Featuredగాడ్జెట్లుజాతీయ వార్తలుటెక్నాలజీ

నేడే చంద్రయాన్‌-2 ప్రయోగం

చంద్రయాన్‌-2 ప్రయోగం

కోసం శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. సోమవారం మధ్యాహ్నం 2:43 గంటలకు శ్రీహారికోట నుండి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3ఎం1 వాహక నౌకను ప్రయోగించనున్నారు. ఇస్రో బాహుబలి రాకెట్‌ గా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3ఎం1 వాహక నౌకను ప్రయోగిస్తారు. ఈ నెల 14వ తేదీన చంద్రయాన్‌ -2 ప్రయోగం సక్సెస్‌ కాలేదు. సాంకేతిక కారణాలతో ఆ రోజున ఈ ప్రయోగాన్ని అర్ధాంతరంగానే నిలిపివేశారు. సాంకేతిక లోపాలను సరిదిద్దిన తర్వాత ఈ జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3ఎం1 వాహక నౌకను సోమవారం నాడు ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇస్రో ఛైర్మెన్‌ శివన్‌ ఈ విషయమై శాస్త్రవేత్తలతో చర్చించారు. లాంచ్‌ ఆథరైజేషన్‌ (ల్యాబ్‌) సమావేశంలో లోటుపాట్లపై చర్చించారు. వాహక నౌక ప్రయోగానికి ఈ సమావేశంలో అనుమతి ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ 3ఎం1 వాహక నౌక కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. దాదాపు 20గంటల పాటు నిరంతరాయంగా కౌంట్‌ డౌన్‌ కొనసాగనుంది. 3,850 కిలోల బరువు కలిగిన చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3-ఎం1 రాకెట్‌ ప్రయోగవేదికపై సిద్ధంగా ఉంది. ఈ నెల 14వ తేదీన చంద్రయాన్‌-2 ప్రయోగానికి 56 నిమిషాల ముందు కౌంట్‌ డౌన్‌ ను నిలిపివేశారు. క్రయోజనిక్‌ దశలో వచ్చిన సాంకేతిక సమస్యల కారణంగానే ఆ రోజున ప్రయోగం అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చిందని శాస్త్రవేత్తలు. చంద్రయాన్‌ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన రాష్ట్రపతి కోవింద్‌ నిరాశతోనే వెనుదిరిగి వెళ్లారు. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు షార్‌ వెలుపల కూడ ఏర్పాట్లు చేశారు. కానీ, ప్రయోగం సక్సెస్‌ కాకపోవడంతో అందరూ వెనుదిరిగారు.

ప్రయోగం వీక్షించేందుకు ఏర్పాట్లు

ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌ 2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు షార్‌లో ఏర్పాట్లు చేశారు. శబరి గిరిజన కాలనీలో గ్యాలరీఏర్పాటు చేశారు. దాదాపు 5వేలమంది కూర్చుని లాంఛింగ్‌ను చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిఒక్కరికీ స్పష్టంగా కనిపించేలా షార్‌ గ్యాలరీని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

పాత వారికి మళ్లీ అవకాశం

ఈనెల 15న ప్రయోగాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. అర్థరాత్రి అని కూడా లెక్కచేయకుండా ఎదురుచూశారు. అయితే చివరి నిమిషంలో ప్రయోగం వాదాయిపడటంతో అందరూ నిరాశకు గురయ్యారు.వారిని సంతృప్తి పరిచేందుకు గతంలో ఆన్‌లైన్‌లో నమోదుచేసుకున్నప్పుడు ఇచ్చిన సీరియల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి కొత్త పాస్‌ తీసుకునే అవకాశం కల్పించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close