Featuredజాతీయ వార్తలు

దేశ ప్రతిష్ఠను మోదీ దెబ్బతీస్తున్నారు రాహుల్‌..

జైపూర్‌: ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేదని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. గత యూపీయే హయాంలో కంటే తాజాగా ఆర్థిక వద్ధిరేటు పడిపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన యువ ఆక్రోశ్‌ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్‌ పాలన తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యువతను దేశ సంపదగా అభివర్ణించిన రాహుల్‌.. ఈ సంపదను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి, సామరస్యతకు ప్రతీకగా నిలచిన భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా పెట్టుబడులు నిలిచిపోయేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ హయాంలో గతేడాది దాదాపు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగం, భారత్‌ భవిష్యత్తు తదితర అంశాలపై యువత గళమెత్తాలని పిలుపునిచ్చారు. దేశంలో శాంతి, సామరస్యతను దెబ్బతీస్తూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నా.. ఈ అంశంపై ప్రధాని ఒక్క మాటా మాట్లాడటంలేదని మండిపడ్డారు. యువ ఆక్రోశ్‌ ర్యాలీలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లూెత్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close