వెళ్లి ఆర్టీసీ సంఘం సభకు అనుమతి తెచ్చుకున్నారు. ఒకవైపు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అక్షింతలు, మరోవైపు ఇతరపార్టీల నుండి విమర్శలతో కేసీఆర్‌ ప్రభుత్వం కార్మికుల డిమాండ్లకు తలవంచక తప్పేలా లేదని సంకేతాలు కనబడుతున్నాయి. గోటితో పోయేదానికి గొడ్డలితో తెచ్చుకొని ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని మాటలు వినబడుతున్నాయి.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close