కాంగ్రెస్‌, టీఆరెఎస్‌ ప్రెండ్లీ మ్యాచ్‌..

0

(నిజామాబాద్‌ ప్రతినిధి – ఆదాబ్‌ హైదరాబాద్‌)

మంగళవారము నిజామాబాద్‌ నగరంలోని ఎన్నికల సభలో మోడీ ప్రసంగించారు. ఆయన మాటల్లోనే…. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడ వెళ్లినా ప్రజల నుంచి బిజెపి పట్ల ఉత్సాహం కనబరుస్తున్నరు. ప్రజల బలిదానాలతో ఏర్పడ్డది తెలంగాణ, తెలంగాణ ప్రజల త్యాగాన్ని దష్టిలో ఉంచు కోకుండా ఏ రాజకీయ పార్టీ ఇక్కడ పరిపాలన కొనసా గించడం ఆమోదయోగ్యం కాదు, కాకూడదు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం తొలిసారి ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ భారీ బహిరం గసభలో ప్రసంగించారు. ఇందూరుకు చెందిన ఎవరెస్ట్‌ అధిరోహిం చిన మాలావత్‌ పూర్ణ, కామాన్‌ వెల్త్‌ క్రీడల్లో పతకాలు సాధించిన హుసముద్దిన్‌లకు నా అభినం దనలు. జిల్లా రాష్రమే కాకుండా వీరిద్దరు భారత దేశ ప్రతిష్ఠను గౌరవాన్ని పెంచారని, నిజామాబాద్‌ గడ్డకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.

నాలుగున్నర సంవత్సరాలలో టిఅరెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ప్రజలకిచ్చిన హామీలు నేరవేర్చని టిఅరెస్‌ కు ప్రజలు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ ప్రజలకు ఏం చేయకున్నా గెలిచామన్న అభిప్రాయంతో కెసిఅర్‌ కూడా ముందుకు సాగుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి గతంలో లాగా లేదు. 50 సంవత్సరాలు కాదు 50 నెలలు ప్రజాపాలన కొనసాగించకుంటే కూడా ప్రజలు గుణపాఠం చెబుతారు. నిజామాబాదు ను లండన్‌ చేస్తానని సిఎం చెప్పారు. రోడ్లు తాగునీరు వంటి మౌళిక సదుపాయాలు కూడా లేనివిదంగా చేశారు. నిజామాబద్‌ లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి నిర్మాణం జరుగుతున్నదా. నగరాన్ని నష్టం జరిగే విదంగా చేస్తున్నారా అనిపిస్తుంది. కేసిఅర్‌ పని అంతా సగం సగమే. వాగ్ధానాలు అమలులో సగం. పరిపాలన కూడా మద్యలోనే నిలిపివేసి ముందస్తుకు వెళ్ళారు. ముందస్తుకు వెళ్ళడం వల్ల ముందుగానే కెసిఅర్‌ పాలన నుంచి విముక్తి లభించింది. ఇందుకు ప్రజలు సంతోషించాలి. ఇంటింటికి నీరిచ్చాకే ఓట్లు అడుగుతామని చెప్పి ఇవ్వకుండానే మళ్లీ ఓట్లకోసం వచ్చారు. తాగునీరివ్వని ముఖ్యమంత్రి కి ప్రజలు వీడ్కోలు చెప్పాల్సిందే. ప్రజల కోసం ప్రభుత్వం ఉంటుంది. కానీ టిఅరెస్‌ ప్రభుత్వం అలా వ్యవహరించలేదు. నిజామాబాదు లో ఉన్న వైద్య కళాశాల కన్నా మాములు గ్రామ ఆసుపత్రి బాగుంటుంది. కేసిఅర్‌ అభద్రతా భావం తో ఉన్నారు. ఆయనకు జాతకాల మీద పూజల మీదనే విశ్వాసం ఉంది. ఆయుష్మాన్‌ భవ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవల కోసం కార్యక్రమం తీసుకు వస్తే దానిని తెలంగాణ లో అమలు చేయకుండా పేద ప్రజల కు అన్యాయం చేశారు. ఈ పథకం మూడు లక్షల మంది లబ్ది పొందితే అందులో ఒక్క తెలంగాణ వ్యక్తి లేరు. అందుకు కారకుడు కేసిఆర్‌. సబ్కా సాథ్‌ సబ్కా వికాస్‌ బిజెపి లక్ష్యం. ఓటు బ్యాంకు రాజకీయాలతో కుటుంబ పాలనతో గత పాలకులు అభివ ద్ధిని విస్మరించారు. పంచతత్వ విధానముతో దేశాన్ని ప్రగతి పథంలో బిజెపి ముందుకు తీసుకెల్తుంది. నినాదాలతో హోరెత్తిస్తున్న మీ అందరికి నా నమస్సులు. సోనియా రిమోట్‌ తో నడిచిన యుపియే ప్రభుత్వం లో కేసిఅర్‌ మంత్రిగా పనిచేశారు. అలాంటి యుపియె ప్రభుత్వ ఉప్పు తిన్న కెసిఆర్‌ కు కాంగ్రెస్‌ శత్రువు కాదు. ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేకి అంటే నమ్మకండి. వారిది ఫ్రెండ్లీ మ్యాచ్‌. తల్లి సోనియా కూర్చున్న సభలో రాహుల్‌ మాట్లాడుతూ కెసిఅర్‌ కుటుంబ పాలన గురించి మాట్లడడం హాస్యాస్పదం. టిఅరెస్‌ కాంగ్రెస్‌ పార్టీ లు రెండూ కుటుంబ పార్టీలే. రెండు పార్టీ లలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఈ రెండు పార్టీలు అబద్దాలు చెప్పడం లో పోటీ పడుతున్నాయి. నాలుగేళ్లలో అభివ ద్ధి ఎలా ఉంటుందో బిజెపి చేసి చూపింది. కాంగ్రెస్‌ హయాంలో వంటగ్యాస్‌ కనెక్షన్ల కటకట ఉండేది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు గ్యాస్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా దొరుకుతుంది. ఇప్పుడు గ్యాస్‌ బ్లాక్‌ దందా లేదు. నాకు పేదరికం తెలుసు. కట్టెల పొయ్యి మీద మా అమ్మ పడ్డ కష్టాలు నేను చూశా. తెలంగాణలో ఐదు లక్షలు ఉజ్వల కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్‌ కనెక్షన్‌ లు ఇచ్చాము. సౌభాగ్య యోజన ద్వారా తెలంగాణాలొ నాలుగు లక్షల విద్యుత్‌ కనెక్షన్‌ లు నిజామాబాదు లో పదిహేను వేల కనెక్షన్‌ లు ఇచ్చాము. ఎన్నికలలో హామీ ఇచ్చాను ఈ దేశాన్ని దోచుకోనివ్వనని, పించన్లు తదితర ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలలో వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాధనం దళారుల పాలు కాకుండా చూశాము. ఆరు కోట్ల నకిలీలను తొలగించి 90 వేల కోట్లు ప్రజాధనాన్ని కాపాడగలిగాం .బ్యాంకులను అప్పుల పేరిట పెద్దలు దోచుకునే విధానాన్ని అరికట్టాం. 2014 వరకు టెలిఫొన్‌ బ్యాంకింగ్‌ జరిగేది. ఫోన్‌ చేయగానే పెద్దలకు రుణమందే విధానాన్ని అడ్డుకున్నాం, బ్యాంకుల ను లూటీ చేసిన వారివద్దనుంచి 40 ,50 వేల కోట్లు స్వాదీనం చేసుకున్నాం. బ్యాంకుల లూటీ చేసి బయటి దేశాల కు పారిపోయిన వారిని కూడా వదిలిపెట్టం. తెలంగాణ కోసం పోరాడిన వారిని తూటాలకు బలి చేసిన కాంగ్రెస్‌ కు మళ్ళీ అవకాశం ఇస్థారా.? కెసిఆర్‌ కు శిక్షణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. కెసిఅర్‌ కు అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ కంటే వంద శాతం తెలంగాణ కు అన్యాయం చేస్తారు. తెలంగాణ కు ప్రత్యామ్నాయం బిజెపినే. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం లో మోది తల్లి, కులం , తండ్రి గురించి మాట్లాడడం అవసరమా.? దేశాన్ని నష్ట పరిచిన కాంగ్రెసు ను మళ్ళీ రానీయవద్దు. కాంగ్రెస్‌ ఓడిపోయిన రాష్ట్రాలలో ప్రజలు మళ్ళీ అవకాశం ఇవ్వలేదు. తమిళ నాడు, యుపి, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, జార్కండ్‌ రాష్ట్రాలే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ లో కూడా కాంగ్రెస్‌ కు ఒక్క సీటు కూడా గెలిపించవద్దని ప్రధాని పిలుపును ఇచ్చారు.

వంద కోట్లతో ఇందుర్‌ అభివద్ధి : ఎండల లక్ష్మీనారాయణ

కేంద్ర ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులను నిజామాబాద్‌ అభివ ద్ధి కొరకు విడుదల చేసింది అని నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. .2014లో బిజెప కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పింఛన్‌ చేసింది. పేదలకు 2020 సంవత్సరం నాటికి నిజామాబాద్‌ లో ఇరవై వేలు ఇళ్లు నిర్మించి ఇస్తాం. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించాలని ఎండల లక్ష్మీనారాయణ కోరారు.

రౌడీ రాజకీయం: వినయ్‌ రెడ్డి ఆర్మూర్‌ అభ్యర్థి

ఆర్మూరులో అవినీతి రౌడీయిజం కబ్జాలు మాత్రమే అభివ ద్ధి చెందాయని ఆర్మూర్‌ అభ్యర్థి వినయ్‌ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజలకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఆర్మూర్లో ఎలాంటి అభివ ద్ధి పనులు జరగలేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసితనను గెలిపిస్తే సామాన్య ప్రజలకుఅందుబాటులో వుండి సమస్యలను పరిష్కరిస్తానని బిజెపి ఆర్మూర్‌ అభ్యర్థి వినయ్‌ రెడ్డి అన్నారు. అంతకు ముందే వివిధ నియేజక వర్గ అభ్యర్థులు ప్రంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here