జాతీయ రాజకీయాల యవ్వారం చూస్తా

0

జడ్చర్ల (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణను పట్టుకొని పీడిస్తానని, వదల బొమ్మాళి వదలా అంటూ చంద్రబాబు అంటున్నాడని, అలా అన్నందుకే నును ఓసారి తరిమేశానని, ఇప్పుడు మళ్లీ కూటమి పేరుతో కాంగ్రెస్‌తో జతకట్టి వస్తున్నాడని, ఇప్పుడు తరమాల్సిన బాధ్యత విూదేనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేసీఆర్‌ మాట్లాడారు.. పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నాలుగు సంవత్స రాలుగా ఏం జరుగుతుందో ప్రజలంతా చూస్తూనే ఉన్నారని సీఎం అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పాలమూరులో 90శాతం పూర్తి చేసుకున్నామని, ఇంకా కొంచెం పూర్తి కావాల్సి ఉందన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి మహబూబ్‌నగర్‌ జిల్లా దత్తత తీసుకున్నా మన్నారని, కానీ తొమ్మిదేళ్లు పాలమూరుకు చేసింది ఏవిూలేదని కేసీఆర్‌ మండిపడ్డారు. నాలుగేళ్లలో మనం నెట్టెంపాడుతో పలు ప్రాజెక్టులు చేపట్టామని, చంద్రబాబు తొమ్మిదే ళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పాల మూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దని ఢిల్లీ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన చంద్రబాబు ఏం మొఖం పెట్టుకొని ఇక్కడ ఓట్లు అడుగుతారో చెప్పాలని, ప్రజలంతా నిజానిజాలు ఆలోచన చేయాలని, పాలమూరు ప్రాజెక్టులు కానివ్వం, నీరు రానివ్వం.. అయినా సైకిల్‌కే ఓట్లు గుద్దాలని అంటే మనమేమైనా గొర్రెలమా అని ఆలోచించుకోవాలని కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి దూరి విూ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టి పోతా అంటున్నాడని, చంద్రబాబు వచ్చిన నాడు కచ్చితంగా నిలదీసి అడంగండి, కాంగ్రెస్‌ నాయకులను కూడా నిలదీయండని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌, దేవరకంద్ర, నాగర్‌కర్నూల్‌లలో నిలబడ్డ కాంగ్రెస్‌ అభ్యర్ధులు కోర్టులకు వెళ్లి కేసులు వేశారని, ప్రాజెక్టులు అడ్డుకొనే ప్రయత్నం చేశారని అన్నారు. వారిని తరిమికొట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పాలమూరులోని 14సీట్లూ గెలిపించాలని కోరారు. మంత్రి లక్ష్మారెడ్డి నాకు కుడిభుజంగా ఉన్నారు. పాలమూరు జిల్లా ప్రజలు, మేధావులు ఆలోచించాలని అన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ రెండూ తోడుదొంగలేనని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం తగ్గాలని.. రాష్ట్రాల అధికారాలు పెరగాలని అన్నారు. దేవరకొండ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీకి హిందూ ముస్లిం తేడా అనే బీమారీ ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటా. రాష్ట్రాల హక్కులను సాధించాలంటే కేంద్రంలో చురుగ్గా ఉండాలన్నారు.

కేంద్రం విూద ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని, కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావాలన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతారని, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఏ తెలివితేటలతో ఒప్పుకున్నారో ఉత్తమ్‌కుమార్‌ , జానారెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి.. వాళ్లే పాలించుకునేలా చేశామనీ, అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గంలో 85తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ పోరాటం ఇంకా అయిపోలేదని.. ఇక ముందూ కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ”గత ఎన్నికల్లో గెలిస్తే రూ.1000 పింఛన్‌ ఇస్తామని చెప్పాం. అన్నమాటను నిలబెట్టుకున్నాం. ఇప్పుడు గెలిపించండి పింఛన్‌ను రూ.2వేలకు పెంచుతాం. దివ్యాంగులకు రూ.3వేలు ఇస్తాం. నిరుద్యోగ భ తిని కూడా పెంచుతాం. చంద్రబాబు ఈ జిల్లాలో కొందరిని పోటీకి పెట్టారు. ఆయన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ‘వదల బొమ్మాళి.. వదలా’ అంటూ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నారు. గతంలో నా వంతు నేను ఒకసారి తరిమి కొట్టా. ఇప్పుడు ఆయన్ను తరిమికొట్టాల్సిన బాధ్యత మీదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here