ఎంఎస్ ధోనీనే నా లెజెండ్

చెన్నై : మహేంద్రసింగ్ ధోనీ.. భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు. నేటి తరం యువ క్రికెటర్లు ఎందరికో ఈయన ఆదర్శం. అభిమానులు ముద్దుగా కెప్టెన్ కూల్ అని పిలుచుకునే మహి.. తన లెజెండ్ అని అంటున్నాడు ముంబయి ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్య. ఐపీల్ 12వ సీజన్ క్వాలిఫయర్ 1లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చపాక్ స్టేడియంలో ధోనీతో ఉన్న ఓ ఫొటోను హార్దిక్ పాండ్య ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘నా స్ఫూర్తి, నా స్నేహితుడు, నా సోదరుడు, నా లెజెండ్ ఈయనే.. ఎంఎస్ ధోనీ’ అని పాండ్య ట్వీట్ చేశారు. దీంతో పాటు ధోనీ హెలికాప్టర్ షాట్లను గుర్తుచేస్తూ హెలికాప్టర్ ఇమోజీని పెట్టారు. మంగళవారం జరిగిన క్వాలిఫయర్ 1లో చెన్నైపై ముంబయి ఘన విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. బ్యాటింగ్లో తడబడిన చెన్నై సొంత మైదానంలో ఆశించిన మేర రాణించలేకపోయింది. నేడు దిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుతో చెన్నై శుక్రవారం క్వాలిఫయర్ 2 ఆడనుంది. అందులో గెలిస్తే ఫైనల్కు దూసుకెళ్తుం