అంబానీకి మోడీ గిఫ్ట్‌ రూ.30వేల కోట్లు

0

రాయ్‌పూర్‌ : దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని ప్రజలు బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే కుంభకోణాలతో ప్రజల సొమ్ము లూటీ చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంకెర్‌లో శుక్రవారంనాడు జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. మోదీ సర్కార్‌ విధానాలు, పనితీరుపై విమర్శలు గుప్పించారు. రాఫెల్‌డీల్‌కు సంబంధించి మరోసారి ప్రధాని మోదీపై రాహుల్‌ నిప్పులు కక్కారు. రూ.30,000 కోట్ల డీల్‌ను పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి మోదీ బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తోందన్నారు. రాఫేల్‌ రాకెట్‌ జెట్‌ల కొనుగోలు విషయంలో ఒక్కో విమానం రూ.526 కోట్లకు కొనుగోలు చేయాలని యూపీఏ సర్కార్‌ నిర్ణయించగా, రూ.1,600 కోట్ల చొప్పున చెల్లించేలా ధరల మార్పునకు మోదీ ప్రభుత్వం నిర్ణయించిందంటూ తప్పుప్టటారు. హిందుస్థాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి ఆ డీల్‌ను తప్పించి అంబానీలకు ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పారు. మోదీ సర్కార్‌ తీసుకు వచ్చిన పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులే కడగండ్ల పాలయ్యారని రాహుల్‌ అన్నారు. ‘విూరంతా పెద్దపెద్ద క్యూలలో నించుకున్నారని, నల్లకుబేరులు ఒక్కరైనా క్యూలో నిలబడటం విూరు చూశారా అని ప్రశ్నించారు. నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి వాళ్లు విూ సొమ్ములతో విదేశాలు పారిపోయారని ఆయన బీజేపీ సర్కార్‌పై చురకలు వేశారు. అంతర్జాయంగా ఇంధనం ధరలు తగ్గుతుంటే ఇండియాలో ఇంధనం ధరలు పెరుగుతూ పోతున్నాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here