Featuredక్రైమ్ న్యూస్స్టేట్ న్యూస్

గుప్తనిధుల కోసం నరబలి..!

అనంతపురం జిల్లాలో దారుణం

  • శివాలయంలో ముగ్గురి హత్య
  • రక్తంతో రుద్రునికి అభిషేకం
  • దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అనంతపురం

అనంతపురం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కొర్తికోట శివాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని హనుమమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిగా గుర్తించారు. గుప్త నిధుల కోసమే ఈ ముగ్గురినీ చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే జిల్లాలో అత్యంత దారుణంగా ముగ్గురిని హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం కొర్తికోట గ్రామంలో కోర్తికోటలో శివాలయం పరిసరాల్లో అనుమానస్పద రీతిలో మూడు మృతదేహాలు లభ్యమయిన విషయం తెలిసిందే. అయితే గుప్త నిధుల కోసం శివాలయంలో క్షుద్రపూజలు చేసి ఆ ముగ్గురిని నరబలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొర్తికోటలో పురాతనమైన శివాలయం ఉంది. ఇది శిథిలావస్థకు చేరటంతో దాని స్థానంలో రిటైర్డ్‌ టీచర్‌ శివరామిరెడ్డి (75), కొత్త ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి ఆయన సోదరి కమలమ్మ, బెంగళూరు నివాసి సత్యలక్ష్మి సహకరించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో నిద్రిస్తున్న ఈ ముగ్గురూ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. శివరామిరెడ్డి, కమలమ్మ(70), సత్యలక్ష్మి(70) గొంతుకోసి బండరాళ్లతో కొట్టి చంపారు. చనిపోయిన వారి రక్తాన్ని శివుడి విగ్రహానికి అభిషేకం చేశారు. ఆలయం సమీపంలో ఉన్న పాముల పుట్టల్లో కూడా రక్తాన్ని పోశారు. అయితే తాజా ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. గుప్తనిధుల కోసం వచ్చిన దుండుగులు నరబలి ఇచ్చారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. క్షుద్రపూజల కోసం ఈ ఆలయాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు హత్యతో కొర్తికోట గ్రామంతో పరిసర గ్రామాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. స్థానికులు సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటానాస్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ఘటనపై తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. కేసు విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని.. రాయలసీమ, కర్నాటక లోని గుప్తనిధుల వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామంటున్న ఎస్పీ తెలిపారు. ట్రిపుల్‌ మర్డర్‌ కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛాలెంజింగా తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close