వాల్మీకితో ముకుంద సుందరి

0

ఇప్పుడు టాప్‌ రేంజ్‌ లో ఉంటూ అందరూ స్టార్‌ హీరోలతోనే చేస్తోంది కానీ కొంచెం ఫ్లాష్‌ బ్యాక్‌ లోకి వెళ్లి డీజే వెనక్కు చూస్తే పూజా హెగ్డే ట్రాక్‌ రికార్డు ఒకప్పుడు చాలా బ్యాడ్‌ గా ఉండేది. బాలీవుడ్‌ లో చేసినవి కలిసిరాక తెలుగులో వచ్చిన అవకాశాలు వర్క్‌ అవుట్‌ కాక కొంతకాలం త్రిశంకు స్వర్గంలో ఉండి పోయింది. డీజే తర్వాత దాని ఫలితంతో సంబంధం లేకుండా పూజా దశ మారిపోయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ మహేష్‌ బాబు అల్లు అర్జున్‌ ప్రభాస్‌ ఇలా వరసగా ఓ రేంజ్‌ ఆఫర్లతో రచ్చ రచ్చ చేస్తోంది. పూజా మొదటి సినిమా ముకుందా. వరుణ్‌ తేజ్‌ ని పరిచయం చేస్తూ శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన ముకుందా కమర్షియల్‌ గా ఆశించిన విజయం సాదించనప్పటికీ లుక్స్‌ పరంగా ఇద్దరూ మంచి జోడి అనిపించుకున్నారు. తర్వాత మళ్ళి ఈ కాంబో సాధ్య పడలేదు. తాజా అప్‌ డేట్‌ ప్రకారం హరీష్‌ శంకర్‌ తీస్తున్న వాల్మీకిలో వరుణ్‌ కోసం పూజాని సెట్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు టాక్‌. పూజా ఒప్పుకునేందుకు ఇక్కడ రెండు కారణాలు చెప్పొచ్చు. ఒకటి తన మొదటి సినిమా హీరో వరుణ్‌ కాబట్టి. తన పెద్ద బ్రేక్‌ ఇచ్సిన డీజే దర్శకుడు హరీష్‌ శంకర్‌ తీస్తున్న మూవీ కాబట్టి. నిజానికి ఈ పాత్ర కోసం కొత్త అమ్మాయిని అనుకున్నారు కానీ రేంజ్‌ పెంచడం కోసమే పూజాను ఆప్షన్‌ గా తీసుకున్నట్టు టాక్‌. మరి హిందీ సినిమాలతో కూడా బిజీగా ఉన్న పూజా వాల్మీకి కోసం డేట్స్‌ ఇస్తుందా లేదా ప్రకటన వచ్చాక క్లారిటీ వస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here