సహకార ఫెడరలిజానికి మోడీ’కారం’

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

రాష్ట్రాల పరిస్థితులు దిగజారుతున్నాయని, చిన్న విషయాలను కూడా కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంటోందని చాలా పార్టీలు అభిప్రాయపడుతున్నాయని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడిగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు.. రాష్ట్రాల అధికారాలను దెబ్బతీస్తున్నాయని, మోదీ సహకార ఫెడరలిజం అని ప్రచారం చేశారని, ఆచరణలో ఎక్కడా అది అమలు జరగలేదని విమర్శించారు. దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయం విధానాలు అవసరమని, రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. అనేక దేశాలు రైతులకు పూర్తిగా సహకరిస్తున్నాయని, మన దేశంలో అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ మన వ్యవసాయం ముందుకు సాగడం లేదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇవన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌, బీజేపీ పద్ధతులు పోవాలని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని, వాటిని ఖతం చేసి దేశానికి కొత్త ట్రెండ్‌ చూపించాలని, ఆ ప్రయత్నం తాను చేస్తానని చెబుతున్నానని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావిూలను నూటికి నూరు శాతం అమలు చేసిన ప్రభుత్వం తమదేనని, మేనిఫెస్టోలో లేని అంశాలు కూడా అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా.. ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని ఆయన సవాల్‌ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన చెప్పారు. బీడీ కార్మికుల పెన్షన్‌ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ.. తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్‌ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్‌ తెలిపారు.

ఆ పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి..

తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్‌ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని ఆయన అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని ఆయన చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల్లో తాము చెప్పని కార్యక్రమాలు కూడా చేశామని కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు టాక్స్‌ రద్దు చేశామని, భూరికార్డుల ప్రక్షాళన చేశామని, 4 వేల మంది కుటుంబాలకు రైతు భీమా వచ్చిందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఎలాంటి పైరవీ లేకుండా వారి ఖాతాల్లో రూ.5 లక్షలు జమచేశామని ఆయన అన్నారు. 25 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గోడౌన్లు నిర్మించామని, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు తీసుకొచ్చామని కేసీఆర్‌ పేర్కొన్నారు. తాము 106 స్థానాల్లో గెలుస్తామని అనుకున్నామని, కానీ కొన్ని జిల్లాల్లో పొరపాట్ల వల్ల దెబ్బతిన్నామని కేసీఆర్‌ అన్నారు.

తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తాం ..

తమకన్నా ముందు రాష్ట్రాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు యువతకు ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్‌ సమాధానమిస్తూ.. గత ప్రభుత్వాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. రాష్ట్రాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు యువతకు ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాయన్నారు. ఇప్పటి వరకు కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. యువతను ఆశలపల్లికిలో తిప్పి పబ్బం గడుపుకున్నారన్నారు. ఇంకా ఎంత కాలం మోసం చేస్తారని దుయ్యబట్టారు. అసలు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత? ప్రైవేటులో చేసేవారి సంఖ్య ఎంత? ప్రభుత్వంలో చేసేవారు 3లక్షల అయితే.. ప్రైవేటులో 30 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 1 శాతం కంటే తక్కువేనని తెలిపారు. వాస్తవాన్ని గుర్తించి ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వంలో అవసరమైన ఖాళీలను తక్షణం భర్తీచేస్తూనే ప్రైవేటు రంగంలో విస్తృత ఉపాధి అవకాశాల కల్పనకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అవసరమైన ఖాళీలను గుర్తించినట్లు వాటిలో చాలావాటికి అనుమతి కూడా తెలిపినట్లు.. ఎటువంటి ఆలస్యం లేకుండా భర్తీ పక్రియను చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. నిరుద్యోగ భృతిని అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు.

త్వరలోనే పంచాయతీ ఎన్నికలు..

ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రెండు దశలుగా ఉంటుందని, అర్జెన్సీ వల్ల ముందుగా తనతో పాటు మరొకరు ప్రమాణస్వీకారం చేస్తారని కేసీఆర్‌ వెల్లడించారు. ఐదారు రోజుల్లో మిగిలిన వారు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. కొత్త మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు అవకాశముంటుందని స్పష్టం చేశారు. మంత్రి వర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్‌ ప్రకటించారు. వారం రోజుల్లో పంచాయతీ రాజ్‌ ఎన్నికలపై నోట్గి/ చేస్తామని, ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పును అమలు చేయాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు ఆదేశించినట్టు చెప్పారు. వందరోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలివ్వడంతో, ప్రభుత్వం ఏర్పడటం తప్పనిసరి అని, అందుకే, తనతో పాటు మరొకరు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.

వందశాతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తా..

తాను చంద్రబాబుకు రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తానని, వందశాతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని తనను అక్కడి వారు చాలా మంది కోరుతున్నారని కేసీఆర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ¬దాపై ఎలా స్పందిస్తాని విలేకరులు ప్రశ్నించగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ¬దాపై అక్కడి సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని అన్నారు. ¬దా వల్ల ఏం చేస్తామని, అది పెద్ద బ్రహ్మాస్త్రమా అంటూ చంద్రబాబే మూర్ఖంగా మాట్లాడారని కేసీఆర్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here