నా పేరు సీత.. నేను గీసిందే గీత ఆసక్తికరంగా ‘సీత’ ట్రైలర్‌

0

హైదరాబాద్‌: కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడు. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫైటింగ్‌, యాక్సిడెంట్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. ‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా..’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని.. ‘ఇది కంచుకే కంచులా ఉంది రా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడం నవ్వులు పూయిస్తోంది. ఇందులో రామ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) అమాయకపు యువకుడిగా నటించారు. అతన్ని సీతే (కాజల్‌) దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. సోనూ సూద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ‘రావణా సురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అని ట్రైలర్‌ చివర్లో శ్రీని వాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఇందులో మన్నారా చోప్రా మరో కథానా యికగా నటించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here