Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

మరో 5 ఏళ్లు కావాలా?

యాదాద్రి పనులపై కేసీఆర్‌ ఆగ్రహం

  • పనుల పురోగతిపై కేసీఆర్‌ ఆరా
  • స్వయంగా పనులను పరిశీలించిన సిఎం
  • యాడా వైఎస్‌ ఛైర్మన్‌ కిషన్‌ రావుతో చర్చ
  • బాలాలయంలో ప్రత్యేక పూజలు

యాదాద్రి

యాదాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు శనివారం యాదాద్రి వెళ్లిన ఆయన.. స్థానిక హరిత ¬టల్‌లో యాడా వైఎస్‌ ఛైర్మన్‌ కిషన్‌ రావు, స్థపతి ఆనందసాయి తదితరలుతో చర్చించారు. ఈ సందర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. పనులు పూర్తి చేసేందుకు మరో ఐదేళ్లు కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు మిన్నకుండిపోయారు.ఆలయ పనుల పురోభివృద్ది గురించి ఆరా తీసారు. పనులను పరిశీలించేందుకు ఉదయం యాదాద్రికి చేరుకున్న సిఎం కెసిఆర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండచుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా కొండచుట్టు 5.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు పనులను సీఎం పరిశీలించారు. యాదాద్రి గుట్ట చుట్టూ రూ.143 కోట్ల వ్యయంతో రింగ్‌రోడ్డును నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి పెద్ద కోటపై నిర్మితమవుతున్న ఆలయ నగరిని పరిశీలించారు. తుదిదశకు చేరుకుంటున్న ఆలయ నిర్మాణాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశర చేశారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం కోసం సీఎం స్థల పరిశీలన చేశారు. దాదాపు 100 ఎకరాలు అవసరమని భావిస్తున్న ముఖ్యమంత్రి అందుకు అనువైన ప్రాంతం గురించి చర్చించారు. త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సూచనల మేరకు యాగస్థల పరిశీలన చేయనున్నట్లు తెలుస్తోంది. రహదారి ప్రయాణంలో రాయగిరి సమీపంలోని మినీ ట్యాంక్‌బండ్‌, అభయారణ్యం, సుందరీకరణ పనులను అడిగి తెలుసున్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు యాడాకు మరో ఉన్నతాధికారిని నియమించే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ పనులకు సంబంధించి ఎస్‌ఈ స్థాయి వ్యక్తి పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కోరిక మేరకు సీఈ స్థాయి వ్యక్తిని త్వరలోనే ఉన్నతాధికారిగా నియమించనున్నట్లు సమాచారం. తొలుత బాలాలయంలో యాదాద్రి శ్రీ నరసింహస్వామివారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. సిఎం కెసిఆర్‌ వెంట మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి,జగదీశ్వర్‌ రెడ్డి, ఎంపి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి తదిరులు ఉన్నారు. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ కూడా ఉన్నారు. సిఎం రాకతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

యాదాద్రిలో మహా సుదర్శన యాగం : కేసీఆర్‌..

స్థల పరిశీలన యాదాద్రి నిర్మాణం పూర్తి కావస్తున్న నేపధ్యంలో యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ భారీ యాగాన్ని తలపెట్టారు. అందుకోసం స్థల పరిశీలన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాదాద్రి ప్రాశస్త్యాన్ని తెలియజేయటంతో పాటుగా యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తి కావస్తున్న నేపధ్యంలో ఆయన యాదాద్రి వేదికగా మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్న విషయం తెలిసిందే. మహా సుదర్శన యాగ నిర్వహణ, ఏర్పాట్లపై త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిసి కేసీఆర్‌ ఆయనతో చర్చించారు. జులై 30 మధ్యాహ్నం శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్‌ యాగ నిర్వహణపై స్వామీజీతో చర్చించి యాదాద్రిలో యాగం చెయ్యాలని సంకల్పించారు.

యాదాద్రి విశిష్టతను తెలియజేసేలాయాగం..

యజ్ఞం నేపథ్యంలో లక్షలాది సంఖ్యలో భక్తులు యాదాద్రికి తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థల పరిశీలన చెయ్యనున్నారు సీఎం కేసీఆర్‌. దీంతో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపైనా అధికారులతో చర్చించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాధిపతులతో పాటు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలలోని పెద్దలు, గవర్నర్లను ఆహ్వానించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. కేసీఆర్‌ నిర్వహించ తలపెట్టిన ఈ యాగానికి 3 వేల మంది రుత్వికులు వారికి సహాయకులుగా మరో 3 వేల మంది వేదం మంత్రోచ్చారణలతో యాగం నిర్వహించనున్నారు . ఇక యాగ నిర్వహణ కోసం 1048 యజ్ఞ కుండాలు ఏర్పాటు చేయనున్నారు. వైష్ణవ పీఠాలతో పాటు భద్రీనాథ్‌, శ్రీరంగం, జగన్నాథ్‌, తిరుపతి నుంచి మఠాధిపతులను ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇక యాగ నిర్వహణ కోసం అనువైన స్థల ఎంపిక సీఎం కేసీఆర్‌ చెయ్యనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close