Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

మోదీ-షా కొత్త టార్గెట్‌

ఉమ్మడి పౌరస్మృతి బిల్లు..

  • అయోధ్యపై నిర్ణయం
  • చర్చనీయాంశంగా ఎన్నికల హావిూలు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

చట్టబద్ధంగా కల్లోల కశ్మీరం ప్రశాతం. అయితే భాజపా అగ్రగణ్యులు మోడీ, అమిత్‌ షాలు సంతృప్తిగా లేరు. ఇదే వేడిలో మరో సంచలనాలకు వ్యూహాత్మక రచన చేస్తున్నారు. గత 72 గంటల్లో ఈ ఇద్దరు నాయకులు అత్యంత రహస్యంగా సుమారు తొమ్మిది సార్లు కలిశారు. ఎందుకు కలిశారనే విషయంపై అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇదీ జరిగింది:

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్పీకరించినప్పటి నుంచి మూడోకంటికి తెలియకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు, ఆందోళనలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా అనూహ్యమైన చర్యలను చేపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, పాకిస్తాన్పై మెరుపుదాడులు, బాలాకోట్పై వైమానిక దాడి వంటి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రత్తిపత్తి ¬దా కల్పిస్తున్న ఆర్టికల్‌ ఊహించని విధంగా 370ని రద్దు చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఈ చర్య దేశ ప్రజలనే కాక యావత్‌ ప్రపంచ దేశాలను మోడి వేగవంతమైన దూకుడు ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కేంద్ర ¬ంశాఖమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హావిూ మేరకు ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని చెప్పారు. దీంతో మోదీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, దేనిపై తీసుకుంటారన్న అంశం ఉత్కంఠగా మారింది.

ఉమ్మడి పౌరస్మృతి..:

ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో హావిూ ఇచ్చినట్లు మోదీ సర్కారు తదుపరి అడుగు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టడం వైపేనా! ఆ దిశగా ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకోనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే వీటికి ‘ఔను’ అనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి.. ఇవన్నీ దశాబ్దాలుగా బీజేపీ ఎజెండాలో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యంకాలేదు.

‘రాజ్యసభ’కై కసరత్తులు:

లోక్‌ సభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సరిపడ బలం లేదు. దీంతో మోడీ సర్కార్‌ ఆచితూచి అడుగులు వేసింది. ప్రస్తుతం ఇలాంటి అనుమానాలకు అంతగా తావులేకుండా పార్లమెంట్‌ లో ప్రత్యేమైన వ్యూహాలను రచిస్తున్నారు. లోక్సభలో సంపూర్ణ మెజార్టీ ఉండటం, రాజ్యసభలో కూడా విపక్షాల నుంచి ఎంతోకొంత మద్దతు లభించడం కేంద్ర ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం.

ఊపునిచ్చిన ట్రిపుల్‌ తలాక్‌..

370 ఆర్టికల్ను మోదీ సర్కారు నిర్వీర్యం చేయడంతో బీజేపీ సర్కారు తన మేనిఫేస్టోలో ప్రకటించిన ‘హావిూ’లను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో సంఖ్యాపరంగా, సిద్ధాంతపరంగా పరిమితులున్నా ట్రిపుల్‌ తలాక్‌ నిషేధ బిల్లు, 370 ఆర్టికల్ను రద్దు చేసే బిల్లు ఆమోదం పొందడం బీజేపీ సర్కారుకు ఊపునిచ్చింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేసేందుకు బీజేపీ ఇక ఎంత మాత్రం సందేహించకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.

మన దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంశం చాలాకాలంగా ఆలోచనల స్థాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకూ ఎలాంటి ఫలవంతంగా చర్చలు గానీ, నిర్ణయాలు గానీ జరగలేదు. ఉమ్మడి పౌరస్మృతి గురించి భారత రాజ్యాంగంలోని 44వ అధికరణంలో ఏకపంక్తి వాక్యంలో ప్రస్తావించారు. ‘ప్రభుత్వం భారత భూ భాగమంతటా పౌరులందరికీ ఒకే విధమైన పౌరస్మృతి తీసుకొని రావటానికి ప్రయత్నించాలి’ అని మాత్రమే రాసి ఉండడంతో దీనిపై ఏ ప్రభుత్వమూ ఇప్పటి వరకూ సరైన నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం దేశంలో ఒక్క గోవాలో మాత్రమే దీనిని అమలు చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దీనిని దేశమంతా అమలు చేయండని పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

విషాదంలోనూ… ఆశయ చర్చలు:

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని కేంద్రం భావిస్తోంది. బుధవారం ఒకవైపు ‘సుష్మాస్వరాజ్‌’ విషాదాంతంలో బాధను దిగమింగుకుంటూ మరోవైపు భాజపా వ్యూహాలపై ఆ పార్టీ అగ్రగణ్యులు కసరత్తులు చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close