Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

రష్యాలో మోదీ పర్యటనలు

వ్లాదివొస్టోక్‌ అధ్యక్షుడు పుతిన్‌తో ఒప్పందాలు

  • సముద్రపు తీరాన్ని ఏర్పాటుకై ప్రతిపాదనలు
  • సైబీరియా పక్షులే మన దేశాలను కలిపాయి : మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. వ్లాదివొస్టోక్‌లో బుధవారం ఆయన ఆదేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తనకు ఆహ్వానం పంపినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటనకు గాను ఆయన బుధవారం రష్యాకు చేరుకున్నారు. ఈస్టర్న్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యేందుకు వ్లాదివోస్తోక్‌ కు చేరుకున్న ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సాదరంగా స్వాగతం పలికారు. 2001లో జరిగిన వార్షిక సమావేశాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. అప్పటి ప్రధాని అటల్‌జీ బృందంలో గుజరాత్‌ సీఎంగా తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. రష్యా, భారత్‌ మధ్య స్నేహబంధం రోజు రోజుకూ బలపడుతోందని మోదీ అన్నారు. చెన్నై నుంచి వ్లాదివొస్టోక్‌ మధ్య పూర్తి స్థాయి సముద్ర మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు మోదీ అన్నారు. అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల ప్రమేయాన్ని ఇరు దేశాలు వ్యతిరేకిస్తున్నట్లు మోదీ తెలిపారు. అంతకముందు జ్వెజ్‌దా షిప్‌యార్డును మోదీ సందర్శించారు. ఈ షిప్‌యార్డుతో ఆర్కిటిక్‌ షిప్పింగ్‌ అభివృద్ధి చెందుతుందని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నౌకాశ్రయంలో ఉన్న అద్భుత టెక్నాలజీని పుతిన్‌ తనకు చూపించినట్లు ఆయన చెప్పారు.

సైబీరియా పక్షులే మన దేశాలను కలిపాయి : మోదీ

భారత-రష్యా దేశాలను సైబీరియా పక్షులే కలిపాయని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఉదాహరణకు ప్రతి డిసెంబరులో సైబీరియా పక్షులు ఎంతో దూరం నుంచి మా గుజరాత్‌ రాష్ట్రానికి వస్తాయని, అంటే ప్రకృతి మన దేశాలను ఇలా కలిపిందని పేర్కొన్నారు. ఇది ఓ టూరిస్టు డెస్టినేషన్‌ అని అభివర్ణించారు. భారతీయులు కూడా రష్యాలోని సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారని. ఇక్కడి సంస్కృతిలో మమేకమవుతుంటారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. సైనిక పరికరాలను తక్కువ ధరలకు ఉత్పత్తి చేయడానికి ఇండియా పూనుకొన్నదని తెలిపారు. భారత్‌ తో బాటు రష్యా కూడా ఇందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇండియాలో అతి తక్కువ ధరలకు ఈ పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని ఇవే ధరలకు తృతీయ ప్రపంచ దేశాలకు అమ్మాల్సి ఉంది. ఈ అవకాశాన్ని రెండు దేశాలూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వ్లాదివొస్తోవ్‌ లో జరిగే 5 వ ఈస్టర్న్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సుతో బాటు 20 వ ఇండియా-రష్యా వార్షిక సమావేశంలో కూడా మోదీ పుతిన్‌ తో బాటు పాల్గొననున్నారు. కాగా-ఈ పర్యటనలో మోదీ.. భారత-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉద్దేశించిన వివిధ ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. అటు- జ్వేజ్దా షిప్‌ బిల్డింగ్‌ చేరుకునేందుకు ఉభయ నేతలూ షిప్‌ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. ఉగ్రవాదం ఏరివేతకు కలిసి కట్టుగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మోదీకి గేట్స్‌ ఫౌండేషన్‌ అవార్డు

ప్రధాని మోదీని మరో అంతర్జాతీయ అవార్డు వరించింది. అమెరికాకు చెందిన బిల్‌, మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ ఆయనకు గ్లోబల్‌ గోల్‌కీపర్‌ పురస్కారం ప్రదానం చేయనున్నది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం కోసం మోదీ చేసిన కృషికిగాను ఈ అవార్డుతో సత్కరించనున్నది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 24న న్యూయార్క్‌లో గేట్స్‌ ఫౌండేషన్‌ నిర్వహించనున్న గోల్‌కీపర్స్‌ గ్లోబల్‌ గోల్స్‌ అవార్డ్స్‌ నాల్గవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. సార్వత్రిక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 2014 అక్టోబర్‌ 2న జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌ 2న గాంధీజీ 150వ జయంతికి నివాళిగా స్వచ్ఛ భారత్‌తోపాటు బహిరంగ మలవిసర్జనను సంపూర్ణంగా నివారించే పలు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఇం దులో భాగంగా దేశంలోని 98శాతం గ్రామా ల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close