నాని, సుధీర్‌ బాబు కాంబినేషన్‌లో నెం.36 చిత్రం వి ప్రారంభం

0

నేచురల్‌ స్టార్‌ నాని, హీరో సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, నివేదా థామస్‌ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ నెం.36 చిత్రం వి సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీమతి అనిత సమర్పణలో శిరీష్‌, లక్ష్మన్‌, హర్షిత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకష్ణ దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు ఎంసిఎ డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణు క్లాప్‌ కొట్టగా.. నేను లోకల్‌ దర్శకుడు త్రినాథరావు నక్కిన కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఎఫ్‌2డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here