Featuredస్టేట్ న్యూస్

మై హోం… చిన్న జీయర్‌ స్వామికి లింకేంటి..?


రామేశ్వర్ రావు ‘ ఐటి రైడ్స్‌ వెనుక..?

  • రూ.294 కోట్ల కహానీ
  • ప్రతీకారేచ్చతో రవి ప్రకాష్‌..!
  • ముందే చెప్పిన ‘ఆదాబ్‌’

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎట్టకేలకు రాజకీయ చదరంగం మొదలైంది. అందులోనూ ‘మీడియా’ తుఫాను కేంద్రీక తమై ఉంది. జర్నలిస్టులు ‘లేని ఛాతి’ చూపే వాళ్ళకు ఇది రాయాలంటే తెలియని ‘గోపి’ భయం. (యూనియన్ల ప్రస్థావనకు దూరం)

రాసేది.. చూపేది నిర్భయంగా ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ మాత్రమే. ఒక్కొసారి టార్గెట్‌ ను ‘ఫైరింగ్‌’ చేస్తున్నామని, అందుకు అధికారం కూడా తోడుగా ఉంటుందని , పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ లో ఎన్ని రౌండ్లు కాల్చినా… ఏం కాదనే ధీమా…తో ఫైరింగ్‌ మొదలెడతారు. తీరా చూస్తే ఆ ‘గన్‌’ తమ గుండెల వైపే ఉందని, అది ‘మిస్‌ ఫైర్‌’ అయిందని తెలిసేటప్పటికే ఖథ చాలా దూరం వెళుతుంది. సరిగ్గా అలాంటి సంఘటనే… టివి9 రవిప్రకాష్‌, మై హోం రామేశ్వర్ రావు లది. రవిప్రకాష్‌ ను గురి పెట్టిన తుపాకీ, మై హోం వైపు తిరగటమే.. ‘మిస్‌ ఫైర్‌’ అయిన అసలు కథ ఇది.

చిన్నజీయ్యర్‌… లింకుల లంకే..?:

ఆధ్యాత్మిక ప్రపంచంలో వివాదరహితుడు. అభ్యుదయవాది. తనదైన భక్తి ప్రపంచం. ఒక కోణం. మరోకోణంలో మైహోం రామేశ్వర్ రావు జియ్యర్‌ స్వామికి ప్రథమ శ్రేణి శిష్యగణంలో అగ్రజుడు. మై హోం ఆర్థిక లావాదేవీలకు జీయర్‌ స్వామి ప్రవచనా కేంద్రాలు ‘బిందువు’గా ఉన్నాయనే ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీంతో బాహ్య ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. ఇది ఇక్కడితో ఆగే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి తోడు రవిప్రకాష్‌ తనను పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంలో చెప్పిన ‘నిర్ఘాంతపోయే విషయాలు’ విచారణ పరిధి సైతం లోతుగా ‘అన్వేషించే స్థాయి ఈకేసు విచారణ అధికారులకు ఉందా.?’ అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒకవేళ రవిప్రకాష్‌ ‘విచారణలో చెప్పిన విషయాలను స్థానిక విచారణ అధికారులు పేర్కొనకపోతే… స్వయంగా రవిప్రకాష్‌ హైకోర్టు ద ష్టిలో పెడితే…’ పోలీసులకు ధర్మసంకటమే.! ఔరా… ‘విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం…

ఎంటో అలా అన్నీ ముందే తెలిసిపోతుంటాయి.

ఆ నలుగురూ…:

జియ్యర్‌ స్వామి వద్ద ట్రస్టు, ఇతర కార్యక్రమాలు చూసే నలుగురు, రామేశ్వర్ రావు వద్ద కీలకంగా వ్యవహరించే నలుగురు వ్యక్తులు ఈ లావాదేవీల విషయంలో చురుగ్గా వ్యవహించినట్లు తెలుస్తోంది. గతంలో చిన్న జియ్యర్‌, మై హోం రాజేశ్వరరావుల సానిహిత్యం పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే తెలంగాణరో పాగా వేయాలని చూస్తున్న భాజపా కొంత ఆసక్తి, అనురక్తి సహజంగా ప్దర్శిస్తోందని తెలుస్తోంది. అటు కేసీఆర్‌ కు ఇటు చిన్న జియ్యర్‌ కు దగ్గరగా ఉండే రామేశ్వర్ రావు ఆస్తులపై జరుగుతున్న (గురువారం కూడా ఆస్తి పత్రాల పరిశీలన జరిగింది) ఐటి దాడుల ‘లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక’.

ఇదిగిది ‘గో’ అరెస్టులు..? అవుట్‌ లుక్‌ నోటీసులు:

టివి9 రవిప్రకాష్‌ మీడియా జీవితంలో దుర్థినం. ఆయన కలం కష్టంపై ఎదిగిన సంస్థ నుంచి ఆయన్ని బయటకే కాదు… కటకటాల్లోకి పంపించాలనే కుట్ర విజయవంతంగా సాగింది. ఇంతలో

ఇదుగో రవిప్రకాష్‌ అరెస్టు, అదుగో శివాజీకి సంకెళ్లు అన్నంతగా హడావుడి జరిగిపోయింది అప్పట్లో%ౌౌ% రకరకాల కేసులు, ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు.. ప్రభుత్వం, పింక్‌ మీడియా ఒక్కటై రవిప్రకాష్‌ ను అర్జెంటుగా కటకటాల్లోకి తోసేయాలి, భ్రష్టుపట్టించాలి అన్నట్టుగా వ్యవహరించాయి. పనిలోపనిగా మోజోటీవీని ‘ఖతం’ పట్టించారు. రవిప్రకాష్‌ ఏం చేశాడు, ఏం చెప్పాడు, టీవీ9 కొత్త యాజమాన్యాన్ని ఎలా మోసగించాడు అనే వివరాల్ని, కేసుల్ని, వివాదాల్ని కాసేపు పక్కన పెడితే… ఇప్పుడు ఏమైంది..? ఏమీ కాలేదు. రవిప్రకాష్‌ బయటే ఉన్నాడు. బెయిల్‌ కోసం దరఖాస్తు చేశాడు. జూలై 21 నాటికి కేసు వాయిదా పడింది. ఈలోపు ఇక విచారణల్లేవ్‌%ౌౌ% సేమ్‌, శివాజీ%ౌౌ% విదేశాలకు వెళ్లిపోబోతుంటే పోలీసులు పట్టేసుకున్నారు. నో, నో, ‘నన్ను అరెస్టు చేయొద్దని కోర్టు చెప్పిందిగా’ అని గుర్తుచేశాడు. తనపై పెట్టిన కేసును క్వాష్‌ చేయాలంటూ కోర్టుకు పోయాడు. ఆ కేసూ 21కి వాయిదా పడింది. సో, అప్పటిదాకా తనపైనా ఇక విచారణల్లేవ్‌. పోలీసుల కెలకడాల్లేవ్‌. కానీ ఇదే సమయంలో అటువైపు క్యాంపు ఎలా ఉంది..?

వాళ్ళు వెంట్రుక పీకితే.. ఆయన జుట్టు పీకాడు..:

కారణాలు ఏమైనా ఉండనివ్వండి. మైహోం, మేఘా, శ్రీనిరాజుల హవాలా చెల్లింపులపై రవిప్రకాష్‌ ఈడీకి, సీబీఐకి పెట్టిన మెయిళ్లు ఫలించాయా… లేక ఫలించకపోవచ్చు. కానీ మైహోం అడ్డాల మీద భారీగా ఐటీ దాడులు జరిగాయి. చాలా టీంలు ఒకేసారి దాడులు చేసి, పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. ”ఏం దొరికాయి..? ఆ కాగితాల మూలాలూ ప్రగతిభవన్‌ మూలలకూ దారితీస్తున్నాయా” అంటూ రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోడీ ఏయే కారణాలతో కేసీయార్‌ ను టార్గెట్‌ చేసి, మైహోం మీదకు ఐటీ దళాలను నడిపిస్తున్నాడు అనేది ఓ విశ్లేషణ. ఓ చర్చ.. తరువాత వంతు అత్యంత ప్రముఖోత్తమ విద్యావేత్త మల్లారెడ్డి పనే అనేది ఇంకో ఊహాగానం. (దాని సంగతి తర్వాత చూద్దాం) సో, ఇన్నాళ్లూ రవిప్రకాష్‌కు తల నొప్పిని కలిగించిన చేసిన మైహోం రామేశ్వరరావు తనే అనుకోని తలనొప్పితో తలపట్టుకున్నాడు.

ఇదో డొంక:


రామేశ్వర్ రావు భక్తిగా సేవించే చినజియ్యరుడి ఆశ్రమమే అనేక అక్రమాలకు, ఈ ఆస్తులు, డబ్బుల లావాదేవీలకు అడ్డాగా మారిందనీ, తనపైనా ఐటీ ద ష్టి సారించిందనీ ప్రచారం జరుగుతున్నది.

ఐతే మైహోం అంత ఈజీగా దొరికిపోయేలా అడ్డదిడ్డంగా లావాదేవీలు నడిపే సంస్థ కాదు. అన్ని జాగ్రత్తలతోనే వ్యవహరిస్తుంటారు. అందుకే ఈరోజుకూ తమ దాడుల్లో ఏం జరిగిందో ఐటీ వెల్లడించ లేకపోయింది. (ఆ స్థాయిలో మేనేజ్‌ చేశారా అనే గుసగుసలు ఉన్నాయి). కానీ అందరి అటెన్షనూ రవిప్రకాష్‌ మీద నుంచి, శివాజీ మీద నుంచి మైహోం రామేశ్వరరావుపైకి మళ్లిందనేది నిజం. మోడీని గుడ్డిగా నమ్మేసి, రాజనీతిజ్ఞుడు కేసీయార్‌ అంత అజాగ్రత్తగా ఉంటాడనేదీ అబద్ధమే. పైగా మోడీ కుర్చీ లాగేయటానికి ప్రయత్నించిన తను, ‘ఒకవేళ తననుకున్నది సక్సెస్‌ కాకపోతే, మోడీ తనను ఎలా సాధించటానికి, సతాయించటానికి ప్రయత్నిస్తాడు’ అని కేసీయార్‌ అంచనా వేసుకోలేడా..? వేసుకోలేదా%ౌౌ%? కాకపోతే కొంతకాలం ఈ దోబూచులాట ఉంటుంది. బయట ప్రచారంలో ఉన్నట్టు మోడీ…… కేసీయార్‌, మైహోం, జియ్యర్‌లను ఫిక్స్‌ చేయగలడా..? అంతకుముందు చంద్రబాబును జైలుకు పంపిస్తామని బీరాలు పలికీ పలికీ ఏమీచేయలేకపోయింది మోడీ టీం. ఇక ఎప్పుడూ వంటికి క్వింటాల్‌ ఆముదం పూసుకుని ఉండి, ఏ పరిస్థితి వచ్చినా, ఇట్టే తప్పించుకోగల ఘటనాఘటన సమర్థుడు కేసీయార్‌ ను అంత వీజీగా బుక్‌ చేయగలడా మోడీ. సారీ మన కేసీఆర్‌ ఘఠనాఘట సమర్థుడు.

ముందే చెప్పిన ‘ఆదాబ్‌’:

సీనియర్‌ జర్నలిస్ట్‌ రవిప్రకాష్‌ ‘టివీ9 డీల్‌… 294 కోట్లు ఎక్కడ..?’ అనే విశ్లేషణ కథనం ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ మాత్రమే జూన్‌15, 2019 కథనం అందించింది. ఇదే విషయాన్ని రవిప్రకాష్‌ ఆయుధంగా మల్చుకుంటాడని కూడా చెప్పింది. దీనికి తోడు రవిప్రకాష్‌ టివి9 కలల సామ్రాజ్యం నుంచి అర్థంతరంగా పంపిన వారిని వదలడని కూడా చెప్పింది. ఈ విషయంలో స్థానిక పోలీసుల వైఖరి ఒకవిధంగా ఉండగా… ఐటి శాఖ కోణం మరోలా ఉంది. దీంతో కేంద్రం కనుసన్నల్లో ‘మై హోం’ లింకుల లంకే కదులుతోంది.

ఎన్టీవీ ఎస్కేప్‌:

తుమ్మల నరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నడిచే ఎన్టీవిని కూడా కొలుగోలు చేసినట్లు వార్తలు వినవచ్చాయి. అయితే తీరా ‘డీల్‌’ సమయంలో కొత్త వ్యక్తులు… (అదే టివి9లోగా) ఎంటర్‌ కావడంతో అమ్మకానికి దూరంగా ఉండిపోయిందని తెలిసింది.

చివరిగా….:

ప్రముఖ కవి ప్రసేన్‌ బెల్లంకొండ మాటల్లో…

‘పాత్రికేయులు చాలా బలవంతులలా కనపడతారంతే.

వాళ్ళ బలంలో యాజమాన్యం ఎంత బలప్రదర్షనకు అనుమతిస్తుందో అంతే బలవంతులు…’

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close