ఫెడరల్‌ ఫ్రంట్‌పై మళ్లీ కదలిక

0

  • ఫలితాలకు ముందే కేసీఆర్‌ వ్యూహాలు
  • కేరళ సిఎం పినరయ్‌ విజయన్‌తో సమావేశం
  • ప్రాదేశిక ఓటు హక్కు వినియోగించుకోలేక పొయిన కేసీఆర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయాలను సీఎం కేసీఆర్‌ మరోసారి వేగవంతం చేశారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశలో ఆయన అడుగులు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వస్తున్నవేళ టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి దేశ రాజకీయాలపై దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ను ముందుకు తెచ్చిన కేసీఆర్‌ ఆ దిశగా మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో మమతాబెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, కుమారస్వామి, దేవెగౌడ, అఖిలేష్‌ యాదవ్‌ తదితరులను కలిసి చర్చలు జరిపిన కేసీఆర్‌ ఇప్పుడు కేరళ, తమిళనాడు టూర్‌ చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి దక్షిణాది రాష్ట్రాల టూర్‌ చేపట్టారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యమంటోన్న కేసీఆర్‌, మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా రెండు దశలు మాత్రమే మిగిలి ఉండటంతో, ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయాలను వేగవంతం చేశారు. గతంలో ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌, బెంగాల్‌ ముఖ?యమంత్రి మమతాబెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామిని కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించిన కేసీఆర్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌తోనూ సంప్రందింపులు జరిపారు. ఇప్పుడు మరోసారి ఫ్రంట్‌ రాజకీయాలను స్పీడప్‌ చేసిన కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లి, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తీరు, ఫలితాల సరళి ఎలా ఉండబోతోంది, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆవశ్యకత, భాజపా, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలు ఏకమయ్యేందుకు నిర్వహించాల్సిన పాత్ర తదితర అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో కేసీఆర్‌ వెంట ఎంపీలు వినోద్‌, సంతోష్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. ఈ నెల 13న సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశమవుతారు. దేశ రాజకీయాలపైనా, ఎన్నికల అనంతరం తలెత్తే రాజకీయ పరిణామాలపైనా ఇద్దరూ చర్చించనున్నారు. తన రాజకీయ వ్యూహంలో భాగంగా కేరళ, తమిళనాడు పర్యటనలో భాగంగా కేరళకు బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌ పోర్టులో ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లారు. త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించుకోనున్నారు. అయితే సిఎం కెసిఆర్‌ ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించు కోకుండానే కేరళకు వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం పోలింగ్‌ జరిగింది. ఇందులో భాగంగా కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకలో కూడా మొదటి దశలోనే పోలింగ్‌ జరుగుతోంది. ముఖ్యమంత్రి చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయకుండానే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసేందుకు కేరళ వెళ్లారు. ఈ ఎన్నికల్లో నారాయణరావుపేట మండలం నుంచి జెడ్పీటీసీ, చింతమడక నుంచి ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులూ పోటీలో ఉన్నారు. బేగంపేట విమానాశ్రమం నుంచి కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో కేరళ బయలుదేరి వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌తో తిరువనంతపురంలో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ స్థితిగతులపై వారిద్దరూ చర్చిస్తారని తెలంగాణ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కేసీఆర్‌ సందర్శిస్తారని సీఎంవో వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here