నేడు మోడీ రాక..

0

నిజామాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): పట్టణంలో ని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మైదానాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఎస్‌పీజీ యంత్రాంగం ఆ ప్రాంతాల్లో ఆంక్షలు విధిం చింది. లక్ష మంది సభకు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

శ్రీ ఈనెల 27న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ సభకు హాజరవుతున్నారు. మొత్తం మూడు హెలికాప్టర్లలో ఆయన వస్తుండగా.. ఇందుకోసం హెలిప్యాడ్‌లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎస్‌పీజీ, స్థానిక పోలీసులు పూర్తి నిఘా ఉంచారు. సీపీ కార్తికేయ ఆదివారం హెలిప్యాడ్‌ వద్ద పరిశీలించి బందోబస్తు విషయంలో పలు సూచనలు చేశారు.

లక్ష మంది కూర్చునేలా..:

సభలో లక్ష మంది కూర్చుండేలా సీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే భాజపా శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యువమోర్చా కార్యకర్తలతో సైన్యాన్ని తయారు చేశారు. వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి సభలో వచ్చిన వారికి సేవలు అందించేలా చూస్తున్నారు.

శ్రీ రాష్ట్ర ఇన్‌ఛార్జి ప్రదీప్‌ జీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆదివారం మైదానంలో పనులను ప్రారంభిచారు. పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 10.30 గంటల్లోపు సభ ప్రారంభం కావల్సి ఉన్న నేపథ్యంలో జన సమీకరణ కోసం అందరు అభ్యర్థులను సమన్వయం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఉదయం పూట జనం తరలిరావటం అంత సాధ్యం కాకపోవటంతో నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, రూరల్‌ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తరలించేలా కసరత్తు జరుగుతోంది. పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో జన సమీకరణకు ప్రత్యేక రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసి ఆ విధంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

శ్రీ సభా వేదిక ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌ సోమవారం పరిశీలించారు.

హెలికాప్టర్ల ట్రయల్‌రన్‌:

మొత్తం మూడు హెలికాప్టర్లతో ప్రధాని మోదీ జిల్లాకు వస్తున్నారు. ఇందుకోసం హెలిప్యాడ్‌లు సిద్ధం చేయగా.. ఆదివారం రెండు చాపర్లు ట్రయల్‌రన్‌ పూర్తి చేశాయి. తదనంతరం హెలిప్యాడ్‌ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here