హిందీలో మోదీ బయోపిక్‌ ఖరారు!

0

ముంబయి: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బాలీవుడ్లో ఓ బయోపిక్‌ తెరకెక్క బోతోంది. ఈ బయోపిక్కు ‘పీఎం నరేంద్రమోదీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రీల్‌ లైఫ్‌ మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ను ఎంపికచేసుకున్నారు. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. 7న ఈ చిత్ర ఫస్ట్లుక్‌ పోస్టర్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 15 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాజకీయ నేతల జీవితాధారంగా బయోపిక్లు వరసకడుతున్నాయి. అలనాటి నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘యన్టిఆర్‌’ బయోపిక్‌ విడుదలకు సిద్ధమైంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ జీవితాధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం త్వరలో విడుదల కానుంది. మరోపక్క దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా ‘ది ఐరన్‌ లేడీ’ అనే బయోపిక్‌ తెరకెక్కుతోంది. బాలీవుడ్లో ‘మేరీ కోమ్‌’, ‘సరబ్జీత్‌’ లాంటి అద్భుతమైన బయోపిక్లను తెరకెక్కించిన ఒమంగ్‌ కుమార్‌ మోదీ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here