పీఎం కంటే సీఎం అయినప్పుడే.. అమ్మ ఎక్కువ సంతోషించింది

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తాను గుజరాత్‌ ముఖ్యమంత్రి అయినప్పుడే తన తల్లి ఎక్కువగా ఆనందపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే అనే ఫేస్‌బుక్‌ పేజీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా.. గుజరాత్‌ సీఎంగా ప్రమాణస్వీకారానికి ముందు రోజు తన తల్లితో గడిపిన క్షణాలను మోదీ గుర్తుచేసుకున్నారు. విూరు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు విూ అమ్మగారు ఎలా ఫీలయ్యారు అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. ప్రధానిగా నా పేరు బయటకొచ్చినప్పుడు దేశ వ్యాప్తంగా నా ఫొటోలను ప్రచురించారు. చాలా మంది ఆనందం వ్యక్తంచేశారు. కానీ నేను ప్రధాని అయినప్పటి కంటే గుజరాత్‌కు సీఎం అయినప్పుడే మా అమ్మ ఎక్కువగా ఆనందించారని మోదీ చెప్పుకొచ్చారు. గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నేను ఢిల్లీలో ఉండేవాణ్ణి అని, సీఎంగా పేరు ప్రకటించాక నేను అమ్మను కలిసేందుకు నేరుగా అహ్మదాబాద్‌ వెళ్లానన్నారు. అప్పటికే నేను ముఖ్యమంత్రిని అవుతున్నానన్న విషయం ఆమెకు తెలుసని, ఇంటికి వెళ్లేసరికి అక్కడంతా సందడి వాతావరణం నెలకొందని మోదీ గుర్తు చేసుకున్నారు. నన్ను చూడగానే మా అమ్మ ఆనందంతో కౌగలించుకుని.. ‘నువ్వు మళ్లీ గుజరాత్‌కు వచ్చేశావు.. అదే నాకు గొప్ప విషయమని చెప్పారని మోదీ తెలిపారు. తల్లి మనసంటే అదేనేమో.. తన చుట్టూ ఏం జరుగుతున్నా సరే.. తన పిల్లలకు దగ్గరగా ఉండాలనే ప్రతి తల్లీ కోరుకుంటుందని మోదీ అన్నారు. ఆ తర్వాత మా అమ్మ నాకో మాట చెప్పారని.. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. కానీ జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోనని నాకు మాటివ్వు.. ఆ పాపాన్ని నువ్వు ఎన్నడూ చేయకుఅని అన్నారని తెలిపారు. ఆ మాటలు నాపై ఎంతో ప్రభావం చూపాయని, ప్రధాని అయిన తర్వాత కూడా నేను ఆ విలువలను పాటిస్తున్నానని, ప్రధాని అయినా సీఎం అయినా దేశం పట్ల నిజాయతీగా ఉండాలనే అమ్మ ఆకాంక్షిస్తారని మోదీ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here