స్థానిక పోరుకు ముహూర్తుం

0
  • ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ
  • మే 6,10, 14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు
  • 27న ఓట్ల లెక్కింపు.. అదేరోజు ఫలితాలు
  • 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌
  • తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ
  • రాష్ట్ర వ్యాప్తంగా 32వేల పోలింగ్‌ కేంద్రాలు
  • వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడికి రంగం సిద్ధమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేశారు. మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. మొదటవిడతలో భాగంగా శనివారం షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో ఎన్నికల కోడ్‌ అమలులోకి రానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మండపేట మినహా 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 5857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 40 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. ఇకపోతే మొదటి దశలో197 జెడ్పీటీసీ స్థానాలకు, 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. రెండోదశలో 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు, ఇకపోతే మూడోదశలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు…

హైదరాబాద్‌: స్థానిక సమరానికి నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాప్తంగా 539 జడ్పీటీసీలు ఉండగా మంగపేట జట్పిటీసికి మినహా మిగిలిన 538 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5857 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 47ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక నిర్వహించట్లేదని పేర్కొన్నారు. కాగా మిగిలిన 5817 స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1కోటి 56లక్షల11వేల320 మంది ఓటర్లు ఉన్నారని, ఈరోజు వరకు ఓటు కోసం నమోదు చేసుకున్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఎంపీటీసీలకు రూ.1.50లక్షలు, జడ్పీటీసీలకు రూ.4లక్షలు వ్యయపరిమితిని పెట్టినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీచేసే వారు ఆన్‌ లైన్‌ ద్వారా అప్లికేషన్‌ పెట్టుకోవాలని సూచించారు. మొత్తం 1.47లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది అవసరమవుతారని, 32వేల పోలింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం మూడు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. మొదటి విడత 6, రెండవ విడత 10, మూడవ విడత 14 తేదీల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నామని, మూడు విడతల్లోని ఫలితాలను మే27న విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్‌ పేర్కొన్నారు.

మొదటి విడత..

రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు నాగిరెడ్డి పేర్కొన్నారు. మొదటి విడతలో భాగంగా 197 జడ్పీటీసీలు, 2166 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మే6న మొదటి దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఫస్ట్‌ ఫేజ్‌ ఎన్నికలకు ఈనెల 22 నుంచి 24వరకు నామినేషన్‌ల స్వీకరణ, 25న నామినేషన్‌ల పరిశీలన, 27వరకు ఫిర్యాదుల స్వీకరణ, 28 వరకు నామినేషన్‌ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు.

రెండవ విడత..

రెండవ విడతలో మే10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 180 జడ్పీటీసీ స్థానాలకు, 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 26 నుంచి 28 వరకు నామినేషన్‌లను స్వీకరించనున్నారు. 29న నామినేషన్‌ల పరిశీలన, మే1న ఫిర్యాదుల స్వీకరణ, మే2వరకు నామినేషన్‌ ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 

మూడవ విడతలో..

మూడవ విడతలో మే14న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 161 జడ్పీటీసీలు, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 30 నుంచి మే2వరకు నామినేషన్‌ లస్వీకరణ, మే3న నామినేషన్‌ల పరిశీలన, మే5న ఫిర్యాదుల స్వీకరణ, మే6 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. కాగా మూడు విడతల్లో జరిగిన ఎన్నికలను మే 27న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అదేరోజు ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. కౌంటింగ్‌ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. 

ఎన్నికల వ్యయపరిమితి:

జెడ్పీటీసీ అభ్యర్థులకు గరిష్టంగా రూ.4లక్షలు

ఎంపీటీసీ అభ్యర్థులకు గరిష్టంగా రూ.లక్షా 50వేలు

  • 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
  • తొలి విడత : ఏప్రిల్‌ 22న నోటిఫికేషన్‌, మే 6న పోలింగ్‌
  • రెండో విడత : ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌, మే 10న పోలింగ్‌
  • మూడో విడత : ఏప్రిల్‌ 30న నోటిఫికేషన్‌, మే 14న పోలింగ్‌
  • మే 27న ఫలితాలు
  • ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి కోడ్‌ అమలు, ఆన్‌ లైన్‌ లో నామినేషన్‌
  • మండపేట మినహా 538 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
  • 5వేల 817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
  • పదవీకాలం పూర్తికాని 40 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు లేవు
  • తొలి దశలో 197, రెండో దశలో 180, మూడో దశలో 161 జెడ్పీటీసీలకు ఎన్నికలు
  • బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలోనే స్థానిక ఎన్నికలు
  • జెడ్పీటీసీలకు పింక్‌ పేపర్‌, ఎంపీటీసీలకు వైట్‌ పేపర్‌ కేటాయింపు
  • ఓటర్లు – 1,56,11,320.. పోలింగ్‌ కేంద్రాలు-32,007

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here