జాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

మోదీ, కేసీఆర్‌ ఒక్కటే..

  • ఈడీ కేసుపెట్టి వేధిస్తున్నారు
  • కేసీఆర్‌కు తెలిసి హరీష్‌ను పక్కన పెట్టాడు
  • కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : మోదీ, కేసీఆర్‌లు ఇద్దరు ఒక్కటేనని. కాబట్టే తనపై ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కేవలం రాజకీయంగా వేధించడానికే ఈడీ కేసులు వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విూడియాతో చిట్‌చాట్‌లో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, మోదీ ఒక్కటయ్యారు కాబట్టే తన విూద ఈడీ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ. 150 కోట్లు సీజ్‌ చేశారని, అందరి విూదా ఈడీ కేసు పెట్టారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పట్నం నరేందర్‌ రెడ్డి దగ్గర రూ. 50 లక్షలు దొరికాయని, మరి ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదని రేవంత్‌ సూటిగా ప్రశ్నించారు. తన విూద చార్జ్‌షీట్‌ వేసిన తర్వాత మళ్ళీ ఈడీకి ఎందుకు అప్పగించారని, కేవలం రాజకీయంగా వేధించడానికే ఈడీ కేసును వాడుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ లో ఉన్న 30మందికి హరీష్‌ రావు ఎన్నికల ఖర్చు ఇచ్చారని రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ లో కొందరు తీసుకోలేదని, టిఆర్‌ఎస్‌ లో 26మంది తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ కి తెలియకుండా ఇవ్వడం వల్లే.. ఆయన్ని కేసిఆర్‌ పక్కన పెట్టారని రేవంత్‌ ఆరోపించారు. అమిత్‌ షా తో హరీష్‌ మాట్లాడిన వీడియోని సీఎం పిలిచి వినిపించారని అన్నారు. హరీష్‌ కి మంత్రి పదవి ఉండదని రేవంత్‌ రెడ్డి చెప్పారు. త్వరలోనే హరీష్‌ వ్యవహారానికి చెందిన డాక్యుమెంట్లు బయట పెడతానని స్పష్టం చేసారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ కంటే హరీశ్‌ రావే అర్హుడని అన్నారు. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న నాయకుడిగా హరీశ్‌పై ప్రజల్లో సానుభూతి ఉందన్నారు. కోటపల్లి, గౌరారం రిజర్వాయర్లలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని రేవంత్‌ ఆరోపించారు. దానిలో హరీశ్‌ రూ. 600కోట్లు వెనకేసుకున్నారన్నారు. ఆ డబ్బులను మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పంచారని విమర్శించారు. 30 మందికి ఎన్నికల నిధులు ఇచ్చినట్లు.. కేసీఆర్‌కు ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇచ్చిందని రేవంత్‌ చెప్పారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close