నక్షత్ర ఆసుపత్రి సీజ్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దొంగతనంగా ప్రభుత్వం నుంచి స్పెషాలిటి ఆసుపత్రిగా పేరు తెచ్చిన నక్షత్ర ఆసుపత్రిపై చర్యలు తీసుకు న్నారు. పేద ప్రజలను వైద్యం పేరు తో పీడించడమే పనిగా పెట్టుకొని ఆసుపత్రిలో అటెండరే అన్ని తానై వైద్యం చేస్తూ, ప్రజలను మోసం చేస్తు న్న నక్షత్ర ఆసుపత్రి భాగోతాన్ని ఆదా బ్‌ బయటపెట్టింది. అటెండరే బాస్‌, జిరాక్స్‌ లిచ్చినా ఓఎస్‌ అనే కథనా న్ని ఆదాబ్‌

హైదరాబాద్‌ పేపర్‌ 29.12.2018 శనివారం రోజు ప్రచురితమయింది. ఒక వైద్యుడు ఉద్యోగనిమిత్తం రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని నక్షత్ర ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యాడు. ఆ వైద్యుడు జాయిన్‌ ఐనా కొన్ని రోజులకే ఆసుపత్రి యజమాన్యం పనితీరు నచ్చక 24 రోజులకే అక్కడ ఆసుపత్రిలో జాబ్‌ మానేశాడు. సదరు వైద్యుడు చంద్రకాంత్‌ జాయిన్‌ అయ్యే ముందు అక్కడి ఆసుపత్రిలో తన ఎంబిబిఎస్‌ సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌ పత్రాలు అందించాడు. ఆ ఆసుపత్రి యజమాన్యం ఆ వైద్యుడి జిరాక్స్‌ పత్రాలతో వారి ఆసుపత్రికి ఏకంగా అనుమతి తెచ్చుకుంది. వైద్యుడికి తెలియకుండా 21 నెలలు ఆసుపత్రిని నడిపించింది. అందులో పనిచేసే ఉద్యోగి సమాచారం తెలుసుకున్న వైద్యుడు ఆదాబ్‌ ప్రతినిధితో మొరపెట్టుకున్నారు. ఆదాబ్‌ ప్రతినిధి పూర్తి వివరాలు సేకరించి ప్రత్యేక కథనాన్ని రాసింది. ఆదాబ్‌ కథనాన్ని ఆసరాగా తీసుకుని వైద్యుడు రాష్ట్ర ఆరోగ్య కమిషనర్‌ కు పిర్యాధు చేశారు. ఆదాబ్‌ హైదరాబాద్‌ పేపర్‌ కథనం ఆధారంగా విచారణ చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొత్తూరు ఆసుపత్రిని సీజ్‌ చేసి, యజమాన్యంపై కేసు నమోదు చేశారు. అప్పుడు విధుల్లో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిపై కూడా కఠినచర్యలు తీసుకునేలా విచారణ చేపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామని వైద్యశాఖ అధికారులు చెప్పినట్టు డాక్టర్‌ చంద్రకాంత్‌ తెలిపారు.

ఆదాబ్‌ హైదరాబాద్‌ పేపర్‌కు ధన్యవాదాలు

వైద్యుడికి తెలియకుండా అతని జిరాక్స్‌ సర్టిఫికెట్లతో ఆసుపత్రికి అనుమతి తెచ్చిన విషయాన్ని అదాబ్‌ పత్రిక వివరంగా బయటికి తేవడాన్ని తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్న అదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక కు మేము ఎప్పటికి రుణపడి ఉంటామన్నారు. ప్రజలకు సంబంధించిన కథనాలు రాయడం పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్న పేపర్లు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రజల సమస్యలపై కథనాలు రాయడంలో, అవినీతిపై కథనాలు బహిర్గతపరచడంలో ఆదాబ్‌ ప్రత్యేకతనే వేరన్నారు. దొంగ ఆస్పత్రి కథనంపై ఆదాబ్‌ హైదరాబాద్‌ రాసిన కథనమే ప్రత్యేకమని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here