బందువర్గాన్ని బంగారంలా తీర్చిదిద్దడమే TRS తెలంగాణ లక్ష్యం

0

తెరాస బంగారు తెలంగాణ లక్ష్యం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మునుగోడులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బినామీలు, బందువర్గం బంగారంలా ఎదుగుతుండడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభాకర్‌ రెడ్డి డిపాజిట్‌ గల్లంతు ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు. బడుగు,బలహీన వర్గాల వారిని ఎదగకుండా అణిచివే స్తూ తిరుపతి వెంకన్నలా ఆస్థులని కూడబెట్టుకుంటున్న ఆయననే మళ్లీ తెరాస అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్త పరిచారు. బంగారు తెలంగాణ అంటే అధికారంలో ఉన్న నాయకులు తమ బందువులను, బినామీలనుబంగారంలా వారి ఆస్థుల ను పెంచడమేనని మునుగోడు నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నిరూపించారని వివిద వర్గాల ప్రజలు వేలెత్తి చూపుతున్నారు.ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ఎన్నిక కాకముందు ఆయన తండ్రిక ఎనమిది ఎకరాల సాదారణ వ్యవసాయ పొలం ఉండేదని, 2015వ సంవత్సరంలో ఎమ్మెల్యే తన మేనకోడలిని జెడ్పీటీసీగా గెలిపించుకుని కోట్లాది రూపాయలను కూడబెట్టుకున్నారని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ కాంట్రాక్టు పనులను తన సామాజిక వర్గానికే దక్కేలా కుట్రపూరితంగా వ్యవహరించి బడుగు బలహీనవర్గాలకు చెందిన కాంట్రాక్టర్లను నిలువునా తొక్కేశాడని వారు ఆవేదన వ్యక్తపరిచారు. అనేక గ్రామాల్లో కాంట్రాక్టర్లుగా జీవితాలని గడుపుతున్న వారిని కాదని అనేక సంవత్సరాల క్రితం వలస వెళ్ళిన తన సామాజిక వర్గాన్ని రప్పించుకుని వారి కుటుంబాలను బంగారంలా తీర్చిదిద్దారని ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. అదేవిదంగా కాంట్రాక్టర్లుగా తయారు చేసిన వారందరూ ఎమ్మెల్యే కూసుకుంట్ల బందు వర్గం తిరుపతి వెంకన్నకు మించి ఆస్థులను కూడ బెట్టడంలో అగ్రభాగాన నిలిచారని వారు విస్మయం వ్యక్త పరిచారు. బంగారు తెలంగాణ అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడు,గూడు,గుడ్డ దొరికేలా తమ బ్రతుకులని మారుస్తాడని నమ్ముకుని కేసీఆర్‌ను గెలిపిస్తే ఆయన తన కుటుంబంతోపాటు ఎమ్మెల్యేలని బినామీలుగా మార్చుకుని ఎదుగుతున్న రీతిలోనే ఆయన అడుగుజాడల్లో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ ఈవిదంగానే ఎదుగు తున్నారా అని వారు అనుమానం వ్యక్త పరిచారు. ఎమ్మెల్యేగా కూసు కుంట్ల ప్రభాకర్‌రెడ్డి తీరుని ఆయన ఆస్థుల పెరుగుదలని గమనిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ విదానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ బంగారు కొండలా తరతరాలు బ్రతికేలా ఆస్థులను పోగు చేసుకుని మరెవ్వరికీ అవకాశం దక్కకుండా అన్ని వర్గాలని అణిచివేశారని వారు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను తెగించి సాధించిన తెలంగాణలో బంగారు తెలంగాణ అంటే సంబర పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ మాయ మాటలకు తలూపి అందలం ఎక్కిస్తే నిజంగా తాను తన వర్గాన్ని బంగారంలా తీర్చిదిద్ది చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆయన అనుచర వర్గాన్ని ఈఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలని వారు పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను,విద్యార్ధి,నిరుద్యోగ,కార్మిక కర్షకులనుదూరం చేసుకుని ఈఎన్నికల్లో ఓట్ల కోసం మళ్ళీ వస్తున్న తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి డిపాజిట్‌ గల్లంతయ్యేలా సరైన గుణపాఠం చెప్పాలని వారు తీర్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని అవినీతి ఎమ్మెల్యేల ధనదాహం కారణంగా లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆకలి,అవమానాలతో తలదించుకుని బ్రతుకుతుండటం బంగారు తెలంగాణలో బాగమేనా అని వారు ప్రశ్నించారు. వందలాది మంది బలిదానాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులు వారి కుటుంబాలు, బందు వర్గాలే బంగారంలా ఎదుగుతున్నాయని వారు తెలిపారు. బంగారు తెలంగాణ లాంటి మాయ మాటలతో ఎవ్వరూ మోసపోవద్దనే తాము మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆగడాలని బహిరంగ పరుస్తున్నామని ఇలాంటి వారు మరెందరో ఉన్నారని పేర్కొంటూ చైతన్యం గల పౌరులు తమ ప్రాంతాల్లో బంగారంలా ఎదుగుతున్న నాయకుల తీరును ఎండగట్టేందుకు ముందడుగు వేయాలని వారు పిలుపునిచ్చారు. మిగతా వచ్చే సంచికలో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here