‘ఎంపీ’ కసరత్తులు

0

? తెరాస జాబితా దాదాపు పూర్తి

? కొలిక్కి రాని కాంగ్రెస్‌ లిస్ట్‌

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రాష్ట్ర రాజధానిలో తెరాస, దేశ రాజధానిలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం అర్థరాత్రి వరకు కసరత్తులు చేశాయి.

1బబి ఃనీలీ

తెరాస కసరత్తు

? టికెట్లు ఎవరికీ దక్కుతాయనే అంశంపై శ్రేణుల్లో ఉత్కంఠ

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో తెరాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్‌ కీలకపాత్ర వహిస్తున్నారు. కరీంనగర్లో సన్నాహాక సమావేశం పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 17 తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని తెరాస భావిస్తోంది. గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల ఖరారు కోసం కసరత్తు చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీలు, నియోజకవర్గాల్లో తెరాస, ఇతర పార్టీల పరిస్థితులపై సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుని విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో హైదరాబాద్‌ మినహా 16 స్థానాల్లో చోట్ల ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో తెరాస కార్యచరణ చేపట్టింది. కొన్ని చోట్ల సిట్టింగ్‌ ఎంపీలను మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.సికింద్రాబాద్లో భాజపా నేత బండారు దత్తాత్రేయ, నాగర్‌ కర్నూలు, చేవెళ్లలో కాంగ్రెస్‌ నేతలు నంది ఎల్లయ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలుగా ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మిగతా 11 చోట్ల సిట్టింగ్‌ ఎంపీలు మళ్లీ టికెట్లు ఆశిస్తున్నారు. కరీంనగర్లో వినోద్‌ కుమార్‌, నిజామాబాద్‌ లో కవిత తిరిగి పోటీ చేయడం ఖాయమైనట్లే.ఇక మిగిలిన 9 స్థానాలపై కసరత్తు జరుగుతోంది. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, జహీరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. నల్గొండ సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాష్ట్రమంత్రి వర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. అధిష్ఠానం కూడా సుముఖంగా ఉందనే ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకునే ఆలోచన ఉంటే నల్గొండ నుంచి 2014లో పోటీ చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి లేదా మరో నాయకుడి బరిలోకి అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో ఇటీవల స్థానిక ఎన్నికల సందర్భంగా స్థానిక నాయకులు వ్యవహరించిన తీరుపై కేసీఆర్‌, కేటీఆర్‌ అసంతృప్తితో ఉన్నారు. ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు తుమ్మల నాగేశ్వరరావు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఐదేళ్ల పనితీరు, వివిధ సవిూకరణాలు, తాజా రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని చోట్ల మార్పులు జరగవచ్చని పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి. మెదక్‌ నుంచి ప్రభాకర్‌ రెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌ కు అధిష్ఠానం సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ వివిధ కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ నుంచి పసునూరితో పాటు కడియం శ్రీహరి, గుడిమల్ల రవికుమార్‌,మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ తోపాటు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కుమార్తె మాలోత్‌ కవిత రేసులో ఉన్నారు. పెద్దపల్లి నుంచి వివేక్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. చేవెళ్ల నుంచి మాజీ మంత్రి మహేందర్రెడ్డి, స్వామిగౌడ్‌ తోపాటు కాంగ్రెస్‌ నుంచి చేరే అవకాశం ఉన్న నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నాగర్కర్నూలు నుంచి మందా జగన్నాథం తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్‌ నుంచి తన కుమారుడు సాయికి టికెట్‌ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరుతున్నారు. మల్కాజ్గిరి నుంచి ఐదారు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

2నిట ఃూచీ

కాంగ్రెస్‌ కసరత్తు

? జాబితాను కార్యకర్తల అభిప్రాయ సేకరణకు పంపిన టీపీసీసీ

రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌… తెరాస ప్రభంజనంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏ జిల్లాలోనూ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయినా ఖమ్మం జిల్లాలో మాత్రం హస్తం, సైకిల్‌ జత కారు వేగాన్ని అదుపు చేయగలిగాయి. పది అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో ఎనిమిది కూటమి అభ్యర్థులు విజయం సాధించగా, ఒక చోట తెరాస, మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్‌ నుంచి శాసనసభకు వెళ్లిన వారిలో ఆరుగురు ఈ జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఈ పరిణామమే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానంపై ఆసక్తిని రేపుతోంది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు కార్యాచరణ చేపట్టిన టీపీసీసీ బలమైన అభ్యర్థులను లోక్సభ స్థానాల్లో నిలిపేందుకు అన్వేషణ సాగిస్తోంది. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరగా.. ఖమ్మం స్థానం బరిలో నిలిచేందుకు 17 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదుగురు కూటమి ఎమ్మెల్యేలే ఉండడంతో ఇతర జిల్లాలకు చెందిన నేతలు సైతం ఈ స్థానం నుంచి పోటీకి సై అంటుతున్నారు.

ఈ స్థానం నుంచి బరిలో నిలిచేందుకు 17 మంది ఆసక్తిగా ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేతలతో సమాలోచనలు జరిపిన అధిష్ఠానం.. ఐదుగురు అభ్యర్థులతో జాబితా రూపొందించి అభ్యర్థి ఎంపికకు కార్యకర్తల అభిప్రాయ సేకరణకు పంపింది. వీరిలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి ముందుంది. ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారి మద్దిరాజు రవిచంద్ర సీనియర్‌ నాయకులు పోట్లా నాగేశ్వరరావు, పొంగులేటి సుధాకర్రెడ్డి, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్‌ తోపాటు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఈ విషయంపై జిల్లా నేతల అభిప్రాయం కోరగా, జాబితాలోని ఎవరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు నాన్చుడు ధోరణితో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించినందునే నష్టం జరిగిందని.. ఎంపీ అభ్యర్థులను వీలైనంత త్వరగా ప్రకటించి ప్రజల్లోకి వెళితేనే బాగుంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here