Featuredజాతీయ వార్తలు

భద్రతపై మోడీ అత్యవసర భేటీ

భద్రతా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు బుధవారం ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు. పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జెట్‌లు భారత గగనతలంలోకి అడుగుపెట్టడంపై వీరు భేటీ అయ్యారు. నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ అజిత్‌ దోవల్‌, ఇండియన్‌ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీనియర్‌ అధికారులు, ఇతర భద్రతా బలగాల ఉన్నతాధికారులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. నా పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌. నేను ఐఏఎఫ్‌ అధికారిని. నా సర్వీస్‌ నంబర్‌ 27981′ పాకిస్థాన్‌ ఆర్మీ విడుదల చేసిన వీడియో ఒక పైలట్‌ ఈ విధంగా చెప్తున్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు పైలట్లను అరెస్టు చేసినట్లు పాకిస్థాన్‌ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇద్దరు పైలట్లలో ఒకరికి

గాయాలు కాగా ఆస్పత్రికి తరలించామని, మరొకరు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. రాజౌరి, పూంచ్‌ జిల్లాల్లోని ఎల్‌ఓసీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాక్‌ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడమే కాకుండా ఎల్‌ఓసీ వెంబడి భారీ పేలుడు పదార్థాలను పడేసిన నేపథ్యంలో సరిహద్దు వెంబడి భారత్‌ హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ జెట్‌ను పాక్‌ కూల్చివేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఎయిర్‌స్పేస్‌ భద్రతా కారణాల దష్ట్యా అమత్‌సర్‌ ఎయిర్‌పోర్టును మూసివేశాం. ఏ వాణిజ్య విమానాలు అమత్‌సర్‌ రావడంలేదు. అలాగే ఇక్కడి నుంచి ఒక్క విమానం కూడా టేకాఫ్‌ తీసుకోద ఏపీ ఆచార్య, అమ త్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు. ఎయిర్‌ స్పేస్‌ను మూసివేసిన కారణంగా శ్రీనగర్‌, జమ్ము, ఛండీగఢ్‌, అమత్‌సర్‌, డెహ్రాడూన్‌ విమానాలను తాత్కాలికంగా రద్దుచేసినట్లు భారత విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది.

కార్యక్రమం మధ్యలోనే బయటికి వచ్చేసిన మోదీ, భద్రతపై రివ్యూ మీటింగ్‌కు హాజరు విజ్ఞాన్‌ భవన్‌లో జరగుతోన్న నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ 2019 వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విద్యార్థులు అడుగుతోన్న ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెబుతున్నారు. అయితే ప్రధాన మంత్రి కార్యాలయానికి అధికారి ఒకరు ఓ చిన్న పేపర్‌ను మోదీకి ఇచ్చారు. దానిలో సమాచారం చదివిన వెంటనే ఆ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా మోదీ బయటికి వచ్చేశారు. అక్కడి నుంచి బయలుదేరి భద్రతపై నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారత ఎయిర్‌ స్పేస్‌లోకి పాకిస్థాన్‌ అడుగుపెట్టడంపై ఈ రివ్యూ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌, పాకిస్థాన్‌ ఎయిర్‌ స్పేస్‌ ద్వారా ప్రయాణించే అంతర్జాతీయ విమానాలకు ముప్పు పొంచిఉంది. దీంతో కొన్ని విమానాలను వెనక్కి పంపారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. లాహోర్‌, ముల్తాన్‌, ఫైసలాబాద్‌, సెయిల్‌కోట్‌, ఇస్లామాబాద్‌ ఎయిర్‌పోర్టుల నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు తక్షణమే నిలిపివేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్‌ ఎయిర్‌ స్పేస్‌ నుంచి ఎల్‌ఓసీ వెంబడి ఆ దేశ ఎయిర్‌ ఫోర్స్‌ దాడులు చేస్తున్నట్లు పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్‌ ఫైసల్‌ వెల్లడించారు. తమ హక్కులను కాపాడుకోవడానికి, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పడానికి ఈ దాడులు చేస్తున్నామన్నారు. ఈ సమస్యను పెద్దది చేయాలని తాము భావించట్లేదని, కానీ తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ చర్య అని చెప్పారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఏ, రా చీఫ్‌, హోం సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం భారత ఎయిర్‌ స్పేస్‌లో ప్రవేశించింది. నౌసెరా సెక్టార్‌లోని లామ్‌ వ్యాలీకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాన్ని భారత్‌ కూల్చివేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close