ప్రకృతిని పరిరక్షించడం భారతీయ

0

పచ్చని గ్రహాన్ని ముందు తరాలకు అందించాలి

  • రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ

న్యూఢిల్లీ :

ప్రకృతిని పరిరక్షించడం భారతీయ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీలు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఈ మేరకు వారి సందేశాన్నించారు. భూమిని స్వచ్ఛంగా ఉంచడానికి భారత్‌ కట్టుబడి ఉందని, ప్రకృతిని పరిరక్షిస్తూ కలిసి జీవించడం భారతీయ విలువల్లో భాగమని వ్యాఖ్యానించారు. వాతారణ మార్పుల వల్ల వస్తున్న సమస్యల్ని పరిష్కరిస్తూ స్వచ్ఛమైన, పచ్చని గ్రహాన్ని ముందు తరాలకు అందించాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని మోడీ స్పందిస్తూ.. ప్రకృతికి అనుగుణంగా జీవనం సాగించాలని అప్పుడే మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. భూమిని స్వచ్ఛమైన గ్రహంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. మొక్కలు నాటమే కాకుండా అవి చెట్టుగా ఎదిగి ఫలాలిచ్చేంత వరకు సంరక్షించుకోవాలని ఆ వీడియోలో సందేశం ఇవ్వడం గమనించవచ్చు. అలాగే ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సందర్భంగా దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన భూగ్రహాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ పూనుకొని.. మార్పునకు నాందిగా నిలవాలని సందేశమిస్తున్న ఓ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఏటా జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here