మోడీ ప్రభుత్వం విఫలం..

0

  • ఐదేళ్లలో అంతర్గత భద్రత క్షీణించింది
  • ‘న్యాయ్‌’ పథకం గొప్ప ఆలోచన
  • మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నేత మన్మోహన్‌ సిరగ్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఐదేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దేశ భద్రత విషయంలో రాజీపడడం సరికాదని, జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. దేశ వ్యతిరేక శక్తులపై నిఘా, జాతీయ భద్రత విషయంలో విఫలమయ్యారని, గత ఐదేళ్లుగా పాకిస్థాన్‌ ఆధారిత ఉగ్రవాద సంస్థలు భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యం చేసుకుని దాడులు జరుపుతున్నాయని మన్మోహన్‌ పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ వద్ద ఉగ్రదాడి జరిగినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అతి పెద్ద తప్పు చేసిందని పేర్కొన్నారు. పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ.. పఠాన్‌కోట్‌కు వచ్చి విచారణ జరపడానికి అనుమతిచ్చిందన్నారు. ఈ ఐదేళ్లలో జమ్ముకశ్మీర్‌లో అంతర్గత భద్రత క్షీణించిందని దేశ భద్రత విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. యూపీఏ ప్రభుత్వం దేశ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకుంటూ వచ్చిందని, అయితే, ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వృద్ధి బలహీనపడిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని సరళీకరించాలనుకుంటోందని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించిన న్యాయ్‌ పథకం ఓ గొప్ప ఆలోచన అన్నారు. ఈ పథకం.. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడమే కాకుండా, మళ్లీ మన ఆర్థిక స్థితి మెరుగుపడేలా చేస్తుందన్నారు. ఈ పథకం గురించి ఇప్పుడు దేశ ప్రజలందరూ చర్చించుకుంటున్నారని మన్మోహన్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here